HONOR 200 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 04 Sep 2024 18:00:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/ https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/#respond Wed, 04 Sep 2024 17:02:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=13348 స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం. Vivo […]

The post Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ప్రధానంగా చూసే స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ విభాగం ఒకటి. ఫోన్ ఎక్కువ సేపు వాడుకోవాలంటే, మంచి పవర్ బ్యాకప్ ఉండాలి. అంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువగా అందించే ఫోన్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లో చాలా ఫోన్లు ఉంటాయి. అందులో ఏ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంతా? అనేది వాడితే గానీ తెలియదు. అందుకే మేం ఎప్పటికప్పుడు ఫోన్ల బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో కొన్ని టెస్టులు జరిపి తెలుసుకుంటున్నాం.

Vivo V40 మరియు Honor 200 ఫోన్ల బ్యాటరీ పనితనాన్ని మేం కొన్ని టెస్టులు చేసి పరీక్షించాం. ఆ వివరాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Vivo V40 లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. మరోవైపు Honor 200 లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

పీసీమార్క్ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ అనేది ఒక స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ 100 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయేదాకా, వివిధ టాస్కులను రన్ చేస్తూ వాటి సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది.

పీసీమార్క్ టెస్ట్ లో వివో వీ40 13 గంటల స్కోర్ చేసింది. మరోవైపు, హానర్ 200 10 గంటల 52 నిమిషాల స్కోర్ చేసింది.

విజేత: Vivo V40

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్

రెండు స్మార్ట్‌ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలను చూడటం జరిగింది. ఈ టెస్ట్ సమయంలో రెండు ఫోన్లలోనూ ఒకే విధమైన ఆడియో/బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి.

ఈ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 3 శాతం ఖర్చయ్యింది. హానర్ 200 బ్యాటరీ 4 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 165ఎంఏహెచ్ శక్తిని వాడుకోగా, హానర్ 200 208ఎంఏహెచ్ శక్తిని వాడుకుంది.

విజేత: Vivo V40

గేమింగ్ టెస్ట్

గేమింగ్ టెస్ట్ భాగంగా, రెండు ఫోన్లలో బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, రియల్ రేసింగ్ 3 గేమ్‌లను 30 నిమిషాల పాటు ఆడాం. రెండు ఫోన్లలో బేస్ సెట్టింగ్స్ ను ఒకే విధంగా ఉంచడం జరిగింది.

గేమింగ్ టెస్ట్ లో వివో వీ40 బ్యాటరీ 5.3 శాతం ఖర్చయ్యింది. మరోవైపు, హానర్ 200 బ్యాటరీ 7.3 శాతం ఖర్చయ్యింది. వివో వీ40 880ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకోగా, హానర్ 200 1144 ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని వాడుకుంది.

విజేత: Vivo V40

చార్జింగ్ టెస్ట్

వివో వీ40 లో పెద్ద బ్యాటరీ ఉండగా, హానర్ 200 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. వివో వీ40 ఫోన్‌ని 80 వాట్ ఛార్జర్ తో చార్జ్ చేయగా 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, హానర్ 200 ని 100 వాట్ చార్జర్ తో చార్జ్ చేయగా.. 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 39 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Vivo V40

ఏది బెటర్?

వివో వీ40 మరియు హానర్ 200 ఫోన్ల యొక్క బ్యాటరీ కంపేరిజన్ లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ గల వివో వీ40, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ గల హానర్ 200 పై విజేతగా నిలిచింది. హానర్ 200 లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజీ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్.

The post Vivo V40 vs Honor 200: రెండింట్లో ఏది బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-vs-honor-200-battery-comparison-which-one-gives-better-battery-backup/feed/ 0
HONOR 200 5G: సిలికాన్ కార్బన్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన హానర్ 200, 200 ప్రో https://www.91mobiles.com/telugu/honor-200-5g-200-pro-5g-launched-india-silicon-carbon-battery/ https://www.91mobiles.com/telugu/honor-200-5g-200-pro-5g-launched-india-silicon-carbon-battery/#respond Thu, 18 Jul 2024 09:11:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12547 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR భారతీయ మార్కెట్ లో తన ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేసింది. HONOR 200 5G, HONOR 200 Pro 5G పేర్లతో ఈ మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లు సెగ్మెంట్-ఫస్ట్ సిలికాన్ కార్బన్ బ్యాటరీలతో రావడం విశేషం. ఈ తరహా బ్యాటరీల వల్లన 6 శాతం పవర్ డెన్సిటీ మరియు మెరుగైన చార్జింగ్ రేట్స్ ఉంటాయని సమాచారం. కొత్త హానర్ 200 5జీ సిరీస్ […]

The post HONOR 200 5G: సిలికాన్ కార్బన్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన హానర్ 200, 200 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో హానర్ 200 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వచ్చిన 200 5జీ, 200 ప్రో 5జీ
  • సిలికాన్ కార్బన్ బ్యాటరీ హైలైట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR భారతీయ మార్కెట్ లో తన ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేసింది. HONOR 200 5G, HONOR 200 Pro 5G పేర్లతో ఈ మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లు సెగ్మెంట్-ఫస్ట్ సిలికాన్ కార్బన్ బ్యాటరీలతో రావడం విశేషం. ఈ తరహా బ్యాటరీల వల్లన 6 శాతం పవర్ డెన్సిటీ మరియు మెరుగైన చార్జింగ్ రేట్స్ ఉంటాయని సమాచారం. కొత్త హానర్ 200 5జీ సిరీస్ యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HONOR 200 5G సిరీస్ ధర, లభ్యత

HONOR 200 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.34,999 గా నిర్ణయించారు. 12జిబి+512జిబి మోడల్ ధరను రూ.39,999 గా పెట్టారు.

HONOR 200 Pro 5G సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.57,999 గా పెట్టారు.

HONOR 200 5G బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. HONOR 200 Pro 5G ఓషన్ సైయన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై 20వ తేదీ నుంచి అర్థరాత్రి నుంచి అమెజాన్ ఇండియా, ఎక్స్‌ప్లోర్ హానర్ ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జులై 20 మరియు జులై 21వ తేదీల్లో జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా ఈ ఫోన్లపై హానర్ లాంచ్ ఆఫర్లను అందిస్తోంది.

హానర్ 200 ప్రో 5జీ పై రూ.8,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, హానర్ 200 5జీ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రో మోడల్ కొంటే రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే ఆఫర్ స్టాండర్డ్ మోడల్ పై కూడా ఉంది. కానీ, రూ.2,000 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.

ఇవే కాకుండా, రూ.2,000 ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

HONOR 200 Pro 5G సిరీస్ స్పెసిఫికేషన్స్

Honor 200 5G

డిస్ప్లే: Honor 200 5G లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Honor 200 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Honor 200 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్+మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Honor 200 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వచ్చింది.

కనెక్టివిటీ: Honor 200 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/ఏజీపీఎస్/గ్లొనాస్/బైడూ/గెలీలియో, యూఎస్బీ స్పీకర్స్, జీపీయూ టర్బో ఎక్స్, ఆల్-రేంజ్ కూలింగ్ సిస్టమ్ 2.0 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Honor 200 5G డివైజ్‌161.5 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.

Honor 200 Pro 5G

డిస్ప్లే: Honor 200 Pro 5G లో 6.78-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ అమోలెడ్ స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, అడాప్టివ్ డిమ్మింగ్, నేచురల్ టోన్ 2.0 ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్, ఆర్ఎఫ్ ఎన్హాన్స్‌డ్ చిప్ హానర్ సీ1+ ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.

మెమొరీ: Honor 200 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Honor 200 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Honor 200 Pro 5G 50ఎంపి సూపర్ డైనమిక్ హెచ్9000 సెన్సర్ పొట్రెయిట్ మెయిన్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రా-వైడ్+మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి+2ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.

బ్యాటరీ: Honor 200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వచ్చింది. 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ సపోర్ట్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Honor 200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/ఏజీపీఎస్/గ్లొనాస్/బైడూ/గెలీలియో, యూఎస్బీ టైప్-సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor 200 Pro 5G లో యూనివర్శల్ ఐఆర్ రిమోట్ కంట్రోల్, హానర్ హిస్టెన్ స్పేషియల్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, జీపీయూ టర్బో ఎక్స్, ఆల్-రేంజ్ కూలింగ్ సిస్టమ్ 2.0 ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Honor 200 Pro 5G డివైజ్ 163.3 మి.మీ పొడవు, 75.2 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post HONOR 200 5G: సిలికాన్ కార్బన్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన హానర్ 200, 200 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-5g-200-pro-5g-launched-india-silicon-carbon-battery/feed/ 0
HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/honor-200-5g-series-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/honor-200-5g-series-india-launch-date-confirmed/#respond Fri, 05 Jul 2024 16:12:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=12387 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో HONOR 200 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారైంది. హానర్ 200 5జీ సిరీస్ జులై 18వ తేదీన భారత్ లో విడుదలవుతోంది. ఈ లైనప్ లో HONOR 200 5G మరియు HONOR 200 Pro 5G డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోన్న ఈ సిరీస్ యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ […]

The post HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 18న HONOR 200 5G సిరీస్ లాంచ్
  • అమెజాన్ ద్వారా టీజర్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న HONOR 200, 200 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HONOR నుంచి త్వరలో HONOR 200 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ యొక్క భారత మార్కెట్ లాంచ్ తేదీ ఖరారైంది. హానర్ 200 5జీ సిరీస్ జులై 18వ తేదీన భారత్ లో విడుదలవుతోంది. ఈ లైనప్ లో HONOR 200 5G మరియు HONOR 200 Pro 5G డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోన్న ఈ సిరీస్ యొక్క మైక్రో-సైట్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ పై కనిపిస్తోంది. సరే, ఓసారి హానర్ 200 5జీ సిరీస్ లాంచ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ

ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ పై విడుదలైన టీజర్ ప్రకారం, HONOR 200 5G సిరీస్ జులై 18వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది. హానర్ 200, హానర్ 200 ప్రో డివైజెస్ ఈ లైనప్ లో లాంచ్ కానున్నాయి.

HONOR 200 5G సిరీస్ బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

మైక్రోసైట్ లో రివీలైన వివరాలను గమనిస్తే, 7.7 మి.మీ మందంతో HONOR 200 5G డివైజ్ వస్తున్నట్లు అర్థమవుతోంది.

Honor 200 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HONOR 200 లో 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.7-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. మరోవైపు HONOR 200 Pro లో 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల 6.78-ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ రెండు ఫోన్లలో 1.5కే ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: HONOR 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్. ఈ ఫోన్ లో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఇచ్చారు. HONOR 200 Pro లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ అందించారు.

సాఫ్ట్‌వేర్: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

రియర్ కెమెరా: HONOR 200 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. HONOR 200 లో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో సెన్సర్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. HONOR 200 Pro లో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2.5ఎక్స్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి.

ఫ్రంట్ కెమెరా: HONOR 200, HONOR 200 Pro ఫోన్లలో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 కెమెరా ఉంది. దీని అపర్చర్ F/2.1. అయితే HONOR 200 Pro లో 3డీ డెప్త్ సెన్సర్ కూడా ఉంది. దీంతో ప్రో వేరియంట్ లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉందని చెప్పవచ్చు.

బ్యాటరీ: HONOR 200 సిరీస్ లోని రెండు ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్లు 100 వాట్ సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి. ప్రో వేరియంట్ 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

The post HONOR 200 5G సిరీస్ ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-200-5g-series-india-launch-date-confirmed/feed/ 0