Honor X60 Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 11:38:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/#respond Tue, 08 Oct 2024 11:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=13986 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం. Honor X60 సిరీస్ లాంచ్ తేదీ […]

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో Honor X60 సిరీస్ విడుదల
  • అక్టోబర్ 16న లాంచ్ అవుతోన్న లైనప్
  • మూడు మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం.

Honor X60 సిరీస్ లాంచ్ తేదీ (చైనా)

  • Honor X60 సిరీస్ చైనాలో అక్టోబర్ 16వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ లైనప్ లో ఎన్ని మోడల్స్ లాంచ్ అవుతాయో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
  • హానర్ సంస్థ ఈ టీజర్‌ను చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేసింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం, అక్టోబర్ 16న రాత్రి 7.30 గంటలకు హానర్ ఎక్స్60 సిరీస్ లాంచ్ అవుతుంది.
  • Honor X60 లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  • గతేడాది Honor X50 సిరీస్ లో భాగంగా.. X50i, X50i+, X50, X50 Pro మరియు X50 GT అనే మోడల్స్ విడుదలయ్యాయి.
  • రానున్న రోజుల్లో ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Honor X60 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: రిపోర్ట్ ప్రకారం, హానర్ 60 సిరీస్ లోని బేస్ మోడల్ Honor X60 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాసెసర్: Honor X60 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Honor X60 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అవుతుందని సమాచారం.

కెమెరా: Honor X60 డివైజ్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X60 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా.

ఆపరేటింగ్ సిస్టమ్: Honor X60 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Honor X60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/feed/ 0