Honor X6a - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Jul 2023 09:44:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz డిస్ప్లే, Helio G36 చిప్‌తో లాంచైన Honor X6a https://www.91mobiles.com/telugu/honor-x6a-launched-uk-price-specs-availability/ Fri, 28 Jul 2023 09:44:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=7373 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor తాజాగా ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Honor X6a పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూకే లో లాంచ్ అయ్యింది. భారీ స్టోరేజీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ గా నిలవనుంది. Honor X6a లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, 128జిబి స్టోరేజీ, ఐపీఎస్ […]

The post 90Hz డిస్ప్లే, Helio G36 చిప్‌తో లాంచైన Honor X6a first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూకేలో లాంచైన Honor X6a డివైజ్
  • భారీ స్టోరేజీ, హై రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన ఫోన్
  • Honor X6a డివైజ్ ధర 129 పౌండ్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor తాజాగా ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. Honor X6a పేరుతో వచ్చిన ఈ డివైజ్ యూకే లో లాంచ్ అయ్యింది. భారీ స్టోరేజీ, హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ గా నిలవనుంది. Honor X6a లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, 128జిబి స్టోరేజీ, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉన్నాయి. సరే, ఓసారి Honor X6a డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor X6a స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X6a డివైజ్ లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ (720*1612 పిక్సెల్స్) రెజుల్యూషన్, 20.15:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • చిప్సెట్: Honor X6a స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X6a స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. 128జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Honor X6a స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్, మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • కెమెరా ఫీచర్లు: Honor X6a లో పొట్రెయిట్ మోడ్, టైమ్-ల్యాప్స్, సూపర్ మ్యాక్రో, హెచ్డీఆర్ ఫోటో, 1080పి వీడియో రికార్డింగ్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor X6a స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 22.5 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Honor X6a డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X6a లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Honor X6a లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ 163.32 మి.మీ పొడవు, 75.07 మి.మీ వెడల్పు, 8.35 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

Honor X6a ధర, లభ్యత

Honor X6a స్మార్ట్ ఫోన్ ధర యూకే మార్కెట్ లో 129 పౌండ్లు గా ఉంది. ఇకపోతే ఈ డివైజ్ మిడ్నైట్ బ్లాక్, స్కై సిల్వర్, సైయన్ లేక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ ఫోన్ ఇతర యురోపియన్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుంది.

The post 90Hz డిస్ప్లే, Helio G36 చిప్‌తో లాంచైన Honor X6a first appeared on 91Mobiles Telugu.

]]>