Honor Play 8T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Oct 2023 09:39:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, Dimensity 6080 చిప్‌తో చైనాలో లాంచైన Honor Play 8T https://www.91mobiles.com/telugu/honor-play-8t-launched-china-price-specs-availability/ Wed, 18 Oct 2023 09:39:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=8453 Honor సంస్థ తాజాగా Honor Play 8T స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ డివైజ్ లో ఎల్సీడీ ప్యానెల్, భారీ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి చైనా మార్కెట్ కే పరిమితం కానున్న ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. హానర్ సంస్థ ఈ ఫోన్ […]

The post 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, Dimensity 6080 చిప్‌తో చైనాలో లాంచైన Honor Play 8T first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Play 8T
  • 12జిబి ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • ప్రస్తుతం చైనా మార్కెట్ కే పరిమితం

Honor సంస్థ తాజాగా Honor Play 8T స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ మిడ్-రేంజ్ డివైజ్ లో ఎల్సీడీ ప్యానెల్, భారీ బ్యాటరీ, 256జిబి స్టోరేజీ, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి చైనా మార్కెట్ కే పరిమితం కానున్న ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. హానర్ సంస్థ ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియనుంది. సరే, ఓసారి Honor Play 8T డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Honor Play 8T ధర, లభ్యత

Honor Play 8T స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,099 యువాన్లు గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,299 గా నిర్ణయించారు. Honor Play 8T ఫోన్ బ్లాక్, సిల్వర్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ డివైజ్ చైనాలో ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది. అక్టోబర్ 23 నుంచి Honor Play 8T సేల్ మొదలుకానుంది.

Honor Play 8T స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Play 8T లో 6.8-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 850 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor Play 8T లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Honor Play 8T లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor Play 8T లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Honor Play 8T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Honor Play 8T డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post 6.8-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, Dimensity 6080 చిప్‌తో చైనాలో లాంచైన Honor Play 8T first appeared on 91Mobiles Telugu.

]]>