HONOR X5 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 17 Aug 2023 06:03:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 గ్లోబల్‌గా లాంచైన HONOR X5 Plus; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-x5-plus-globally-launched-price-specs-availability/ Thu, 17 Aug 2023 06:03:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=7627 HONOR సంస్థ త్వరలో భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఆమేరకు హానర్ ఇండియా నుంచి ప్రకటన కూడా వచ్చింది. ఇకపోతే తాజాగా గ్లోబల్ మార్కెట్ లో హానర్ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ HONOR X5 Plus ని లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్లను ఉద్దేశించి ఈ ఫోన్ ని తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. సరే, HONOR X5 Plus యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. HONOR […]

The post గ్లోబల్‌గా లాంచైన HONOR X5 Plus; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సెప్టెంబర్ లో భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్న HONOR
  • మీడియాటెక్ హీలియో జీ36 చిప్‌తో లాంచైన HONOR X5 Plus
  • HONOR X5 Plus ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం

HONOR సంస్థ త్వరలో భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఆమేరకు హానర్ ఇండియా నుంచి ప్రకటన కూడా వచ్చింది. ఇకపోతే తాజాగా గ్లోబల్ మార్కెట్ లో హానర్ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ HONOR X5 Plus ని లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్లను ఉద్దేశించి ఈ ఫోన్ ని తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది. సరే, HONOR X5 Plus యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

HONOR X5 Plus స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: HONOR X5 Plus లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, టీఎఫ్‌టీ ఎల్‌సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.15:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.
  • ప్రాసెసర్: HONOR X5 Plus డివైజ్ మీడియాటెక్ హీలియో జీ36 చిప్ తో వచ్చింది. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఐఎంజీ జీఈ8320 జీపీయూ అందించారు.
  • ఓఎస్: HONOR X5 Plus స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: HONOR X5 Plus లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: HONOR X5 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: HONOR X5 Plus స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

HONOR X5 Plus ధర

HONOR X5 Plus స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, HONOR X5 Plus డివైజ్ లో-బడ్జెట్ స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. దీన్ని బట్టి, ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ గా ఈ ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు సైయన్ లేక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. భారత మార్కెట్ లో HONOR X5 Plus లాంచ్ పై ఇంకా సమాచారం ఏమీ రాలేదు.

The post గ్లోబల్‌గా లాంచైన HONOR X5 Plus; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>