HMD Pulse - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jul 2024 05:55:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/#respond Thu, 11 Jul 2024 05:54:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=12458 Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. భారత్ […]

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో హెచ్ఎండి ఫోన్ లాంచ్
  • తాజాగా ఖరారైన లాంచ్ తేదీ
  • జులై 25న హెచ్ఎండి ఫోన్ ఎంట్రీ

Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.

భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్

జులై 25వ తేదీన HMD సంస్థ భారత్ లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించనుందని సమాచారం. అయితే, ఈ ఫోన్ పేరుని ఇంతవరకు HMD సంస్థ ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ ఫోన్ పేరు వెల్లడయ్యే అవకాశం ఉంది.

HMD నుంచి రాబోవు డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన HMD Pulse కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. ఓసారి హెచ్ఎండి పల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Pulse స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Pulse లో 6.65-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Pulse లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: HMD Pulse డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse డివైజ్ 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 256జిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Pulse లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్, ఏఎఫ్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Pulse లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: HMD Pulse లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Pulse లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఓజో ఆడియో, ఐపీ52 రేటింగ్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/feed/ 0