HMD 225 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Aug 2024 05:57:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD 225 4G: నెట్టింట్లో లీకైన హెచ్ఎండి 225 4జీ స్పెసిఫికేషన్స్, రెండర్స్ https://www.91mobiles.com/telugu/hmd-225-4g-specs-renders-leaked-on-the-internet/ https://www.91mobiles.com/telugu/hmd-225-4g-specs-renders-leaked-on-the-internet/#respond Thu, 01 Aug 2024 05:57:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=12776 ఫిన్‌ల్యాండ్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD ఇటీవలె భారతీయ మార్కెట్ లో HMD Crest, HMD Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా HMD 225 4G అనే ఫీచర్ ఫోన్ యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న Nokia 225 4G కి రీబ్రాండ్ వర్షన్ అని భావిస్తున్నారు. ఓసారి HMD […]

The post HMD 225 4G: నెట్టింట్లో లీకైన హెచ్ఎండి 225 4జీ స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD 225 4G లాంచ్
  • 2.4-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్
  • 1450mAh బ్యాటరీ, 2ఎంపి కెమెరా

ఫిన్‌ల్యాండ్‌కి చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD ఇటీవలె భారతీయ మార్కెట్ లో HMD Crest, HMD Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా HMD 225 4G అనే ఫీచర్ ఫోన్ యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న Nokia 225 4G కి రీబ్రాండ్ వర్షన్ అని భావిస్తున్నారు. ఓసారి HMD 225 4G యొక్క వివరాలను తెలుసుకుందాం.

త్వరలో HMD 225 4G లాంచ్

టిప్‌స్టర్ HMD Meme సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై HMD 225 4G యొక్క రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్‌ను షేర్ చేశారు. రెండర్స్ చూస్తే, ఇది నోకియా 225 4జీ మాదిరి ఉన్నట్లు అనిపిస్తోంది.

HMD 225 4G డివైజ్ ముందువైపు కీప్యాడ్, స్క్రీన్ ఉన్నాయి. వెనుకవైపు, సింగిల్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. అలాగే హెచ్ఎండి బ్రాండింగ్ కూడా ఉంది.

HMD 225 4G ఫీచర్ ఫోన్ బ్లూ, పింక్ మరియు గ్రీన్ కలర్స్ లో లభించనుందని రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

HMD 225 4G డివైజ్ లో 2.4-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయని సమాచారం.

HMD 225 4G లో యూనిఎస్ఓసీ టీ107 చిప్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇదే చిప్సెట్‌ను నోకియా 225 లో కూడా వాడారు.

HMD 225 4G ఫీచర్ ఫోన్ లో 2ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. దీని ద్వారా హెచ్‌డీ వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.

హెచ్ఎండి 225 4జీ ఫీచర్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు.

కనెక్టివిటీ విషయానికి వస్తే, HMD 225 4G లో బ్లూటూత్ 5.0, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 ప్రొటెక్షన్ ఉంటాయి.

The post HMD 225 4G: నెట్టింట్లో లీకైన హెచ్ఎండి 225 4జీ స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-225-4g-specs-renders-leaked-on-the-internet/feed/ 0