Honor 90 GT - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 21 Dec 2023 16:14:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 24GB ర్యామ్, 50MP Sony IMX906 కెమెరాతో చైనాలో లాంచైన Honor 90 GT https://www.91mobiles.com/telugu/honor-90-gt-featuring-24gb-ram-50mp-sony-imx906-camera-launched-china-price-specs/ Thu, 21 Dec 2023 16:14:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=9395 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor జీటీ సిరీస్ లో మరొక ఫోన్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. Honor 90 GT పేరుతో వచ్చిన ఈ డివైజ్ చైనాలో నేడు లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో పవర్ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది. Honor 90 GT లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఈఐఎస్+ఓఐఎస్ లెన్స్, 1.5కే డిస్ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. […]

The post 24GB ర్యామ్, 50MP Sony IMX906 కెమెరాతో చైనాలో లాంచైన Honor 90 GT first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Honor 90 GT
  • Snapdragon 8 Gen 2 చిప్‌తో వచ్చిన ఫోన్
  • Honor 90 GT ప్రారంభ ధర రూ.31,044

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor జీటీ సిరీస్ లో మరొక ఫోన్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. Honor 90 GT పేరుతో వచ్చిన ఈ డివైజ్ చైనాలో నేడు లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్ లో పవర్ఫుల్ ఫీచర్స్ తో వచ్చింది. Honor 90 GT లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ, 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఈఐఎస్+ఓఐఎస్ లెన్స్, 1.5కే డిస్ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. సరే, ఓసారి Honor 90 GT ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 90 GT ధర

  • Honor 90 GT డివైజ్ 4 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
  • Honor 90 GT 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ.31,044) గా ఉంది.
  • Honor 90 GT 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2,899 యువాన్లు (సుమారు రూ.34,627) గా నిర్ణయించారు.
  • Honor 90 GT 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,199 యువాన్లు (సుమారు రూ.37,292) గా ఉంది.
  • Honor 90 GT టాప్ మోడల్ 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.44,185) గా ఉంది.
  • Honor 90 GT స్మార్ట్‌ఫోన్ భారత్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. త్వరలోనే కంపెనీ నుంచి అధికార సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Honor 90 GT స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 GT లో 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 GT లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. హానర్ రూపొందించిన డిస్ప్లే చిప్ మరియు ఆర్ఎఫ్ ఎన్హాన్స్‌మెంట్ సీ1 చిప్ ని ఈ ఫోన్ లో జతచేశారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 GT డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: Honor 90 GT లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ఓఐఎస్+ఈఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Honor 90 GT లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Honor 90 GT డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 GT లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్పీకర్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post 24GB ర్యామ్, 50MP Sony IMX906 కెమెరాతో చైనాలో లాంచైన Honor 90 GT first appeared on 91Mobiles Telugu.

]]>