Honda Activa E - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 07:32:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2024 మార్చిలో ‘హోండా యాక్టివా’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/honda-activa-electric-scooter-launch-timeline-march-2024/ Thu, 26 Jan 2023 09:09:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4652 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా త్వరలోనే Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు కంపెనీ సీఈవో అట్సుషీ ఒగాటా ఓ ప్రకటన చేశారు. 2024 మార్చి నెలలో Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో లాంచ్ అవుతుందని ఆయన తెలిపారు. గతేడాది ఒగాటా స్వయంగా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆయనే టైమ్‌లైన్ ని కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న Honda Activa […]

The post 2024 మార్చిలో ‘హోండా యాక్టివా’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 మార్చిలో భారత్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయబోతోన్న Honda
  • Honda Activa ఎలక్ట్రిక్ వర్షన్ తో వస్తోన్న కంపెనీ, స్థానికంగానే ఉత్పత్తి
  • సరికొత్త ప్లాట్ఫామ్ మరియు స్వాపబుల్ బ్యాటరీ ఫీచర్స్ తో వస్తోన్న Honda Activa ఈ-స్కూటర్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా త్వరలోనే Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు కంపెనీ సీఈవో అట్సుషీ ఒగాటా ఓ ప్రకటన చేశారు. 2024 మార్చి నెలలో Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్ లో లాంచ్ అవుతుందని ఆయన తెలిపారు. గతేడాది ఒగాటా స్వయంగా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆయనే టైమ్‌లైన్ ని కూడా వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న Honda Activa పెట్రోల్ వర్షన్ స్కూటర్ ఆధారంగానే కొత్త యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ రూపొందనుంది. అయితే పెట్రోల్ ఇంజిన్ స్థానంలో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉంటుంది. Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కేఎంపీహెచ్ అని కంపెనీ చెబుతోంది. దీని తర్వాత హోండా కంపెనీ మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ ని స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ తో పరిచయం చేయనుంది.

భారత్ లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం

2024 మార్చిలో Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కానుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఐసీఈ-పవర్డ్ యాక్టివా ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ బండి రూపొందనుంది. స్థానికంగా తయారయ్యే ఎలక్ట్రిక్ మోటర్, బ్యాటరీని ఈ స్కూటర్ లో వాడనున్నారు. హోండా కూడా స్కూటర్ బాడీ పార్ట్స్, బ్రేకింగ్ సిస్టమ్ తదితర వాటిని స్వయంగా సమకూర్చనుంది.

Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ లో వాడే పవర్‌ట్రెయిన్ 50 కేఎంపీహెచ్ అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఇంకా ఈ బండి యొక్క రేంజ్, బ్యాటరీ ప్యాక్ వివరాలు తెలియలేదు. అలాగే బండి ధర కూడా ఇంకా తెలియాల్సి ఉంది. Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్, Ather 450 Plus, Ola S1 స్కూటర్లతో పోటీ పడనుంది.

హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సీఈవో ఒగాటా మాట్లాడుతూ.. తమ కంపెనీ ప్రస్తుతం జపనీస్ టీమ్ సాయంతో భారత్ లోనే Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెవలప్ చేస్తోందని అన్నారు. భారత్ లోని హోండా ప్లాంట్ లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ మోడల్స్ ని తయారు చేసేందుకై ప్రస్తుతం ఉన్న ఫెసిలిటీస్ అభివృద్ధి కోసం మరింతగా పెట్టుబడులు పెట్టనున్నామని ఒగాటా చెప్పారు.

హోండా యాక్టివాతో పాటు మరొక ఈ-స్కూటర్ ని లాంచ్ చేయనున్న హోండా?

Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ తర్వాత హోండా తన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ ని సరికొత్త ప్లాట్ఫామ్ పై మరియు స్వాపబుల్ టెక్నాలజీతో తీసుకురానుంది. హోండా 6000 లకు పైగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ని తన కస్టమర్ టచ్ పాయింట్స్ వద్ద ఇన్‌స్టాల్ చేయనుంది. ఇదంతా తన రెండో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కి ముందే జరగనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2024 మార్చిలో ‘హోండా యాక్టివా’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
ఎలక్ట్రిక్ అవతారంలో వస్తోన్న Honda Activa; తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ https://www.91mobiles.com/telugu/honda-active-e-electric-scooter-launch-2023/ Tue, 06 Sep 2022 08:27:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=2123 హైలైట్స్: త్వరలో లాంచ్ కానున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మేడ్ ఫర్ ఇండియా ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పై రూపొందిన స్కూటర్ 2023 లో భారత్ లో అడుగు పెట్టనున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ Activa E ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: హోండా మోటర్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. రూమర్లు నిజమైతే, Activa E […]

The post ఎలక్ట్రిక్ అవతారంలో వస్తోన్న Honda Activa; తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో లాంచ్ కానున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్
  • మేడ్ ఫర్ ఇండియా ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పై రూపొందిన స్కూటర్
  • 2023 లో భారత్ లో అడుగు పెట్టనున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్

Activa E ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: హోండా మోటర్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. రూమర్లు నిజమైతే, Activa E అద్భుతమైన ఫీచర్లు, ఉత్తమమైన రేంజ్ ని కలిగి ఉండనుంది. 2023 చివరి కల్లా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ని జపనీస్ దిగ్గజ కంపెనీ లాంచ్ చేసే అవకాశముందని సమాచారం. మేడ్ ఫర్ ఇండియా అనే కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ పై ఈ స్కూటర్ రూపొందనుంది.

Honda Activa E ఇండియా లాంచ్

హోండా యాక్టివా భారత మార్కెట్ లో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ మోడల్ తో భారత ఎలక్ట్రిక్ మార్కెట్ లోకి ఘనంగా అడుగు పెట్టాలని హోండా కంపెనీ డిసైడ్ అయ్యింది. పెట్రోల్ వర్షన్ కి భారత్ లో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని కంపెనీ భావిస్తుండొచ్చు. Activa E బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో కొనుగోలుదారులు డిశ్చార్జ్ అయిన బ్యాటరీలను స్వాప్ స్టేషన్స్ వద్ద మార్కుకోవచ్చు. అలాగే ఇంటి వద్ద కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ తరహా టెక్నాలజీని మనం బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లో చూశాం.

Swappable Battery టెక్నాలజీ అంటే ఏమిటి?

బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం పదండి. తరచూ బ్యాటరీని చార్జ్ చేసే పని లేకుండా చేసే టెక్నాలజీనే ఈ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. యూజర్ తన బండితో అందించబడిన బ్యాటరీ కాకుండా మరొక బ్యాటరీని కూడా తన వద్ద ఉంచుకోవచ్చు. దీని ద్వారా వెనువెంటనే బ్యాటరీని మార్చుకునే వీలుంటుంది. దీంతో మాటి మాటికీ బ్యాటరీని చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా ఏ ఎలక్ట్రిక్ బండి బ్యాటరీ అయినా పూర్తిగా చార్జ్ అవ్వడానికి గంటల సమయం పడుతుంది. కావున, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల వద్ద బ్యాటరీని మార్చు కోవడం వల్లన ఎంతో సమయం కలిసి వస్తుంది. బ్యాటరీ అయిపోయిందే అనే బాధ, భయం ఉండవు.

Honda Activa Electric ముందున్న సవాళ్ళు

భారత్ లో ఇప్పటికే పాతుకుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో Honda Activa E పోటీపడనుంది. కంపెనీ ముందున్న సవాలు ఏంటంటే, ఓలా ఎస్ 1, బజాజ్ చేతక్, హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ లను దాటేయాల్సి ఉంటుంది. దాంతో పాటు, రానున్న రోజుల్లో Activa E కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇచ్చి, ఇతర ఆటోమొబైల్ కంపెనీలకు తన పోటీని ప్రకటించవచ్చు. హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి అడుగు పెట్టాక పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post ఎలక్ట్రిక్ అవతారంలో వస్తోన్న Honda Activa; తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ first appeared on 91Mobiles Telugu.

]]>