Honor 90 Smart 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Mar 2024 14:41:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor 90 Smart 5G: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హానర్ 90 స్మార్ట్ 5జీ https://www.91mobiles.com/telugu/honor-90-smart-5g-globally-launched-with-108mp-camera/ Tue, 26 Mar 2024 14:41:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=10830 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor తన 90 సిరీస్ లో మరో ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Honor 90 Smart 5G అనే పేరుతో గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. Honor 90 Smart 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5330 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ, 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. […]

The post Honor 90 Smart 5G: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హానర్ 90 స్మార్ట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • డైమెన్సిటీ 6020 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor తన 90 సిరీస్ లో మరో ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Honor 90 Smart 5G అనే పేరుతో గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారు. Honor 90 Smart 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5330 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ, 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Honor 90 Smart 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 90 Smart 5G ధర

Honor 90 Smart 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

Honor 90 Smart 5G డివైజ్ 249.90 యూరోలు (సుమారు రూ.22,598) గా ఉంది.

Honor 90 Smart 5G డివైజ్ ఎమరాల్డ్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Honor 90 Smart 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 Smart 5G లో 6.8-ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్సీడీ స్క్రీన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16.7 మిలియన్ కలర్స్, మల్టీ-టచ్ జెశ్చర్ ఫీచర్ ఉన్నాయి.
  • కెమెరా: Honor 90 Smart 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 Smart 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది.
  • ప్రాసెసర్: Honor 90 Smart 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి-జీ57 జీపీయూ వాడారు.
  • ఓఎస్: Honor 90 Smart 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 Smart 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,330 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor 90 Smart 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Honor 90 Smart 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Honor 90 Smart 5G: 108MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన హానర్ 90 స్మార్ట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>