Hyundai Ioniq 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:40:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 631 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 https://www.91mobiles.com/telugu/hyundai-ioniq-5-launched-in-india-price-specs/ Wed, 11 Jan 2023 14:08:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=4435 హైలైట్స్ రూ.1 లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి హ్యాందాయ్ కంపెనీ వెబ్ సైట్ నుంచి Hyundai Ioniq 5 ని బుక్ చేసుకునే అవకాశం ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం సింగిల్ చార్జ్ పై 631 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Hyundai Ioniq 5 కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జ్ కానున్న Hyundai Ioniq 5 కారు బ్యాటరీ భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్ లో హ్యుందాయ్ కంపెనీ ప్రభంజనం సృష్టిస్తోంది. Auto Expo 2023 లో […]

The post 631 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • రూ.1 లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి హ్యాందాయ్ కంపెనీ వెబ్ సైట్ నుంచి Hyundai Ioniq 5 ని బుక్ చేసుకునే అవకాశం
  • ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం సింగిల్ చార్జ్ పై 631 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Hyundai Ioniq 5
  • కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జ్ కానున్న Hyundai Ioniq 5 కారు బ్యాటరీ

భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్ లో హ్యుందాయ్ కంపెనీ ప్రభంజనం సృష్టిస్తోంది. Auto Expo 2023 లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ కారు 631 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. ఈ ఈవెంట్ లో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ వెల్లడించింది. ఈ కారు యొక్క బుకింగ్ కూడా లాంచ్ కి ముందే ప్రారంభమైంది. బుకింగ్ కోసం కస్టమర్లు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. సరే ఓసారి Hyundai Ioniq 5 కారు యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Hyundai Ioniq 5 ధర

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ Auto Expo 2023 ఈవెంట్ లో లాంచ్ చేశారు. లాంచ్ సమయంలోనే కంపెనీ ఈ కారు యొక్క ధరలను ప్రకటించింది. Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.44.95 లక్షలుగా ఉంది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధరతో కేవలం మొదటి 500 మంది కస్టమర్లు మాత్రమే కారుని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ధర పెరగనుంది.

Hyundai Ioniq 5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని హ్యాందాయ్ కంపెనీ ఈ-జీఎంపి ప్లాట్ఫామ్ పై తయారు చేసింది. పంప్-టు-ప్లగ్ రెవొల్యూషన్ ఈ కారుతో మొదలు కానుంది. స్పెషల్ ఫీచర్ క్రింద, Hyundai Ioniq 5 కారులో 21 హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ (లెవెల్ 2 ఏడీఏఎస్) ని అందించారు.

Hyundai Ioniq 5 ఈవీ 4,635 మిల్లీ మీటర్ల పొడవు, 1,890 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,625 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ మోడల్ యొక్క వీల్ బేస్ 3,000 ఎంఎం గా ఉంటుంది. మ్యాట్ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్నైట్ బ్లాక్ పర్ల్ కలర్ ఆప్షన్స్ తో ఈ కారు లభిస్తుంది. భద్రత ఫీచర్లలో భాగంగా, Hyundai Ioniq 5 కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వీఈఎస్ఎస్, ఈపీబీ, ఎంసీబీ, 4 డిస్క్ బ్రేక్స్ అందిస్తున్నారు.

Hyundai Ioniq 5 లో పారామెట్రిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఇంటెగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్స్, 20-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటెగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్ షీల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్

Hyundai Ioniq 5 కారులో 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 214 బీహెచ్‌పీ మరియు 350 నానోమీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారులో ఏఆర్ఏఐ-సర్టిఫకేషన్ రేంజ్ 631 కిలోమీటర్ల దూరం సింగిల్ చార్జ్ పై వెళ్తుంది. 350 కిలోవాట్ డీసీ చార్జర్ ద్వారా కారుని 10 శాతం నుంచి 80 శాతానికి కేవలం 18 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.

Hyundai Ioniq 5 కారులో 12.3-ఇంచ్ సైజు కల్గిన రెండు భారీ స్క్రీన్స్ ని అందించారు. వీటిలో ఒక స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ కోసం కాగా, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఇవ్వబడింది. ఇతర ఫీచర్లను చూస్తే, ఈ కారులో 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్ గేట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్లెస్ చార్జింగ్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 631 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు https://www.91mobiles.com/telugu/hyundai-ioniq-5-launched-india-specs-color-options/ Wed, 21 Dec 2022 06:49:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=4108 హైలైట్స్ భారత్ లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు Hyundai Ioniq 5 ని లాంచ్ చేసిన హ్యుందాయ్ సంస్థ ఇప్పటికే భారత్ లో కోనా అనే ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన హ్యుందాయ్ కంపెనీ భారత్ లో మొదలైన Hyundai Ioniq 5 బుకింగ్స్ ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ భారత్ లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు టోకెన్ […]

The post భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు Hyundai Ioniq 5 ని లాంచ్ చేసిన హ్యుందాయ్ సంస్థ
  • ఇప్పటికే భారత్ లో కోనా అనే ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన హ్యుందాయ్ కంపెనీ
  • భారత్ లో మొదలైన Hyundai Ioniq 5 బుకింగ్స్
Image: ACI

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ భారత్ లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు టోకెన్ అమౌంట్ రూ.1 లక్ష చెల్లించి కారుని బుక్ చేసుకోవచ్చు.

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ (E-GMP) పై తయారైంది. ఈ కారు 4,635 మిల్లీ మీటర్ల పొడవు, 1,890 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,625 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కారు 3,000 మిల్లీ మీటర్ల వీల్ బేస్ కలిగి ఉంది.

Hyundai Ioniq 5 డిజైన్, ఫీచర్స్

Hyundai Ioniq 5 ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఎక్స్‌టీరియర్ పై ఆంగ్యులర్ సర్ఫేసెస్ తో కూడి ఉంది. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పిక్సెలేటెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, యూనిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్స్ ఈ కారులో ఉన్నాయి. మినిమలిస్టిక్ ఇంటీరియర్ తో వచ్చిన ఈ కారులో డ్యూయల్ ఫ్లోటింగ్ స్క్రీన్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

గ్లోబల్ గా Hyundai Ioniq 5 రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 58 కిలోవాట్ అవర్ మరియు 72.6 కిలోవాట్ అవర్. 480 కిలోమీటర్ల వరకు రేంజ్ ని ఈ కారు ఆఫర్ చేస్తుంది. బేస్ వర్షన్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ తో వస్తోంది. ఇది 165 బీహెచ్పీ పవర్ మరియు 350 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటర్ వర్షన్ 298 బీహెచ్పీ పవర్ మరియు 605 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 5.2 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ చెబుతోంది.

భారత్ లో హ్యాందాయ్ భారీ బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేస్తోంది. ఇది 631 కి.మీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుది. ఎలక్ట్రిక్ మోటర్ కారుకి వెనకాల (రియర్ మౌంటెడ్) అమర్చబడింది. Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు 800 వోల్టుల ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ తో బ్యాటరీ 10 నుంచి 80 శాతానికి కేవలం 18 నిమిషాల్లో చార్జ్ అవుతుంది.

Hyundai Ioniq 5 లో 12.3-ఇంచ్ డిజిటల్ క్లస్టర్ మరియు ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమాటిక్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, Hyundai Ioniq 5 లో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఇంజిన్ పార్కింగ్ బ్రేక్, ఫోర్ డిస్క్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఇక ఈ కారులో 571 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.

Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు Kia EV6, Mercedes-Benz EQB లతో పోటీ పడనుంది. Hyundai Ioniq 5 కారు మొత్తం 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్ పర్ల్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారత్ లో లాంచైన Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు first appeared on 91Mobiles Telugu.

]]>