HMD - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 Jul 2024 05:55:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/ https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/#respond Thu, 11 Jul 2024 05:54:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=12458 Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. భారత్ […]

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో హెచ్ఎండి ఫోన్ లాంచ్
  • తాజాగా ఖరారైన లాంచ్ తేదీ
  • జులై 25న హెచ్ఎండి ఫోన్ ఎంట్రీ

Nokia లైసెన్స్ హోల్డర్ HMD ఇప్పటికే గ్లోబల్ గా తన సొంత బ్రాండ్ హెచ్ఎండి పేరుతో ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ పేరు ఇదివరకు HMD Arrow గా అనుకున్నప్పటికీ, కొన్ని రోజుల క్రితం పేరు మార్చబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా ఈ ఫోన్ పేరుని హెచ్ఎండి కన్ఫర్మ్ చేయలేదు. అయితే జులై 25వ తేదీన భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.

భారత్ లో HMD కొత్త ఫోన్ లాంచ్

జులై 25వ తేదీన HMD సంస్థ భారత్ లో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించనుందని సమాచారం. అయితే, ఈ ఫోన్ పేరుని ఇంతవరకు HMD సంస్థ ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ ఫోన్ పేరు వెల్లడయ్యే అవకాశం ఉంది.

HMD నుంచి రాబోవు డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన HMD Pulse కి రీబ్రాండ్ వర్షన్ అని సమాచారం. ఓసారి హెచ్ఎండి పల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Pulse స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Pulse లో 6.65-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Pulse లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ వాడారు.

సాఫ్ట్‌వేర్: HMD Pulse డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌కి 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse డివైజ్ 6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 256జిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Pulse లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్, ఏఎఫ్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Pulse లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: HMD Pulse లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Pulse లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఓజో ఆడియో, ఐపీ52 రేటింగ్, సింగిల్ స్పీకర్ ఉన్నాయి.

The post HMD: భారతదేశపు తొలి హెచ్ఎండి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/hmd-first-phone-india-launch-date-confirmed-know-full-details/feed/ 0
HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు https://www.91mobiles.com/telugu/hmd-phones-showcased-mobile-world-congress-2024/ Sun, 25 Feb 2024 17:13:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10413 HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి. HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ […]

The post HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండీ ఫోన్లు
  • నేడు ప్రదర్శితమైన డివైజెస్
  • రివీలైన డిజైన్, ఫోటోస్

HMD బ్రాండ్ మొబైల్ ఫోన్లు త్వరలో రానున్నాయని సదరు సంస్థ కొన్ని రోజుల క్రితం అధికార ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి వినియోగదారులు, టెక్నాలజీ ఔత్సాహికులు ఈ ఫోన్ల లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా బార్సిలోనాలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో హెచ్ఎండీ సంస్థ తాను లాంచ్ చేయబోయే ఫోన్లను ప్రదర్శించింది. సరే, ఓసారి హెచ్ఎండీ ఫోన్ల యొక్క ఫోటోలు, డిజైన్ గురించి తెలుసుకుందాం పదండి.

HMD ఫోన్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి?

  • HMD Global కొన్ని రోజుల క్రితం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తాము రాబోయే రోజుల్లో నోకియా బ్రాండ్ తో పాటు, హెచ్ఎండీ బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో తన కొత్త మొబైల్ ఫోన్లను ప్రదర్శించింది.
  • HMD Global తన ఫోన్ల లాంచ్ తేదీని వెల్లడించలేదు. అయితే 2024 వేసవి కాలంలో లాంచ్ అవుతాయని ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో హెచ్ఎండీ కంపెనీ తెలిపింది.
  • త్వరలోనే HMD Global సంస్థ తన కొత్త ఫోన్ల లాంచ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
  • యూజర్ ఇంటివద్దే రిపేరు చేసుకునే విధంగా ఉండే ఫోన్లను తాము తీసుకురాబోతున్నట్లు HMD Global తెలిపింది.
  • అంటే యూజర్ తన డివైజ్ ని సొంతంగా రిపేరు చేసుకోవడంతో పాటు మొబైల్ భాగాలను కూడా మార్చే అవకాశం ఉంటుందన్నమాట.
  • హెచ్ఎండీ ఫోన్ తో పాటు యూజర్ కి ఒక రిపేర్ కిట్ కూడా అందించబడుతుందని సమాచారం.

సరసమైన ధరలకే లభించనున్న HMD ఫోన్లు

  • HMD స్మార్ట్‌ఫోన్లు మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతాయని సమాచారం.
  • అన్ని వర్గాల యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్లను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
  • HMD Global తీసుకొచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్ల ధర రూ.12,000 నుంచి రూ.18,000 లేదా రూ.20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • అయితే, త్వరలో HMD Global తన కొత్త డివైజెస్ పేర్లు, లాంచ్ తేదీ, ధర శ్రేణి వంటి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

The post HMD: ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024’ ఈవెంట్‌లో ప్రదర్శితమైన హెచ్ఎండీ ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! https://www.91mobiles.com/telugu/9-hmd-phones-listed-on-imei-database/ Mon, 05 Feb 2024 17:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=10096 HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి. త్వరలో లాంచ్ కానున్న 9 HMD […]

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • ఒకేసారి 9 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజెస్

HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.

త్వరలో లాంచ్ కానున్న 9 HMD స్మార్ట్‌ఫోన్లు

  • HMD సంస్థ ప్రస్తుతం 11 ఉత్పత్తులపై పని చేస్తున్నట్లు GSMChina తన కథనం ద్వారా వెల్లడించింది. అయితే తాజాగా ఐఎంఈఐ డేటాబేస్ పై 9 డివైజెస్ లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన TA-1584, TA-1588, TA-1589, TA-1592, TA-1594, TA-1595, TA-1602, TA-1605 మరియు TA-1631 డివైజెస్ ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.
  • HMD బ్రాండ్ కి చెందిన కొత్త ఫోన్ వివరాలు ఇంకా తెలియలేదు. కానీ, గతంలో వచ్చిన సమాచారాన్ని బట్టి, HMD ఫోన్ 108ఎంపి ఓఐఎస్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • వచ్చే నెల జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో HMD ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.

HMD చేయబోయేదేంటి?

  • HMD గ్లోబల్ సంస్థ వద్ద Nokia లైసెన్స్ వ్యవధి 2026 వరకు ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం, HMD కంపెనీ రానున్న రోజుల్లో నోకియా మరియు HMD పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.
  • 2024 లో లాంచ్ కాబోయే Nokia ఫోన్లు ఆఫ్-లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు, HMD బ్రాండ్ ఫోన్లు ఆన్‌లైన్ మార్కెట్ మరియు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ స్ట్రేటజీ వల్లన ఫోన్ల యొక్క ధరలపై కూడా ప్రభావం ఉంటుంది.
  • ఆన్‌లైన్ లో లభించే హెచ్ఎండీ ఫోన్లు సరసమైన ధరలకు లభించగా, ఆఫ్‌లైన్ మార్కెట్ లో లభించే నోకియా ఫోన్లు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి.

The post HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్! first appeared on 91Mobiles Telugu.

]]>