HOP Electric - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Jan 2023 08:50:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120KM రేంజ్, రూ.1 లక్ష లోపు ధరతో లాంచైన HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/hop-leo-e-scooter-launched-india-price-specs-availability/ Tue, 24 Jan 2023 08:50:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4618 ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన HOP Electric తాజాగా HOP Leo యొక్క హైస్పీడ్ వర్షన్ ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1 లక్షగా కంపెనీ నిర్ణయించింది. ఈ హై-స్పీడ్ వేరియంట్ 52కేఎంపీహెచ్ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. పబ్లిక్ రోడ్స్ పై వాడుకునేందుకు ఈ బండికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడింగ్ మోడ్స్, ఎల్సీడీ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్ ఉంటాయి. సరే, ఓసారి HOP Leo […]

The post 120KM రేంజ్, రూ.1 లక్ష లోపు ధరతో లాంచైన HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights
  • రూ.1 లక్ష లోపు ధరతో భారత్ లో లాంచైన HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్
  • HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్: 120 కిలోమీటర్లు, హైస్పీడ్: 52కేఎంపీహెచ్
  • 5 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న HOP Leo, జనవరి 23 నుంచి డీలర్షిప్స్ ద్వారా అందుబాటులోకి రానున్న వెహికిల్


ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన HOP Electric తాజాగా HOP Leo యొక్క హైస్పీడ్ వర్షన్ ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1 లక్షగా కంపెనీ నిర్ణయించింది. ఈ హై-స్పీడ్ వేరియంట్ 52కేఎంపీహెచ్ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. పబ్లిక్ రోడ్స్ పై వాడుకునేందుకు ఈ బండికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడింగ్ మోడ్స్, ఎల్సీడీ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్ ఉంటాయి. సరే, ఓసారి HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత

HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క హై-స్పీడ్ వేరియంట్ భారత్ లో రూ.97,000 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయ్యింది. జనవరి 23 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న HOP డీలర్షిప్స్ లో ఈ బండి అందుబాటులోకి వచ్చింది. HOP Leo స్కూటర్ 5 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, వైట్, గ్రే, బ్లూ, రెడ్. బ్యాటరీపై కంపెనీ 3 ఏళ్ళు లేదా 40,000 కిలోమీటర్ల వ్యారంటీని అందిస్తోంది. ఇక బండిపై 3 ఏళ్ళ వ్యారంటీ అందిస్తోంది. HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Air, Ola S1 స్కూటర్లతో పోటీ పడనుంది.

HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్

HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క హై-స్పీడ్ వర్షన్ లో 2.1 కిలోవాట్ అవర్ లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ ని అందించారు. ఎలక్ట్రిక్ మోటర్ 2.9 బీహెచ్‌పీ పవర్, 90ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 850 వాట్ చార్జర్ ద్వారా HOP Leo స్కూటర్ 0 నుంచి 80 శాతం చార్జ్ అవ్వడానికి 2.5 గంటల సమయం తీసుకుంటుంది. ఈ బండి టాప్ స్పీడ్ 52 కేఎంపీహెచ్. మోత సామర్థ్యం 160 కిలోలు.

HOP Leo ఎలక్ట్రిక్ బండి ఎల్ఈడీ లైటింగ్, కాంబి బ్రేకింగ్, బిస్క్ బ్రేక్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఎల్సీడీ డిస్ప్లే, మొబైల్ చార్జర్, రీజనరేటివ్ బ్రేకింగ్ తదితర ఫీచర్లతో వస్తోంది. HOP Leo లో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి: ఇకో, పవర్, స్పోర్ట్, రివర్స్. ఈ బండిలో థర్డ్ పార్టీ జీపీఎస్ ట్రాకర్ ఆప్షన్ ఉంది. ఈ బండి 90 సెక్షన్ 10-ఇంచ్ వీల్స్, ఐపీ65 మరియు ఐపీ67 రేటెడ్ ఎలక్ట్రికల్ కంపోనెంట్స్, 19.75 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజీ, 160ఎంఎం గ్రౌండ్ క్లియరన్స్ వంటి పీచర్లను కలిగి ఉంది. HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 90 కేజీలు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120KM రేంజ్, రూ.1 లక్ష లోపు ధరతో లాంచైన HOP Leo ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>