HMD Barbie flip - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 28 Aug 2024 11:04:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD Barbie Flip: గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి బార్బీ ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-globally-launched-know-full-details/ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-globally-launched-know-full-details/#respond Wed, 28 Aug 2024 11:04:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=13213 ఫిన్‌ల్యాండ్‌కి చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు HMD నేడు గ్లోబల్‌గా మ్యాటెల్ కంపెనీతో కలిసి HMD Barbie Flip అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునే వారు ఈ బార్జీ ఫ్లిప్ ను ప్రయత్నించవచ్చు. మరి, ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి ఫీచర్లను తెలుసుకుందామా? HMD Barbie Flip ప్రత్యేకతలు HMD Barbie Flip ఫీచర్ ఫోన్ పింక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. అలాగే ఐటర్ డిస్ప్లే […]

The post HMD Barbie Flip: గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి బార్బీ ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా HMD Barbie Flip లాంచ్
  • 2.8-ఇంచ్ క్యూవీజీఏ మెయిన్ స్క్రీన్
  • యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్

ఫిన్‌ల్యాండ్‌కి చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు HMD నేడు గ్లోబల్‌గా మ్యాటెల్ కంపెనీతో కలిసి HMD Barbie Flip అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునే వారు ఈ బార్జీ ఫ్లిప్ ను ప్రయత్నించవచ్చు. మరి, ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి ఫీచర్లను తెలుసుకుందామా?

HMD Barbie Flip ప్రత్యేకతలు

HMD Barbie Flip ఫీచర్ ఫోన్ పింక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. అలాగే ఐటర్ డిస్ప్లే పై ఒక స్క్రీన్ ఉంటుంది. దీన్ని మిర్రర్ లాగా వాడుకోవచ్చు. రెండు ఇంటర్ ఛేంజబుల్ బ్యాక్ కవర్స్ తో ఫోన్ వస్తోంది.

HMD Barbie Flip డివైజ్ బాక్స్ తో పాటు బార్బీ స్టిక్కర్స్, స్టిక్-ఆన్ క్రిస్టల్స్, ఫ్లవర్స్, ఫ్లెమింగోస్ మరియు రెయిన్‌బోస్ వస్తాయి. కస్టమర్లు తన ఛాయిస్ ప్రకారం ఫోన్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ కూడా కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ తో వస్తోంది. ఇందులో భాగంగా బార్బీ వాల్‌పేపర్స్ మరియు బార్బీ యాప్ ఐకన్స్ అందించారు.

HMD Barbie Flip ఫోన్ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Barbie Flip డివైజ్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ ఇంటర్నల్ స్క్రీన్, 1.77-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్ ఉంటాయి.

చిప్సెట్: HMD Barbie Flip లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: HMD Barbie Flip డివైజ్ 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 32జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: ఇప్పుడు కెమెరా వివరాలు తెలుసుకుందాం. HMD Barbie Flip లో వీజీఏ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

బ్యాటరీ: HMD Barbie Flip లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 9 గంటల టాక్ టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: HMD Barbie Flip డివైజ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ-పోర్, జీఎస్ఎమ్/జీపీఆర్ఎస్ 900/1800, డబ్ల్యూసీడీఎంఏ, ఎల్టీఈ క్యాట్1 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: HMD Barbie Flip డివైజ్ 108.4 మి.మీ పొడవు, 55.1 మి.మీ వెడల్పు, 18.9 మి.మీ మందం, 123.5 గ్రాముల బరువు ఉంటుంది.

HMD Barbie Flip ధర, లభ్యత

HMD Barbie Flip డివైజ్ ధరను యూకే లో 99 పౌండ్లు (సుమారు రూ.11,000) గా ఉంది. ఇతర యూరోపియన్ దేశాల్లో 129 యూరోలు (సుమారు రూ.12,000) గా ఉంది. నేటి నుంచి ఈ దేశాల్లో ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

HMD Barbie Flip ధర యూఎస్ లో 129 డాలర్లు (సుమారు రూ.10,800) గా ఉంది. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి సేల్ మొదలవుతుంది.

The post HMD Barbie Flip: గ్లోబల్‌గా లాంచైన హెచ్ఎండి బార్బీ ఫ్లిప్ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-globally-launched-know-full-details/feed/ 0
HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/#respond Fri, 09 Aug 2024 10:32:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12914 Nokia బ్రాండ్ హోల్డర్, హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) సంస్థ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో HMD Barbie Flip ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్తు 28వ తేదీన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఇండియా లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. HMD Barbie Flip […]

The post HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Barbie Flip లాంచ్
  • టీఈఎన్ఏఏ పై లిస్టైన ఫోన్
  • ఇంకా ఖరారు కాని ఇండియా లాంచ్

Nokia బ్రాండ్ హోల్డర్, హ్యూమన్ మొబైల్ డివైజెస్ (HMD) సంస్థ త్వరలో గ్లోబల్ మార్కెట్ లో HMD Barbie Flip ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్తు 28వ తేదీన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఇండియా లాంచ్ వివరాలు ఇంకా తెలియలేదు. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ TENAA పై లిస్ట్ అయ్యింది. దీంతో HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

HMD Barbie Flip TENAA సర్టిఫికేషన్ వివరాలు

HMD Barbie Flip డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై TA-1681 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫ్లిప్ ఫోన్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ, వొల్టీ, డ్యూయల్ సిమ్, ఫిజికల్ కీప్యాడ్, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తోంది.

టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ ద్వారా HMD Barbie Flip యొక్క లైవ్ ఇమేజెస్ కూడా రివీల్ అయ్యాయి. పింక్ కలర్ వేరియంట్ ఇమేజెస్ లో కనిపిస్తోంది. ఇమేజెస్ ద్వారా పోర్ట్ ప్లేస్మెంట్స్, డిజైన్ ఎలిమెంట్స్, కీప్యాడ్ కనిపిస్తున్నాయి. రియర్ ప్యానెల్ పై బార్బీ బ్రాండింగ్ ఉంది.

HMD Barbie Flip ఫోన్‌లో 2.8-ఇంచ్ టీఎఫ్‌టీ స్క్రీన్, 240*320 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1.77-ఇంచ్ టీఎఫ్‌టీ సెకండరీ డిస్ప్లే, 128*160 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

HMD Barbie Flip ఫోన్ లో సింగిల్-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.05 గిగాహెర్ట్జ్. 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీ ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 32జిబి వరకు పెంచుకునే వీలుంటుంది.

HMD Barbie Flip లో సింగిల్ రియర్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఈ ఫోన్ 108 మి.మీ పొడవు, 55 మి.మీ వెడల్పు, 18.9 మి.మీ మందం, 123 గ్రాముల బరువు ఉంటుంది. ఆగస్టు 28వ తేదీన ఈ ఫ్లిప్ ఫోన్ లాంచ్ అవుతుంది.

The post HMD Barbie Flip: TENAA సర్టిఫికేషన్ ద్వారా రివీలైన బార్బీ ఫ్లిప్ ఫోన్ లైవ్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-live-images-specs-revealed-via-tenaa-listing/feed/ 0
HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/#respond Wed, 31 Jul 2024 16:09:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12764 HMD బ్రాండ్ తన డివైజెస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలె హెచ్ఎండి సంస్థ భారత్ లో HMD Crest, Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తన గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై కొత్త ఫోన్ HMD Barbie flip యొక్క లాంచ్ వివరాలను షేర్ చేసింది. అలాగే డివైజ్ గ్లిమ్స్ ను కూడా టీజర్ లో రివీల్ చేసింది. ఓసారి ఆ […]

The post HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Barbie flip లాంచ్
  • ఆగస్టు 28న లాంచ్
  • Nokia 2660 flip లాగా కనిపిస్తోన్న ఫోన్

HMD బ్రాండ్ తన డివైజెస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలె హెచ్ఎండి సంస్థ భారత్ లో HMD Crest, Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తన గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై కొత్త ఫోన్ HMD Barbie flip యొక్క లాంచ్ వివరాలను షేర్ చేసింది. అలాగే డివైజ్ గ్లిమ్స్ ను కూడా టీజర్ లో రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ

HMD Barbie flip ఫోన్ వివరాలను సోషల్ మీడియా వేదిక X పై సదరు సంస్థ షేర్ చేసింది. ఆగస్టు 28న ఫోన్ లాంచ్ కానుందని తన పోస్ట్ లో హెచ్ఎండి కంపెనీ తెలిపింది. ఇమేజ్ లో డివైజ్ కూడా కనిపిస్తోంది.

HMD Barbie flip ఫోన్ బ్రైట్ పింక్ బోర్డర్ తో కనిపిస్తోంది. దాంతో పాటు, హెచ్ఎండి బ్రాండింగ్ కూడా ఉంది.

HMD Barbie flip కి సంబంధించి ఇప్పటివరకు పెద్దగా వివరాలేమీ తెలియలేదు. అయితే ఇది ఫీచర్ ఫోన్ అని అంచనా వేస్తున్నారు. చూడటానికి, Nokia 2660 flip మాదిరి కనిపిస్తోంది.

Nokia 2660 flip డీటెయిల్స్

Nokia 2660 flip ఫోన్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 1.77-ఇంచ్ క్యూవీజీఏ సెకండరీ డిస్ప్లే ఉన్నాయి.

Nokia 2660 flip డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.

Nokia 2660 flip లో 0.3ఎంపి కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 4.2, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.

Nokia 2660 flip ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 48ఎంబి ర్యామ్, 128ఎంబి ఇంటర్నల్ స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 32జిబి వరకు పెంచుకునే వీలుంది. Nokia 2660 flip ధర రూ.4,299 గా ఉంది.

The post HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-barbie-flip-launch-date-confirmed-teaser-released/feed/ 0