IGA 2023 Winners - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Dec 2023 15:10:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Indian Gadget Awards 2023: విజేతలు https://www.91mobiles.com/telugu/indian-gadget-awards-2023-winners/ Thu, 14 Dec 2023 14:33:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=9279 ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మీరెంతగానో ఆదరిస్తోన్న IGA 2023 (ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2023) మీ ముందుకు వచ్చేసింది. విభిన్న కేటగిరీల్లో అన్ని కంపెనీలకు చెందిన ఫోన్లు పోటీపడ్డాయి. అయితే ఎన్ని పోటీపడినా చివరకు గెలిచేది ఒక్కరే. జనాలతో ఆమోద ముద్ర వేయించుకున్న ఆ ఒక్క ఫోనే విజేతగా నిలుస్తుంది. https://www.indiangadgetawards.com/ అయితే విభాగాలు ఒకటో రెండో కాదు కదా. ఎన్నో విభాగాలు మరెన్నో మొబైల్ ఫోన్లు. గెలుపు కోసం జరిగే పోరులో హోరాహోరీ […]

The post Indian Gadget Awards 2023: విజేతలు first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మీరెంతగానో ఆదరిస్తోన్న IGA 2023 (ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2023) మీ ముందుకు వచ్చేసింది. విభిన్న కేటగిరీల్లో అన్ని కంపెనీలకు చెందిన ఫోన్లు పోటీపడ్డాయి. అయితే ఎన్ని పోటీపడినా చివరకు గెలిచేది ఒక్కరే. జనాలతో ఆమోద ముద్ర వేయించుకున్న ఆ ఒక్క ఫోనే విజేతగా నిలుస్తుంది. https://www.indiangadgetawards.com/

అయితే విభాగాలు ఒకటో రెండో కాదు కదా. ఎన్నో విభాగాలు మరెన్నో మొబైల్ ఫోన్లు. గెలుపు కోసం జరిగే పోరులో హోరాహోరీ తలపడి అగ్రస్థానం కోసం తలపడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ గ్యాడ్జెట్ 2023 పురస్కారం కోసం అన్ని మొబైల్ ఫోన్ కంపెనీలు తమ నామినీస్ ని ఇప్పటికే పంపించడం జరిగింది. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచి ఏయే ఫోన్లు ఇండియన్ గ్యాడ్జెట్ అవార్డ్స్ 2023 ని సొంతం చేసుకుంటాయోనని ఇన్ని రోజులుగా అందరూ వేచి చూశారు. ఇప్పుడు విజేతలను తెలుసుకునే సమయం వచ్చేసింది. వివిధ విభాగాల్లో మేటిగా నిలిచి అవార్డు గెలిచిన స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకుందాం పదండి.

బెస్ట్ ఫోన్ 2023 (రూ.15,000 లోపు)

Redmi 12 5G డివైజ్ భారత్ లో లాంచై రెండేళ్ళు అవుతోంది. తక్కువ ధరలో లభిస్తోన్న ఈ ఫోన్ యూజర్ల ఆదరణను పొంది విజేతగా నిలిచింది. ఈ కేటగిరిలో గట్టి పోటీ ఎదురైనప్పటికీ Redmi 12 5G అన్నింటి కంటే ఎక్కువ ఓట్లు దక్కించుకుని విన్నర్ గా నిలిచింది.

బెస్ట్ ఫోన్ 2023 (రూ.25,000 లోపు)

రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య ధర కలిగిన ఫోన్లను కొనేందుకు అధిక శాతం జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విభాగంలో వస్తోన్న ఫోన్లు యూజర్లకు కావాల్సిన అన్ని రకాల ఫీచర్లను అందిస్తుండటమే ఇందకు కారణమని తెలుస్తోంది. అంతే కాదు, యూజర్ల బడ్జెట్ లోనే ఈ ఫోన్లు లభిస్తుండటం మరొక కారణం. ఇక ఈ విభాగంలో Motorola Edge 40 Neo విజేతగా నిలిచింది.

బెస్ట్ ఫోన్ 2023 (రూ.35,000 లోపు)

ఫ్లాగ్షిప్ ఫోన్లపై ఎక్కువ మొత్తం డబ్బులు వెచ్చించడం ఇష్టం లేని యూజర్లు రూ.25,000 నుంచి రూ.35,000 మధ్య లభించే ఫోన్లను కొనేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ కేటగిరీలో మొబైల్ కంపెనీలకు గట్టి పోటో ఉంటోంది. దీంతో ఈ విభాగంలో ఆకట్టుకునే ఫీచర్లను అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ సెగ్మెంట్ లో iQOO Neo 7 Pro మొబైల్ విజేతగా నిలిచింది.

బెస్ట్ ఫోన్ 2023 (రూ.50,000 లోపు)

ఈ కేటగిరీ ఫోన్లను దాదాపుగా ఫ్లాగ్షిప్ గానే పరిగణిస్తుంటారు. ఫ్లాగ్షిప్స్ లో ఉండే ఉత్తమమైన టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ కంపోనెంట్స్, అధిక నాణ్యత ఈ ఫోన్లలోనూ ఉంటున్నాయి. దీంతో కాస్త బడ్జెట్ ఎక్కువ ఉండే వారు ఈ కేటగిరీలో లభించే ఫోన్లను కొంటున్నారు. అంతేకాదు, హై ఎండ్ ఫ్లాగ్షిప్స్ కంటే ఈ ఫోన్లు ఏమాత్రం తీసిపోవు. దీంతో ఈ కేటగిరీ ఫోన్లు కూడా మార్కెట్ లో బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. కాగా, ఈ విభాగంలో OnePlus 11R విజేతగా నిలిచింది.

బెస్ట్ సెల్ఫీ ఫోన్ 2023 – మెయిన్‌స్ట్రీమ్ (రూ.35,000 లోపు)

సెల్ఫీ కెమెరా ఫోన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇది ఏ మార్కెట్ లోనైనా సహజమే. దీంతో మొబైల్ ఫోన్ కంపెనీలు సెల్ఫీ కెమెరాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. నాణ్యమైన సెల్ఫీలను అందించే సెన్సర్స్ ని తమ ఫ్రంట్ కెమెరాల్లో వాడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో పోటీని తట్టుకుని Vivo V29 విజేతగా నిలిచింది.

బెస్ట్ కెమెరా ఫోన్ 2023 – మెయిన్‌స్ట్రీమ్ (రూ.35,000 లోపు)

ఫోన్ కొనేముందు దాదాపుగా అందరూ ఎక్కువగా ఆలోచించేది కెమెరా విభాగం గురించే. తమ జీవితంలో ముఖ్యమైన సందర్భాలను ఫోన్ కెమెరాలో బంధించాలని అందరూ ఉవ్విళ్ళూరుతుంటారు. అందుకోసమే, ఫోన్ కొనేప్పుడు కెమెరా గురించైతే కాస్త ఎక్కవగానే తెలుసుకుంటారు. ఈ విభాగంలో Vivo V29 ఉత్తమ కెమెరా ఫోన్ నిలిచింది.

బెస్ట్ కెమెరా ఫోన్ 2023 – ప్రీమియమ్

ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారు ప్రీమియమ్ కెమెరా ఫోన్లను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లలో కెమెరా పనితీరుకి తిరుగుండదు. డబ్బుకి కొదవలేని వారు ప్రీమియమ్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ సెగ్మెంట్ లో లభించే ఫోన్లలో కెమెరాలు అధునాతన టెక్నాలజీతో వస్తాయి. దీంతో ఫోటోలు, వీడియోలు ఇతర ఫోన్ల కంటే మెరుగ్గా కనిపిస్తాయి. ఈ కేటగిరీలో Apple iPhone 15 Pro Max విజేతగా నిలిచింది.

బెస్ట్ గేమింగ్ ఫోన్ 2023 – మెయిన్‌స్ట్రీమ్ (రూ.35,000 లోపు)

అన్ని ఫోన్లలో గేమ్స్ ఆడొచ్చు. కానీ లార్జ్-స్కేల్ గేమ్స్ ని స్మూథ్ గా తేలిగ్గా ఆడాలంటే ఉత్తమమైన స్పెసిఫికేషన్స్ గల ఫోన్ ఉండాల్సిందే. అయితే ఈ సెగ్మెంట్ లో ఫోన్ కొనేవారు కేవలం గేమ్స్ కోసమే కాకుండా తమ రోజువారీ ఇతర అవసరాలకై డివైజ్ ఎంపిక చేసుకుంటారు. కాబట్టి, ఈ వర్గం వారి కోసం అధిక ర్యామ్, మంచి చిప్సెట్ తో కూడిన ఫోన్లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఈ కేటగిరీలో iQOO Neo 7 Pro 5G విజేతగా నిలిచింది.

బెస్ట్ గేమింగ్ ఫోన్ 2023 – ప్రీమియమ్

కేవలం గేమ్స్ ఆడేందుకే ఫోన్లు కొనేవారుంటారు. అటువంటి వారి కోసం మొబైల్ కంపెనీలు ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ ఫోన్లలో ఎక్కువ ర్యామ్, ఉత్తమమైన ప్రాసెసర్, కూలింగ్ ఫీచర్ వంటి ఎన్నో గేమింగ్ కి అవసరమయ్యే ఫీచర్లు ఉంటాయి. ఈ విభాగంలో అన్నింటికంటే ఎక్కువ ఓట్లు సంపాదించి ASUS ROG Phone 7 Ultimate విజేతగా నిలిచింది.

బెస్ట్ ఫోల్డ్/ఫ్లిప్ ఫోన్ 2023

ఫోన్లలో ఈ మడత ఫోన్ల తీరే వేరు. ఆకట్టుకోవడంతో పాటు, అవసరాలకు అనుగుణంగా ఎన్నో విధాలుగా సాయపడతాయి. ఫోల్డ్ ఫోన్లు తెరిచిన పుస్తకంలా ఉండి మల్టీ టాస్కింగ్ ని చేసే వారి పనిని సులభం చేస్తాయి. మరోవైపు ఫ్లిప్ ఫోన్లను మధ్యలోకి మడిచి ఓ మూలన పడేయవచ్చు. ఈ ఫోన్లు ఎంతో కాంపాక్ట్ గా క్యూట్ గా ఉంటాయి. ఈ విభాగంలో OnePlus Open విజేతగా నిలిచింది.

బెస్ట్ ఫోన్ 2023

2023 ఏడాదికి అత్యుత్తమైన ఫోన్ గా నిలవాలంటే ఆ ఫోన్ ఉత్తమమైన కెమెరా, ప్రాసెసర్, ఫీచర్లతో పాటు ధర, అప్డేట్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విషయాల్లో మిన్నగా నిలవాల్సి ఉంటుంది. ఆ ఫోన్‌నే బెస్ట్ ఫోన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు వరిస్తుంది. అన్ని ఫోన్లను వెనక్కి నెట్టి, ఈ విభాగంలో Samsung Galaxy S23 Ultra విజేతగా నిలిచింది.

The post Indian Gadget Awards 2023: విజేతలు first appeared on 91Mobiles Telugu.

]]>