Honor X8b - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 18 Dec 2023 16:39:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b https://www.91mobiles.com/telugu/honor-x8b-launched-saudi-arabia-price-specs-availability/ Mon, 18 Dec 2023 16:39:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=9351 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor ఒక కొత్త ఫోన్ ని మిడిల్-ఈస్ట్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. Honor X8b పేరుతో వచ్చిన ఈ డివైజ్ సౌదీ అరేబియా లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Honor X8b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Honor X8b ధర, కలర్ ఆప్షన్స్ Honor X8b […]

The post 50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • సౌదీ అరేబియాలో లాంచైన Honor X8b
  • 6.7-ఇంచ్ FHD+ స్క్రీన్‌తో వచ్చిన డివైజ్
  • Honor X8b ధర 240 డాలర్లు (సుమారు రూ.19,900)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor ఒక కొత్త ఫోన్ ని మిడిల్-ఈస్ట్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. Honor X8b పేరుతో వచ్చిన ఈ డివైజ్ సౌదీ అరేబియా లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Honor X8b స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X8b ధర, కలర్ ఆప్షన్స్

  • Honor X8b స్మార్ట్‌ఫోన్ ధర సౌదీ అరేబియాలో 240 డాలర్లు (సుమారు రూ.19,900) గా ఉంది.
  • Honor X8b డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైటానియమ్ సిల్వర్, గ్లామరస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Honor X8b డివైజ్ యొక్క ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాలేదు. లాంచ్ అవుతుందో లేదో తెలియదు. భవిష్యత్తులో దీనిపై ఏదైనా ప్రకటన రావొచ్చు.

Honor X8b స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor X8b లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3240 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X8b లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ఉంది. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Honor X8b డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X8b డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor X8b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Honor X8b లో పవర్ బ్యాకప్ కోసం 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b first appeared on 91Mobiles Telugu.

]]>