Independence Day Plan 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 14 Aug 2023 16:43:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! https://www.91mobiles.com/telugu/jio-introduced-independence-day-recharge-pack-2023/ Thu, 10 Aug 2023 12:04:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=7545 ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో తాజాగా ఒక కొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 2023 ఏడాదికి గాను జియో కంపెనీ ఇండిపెండెన్స్ డే 2023 యాన్యువల్ రీచార్జ్ ప్యాక్ ని తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ ధర కూడా ఖరీదైనదే. 2022 ప్లాన్ తో పోల్చితే 2023 రీచార్జ్ ప్లాన్ లో కొత్తగా మరికొన్ని ప్రయోజనాలు వచ్చి చేరాయి. ఓసారి జియో యాన్యువల్ ప్లాన్ 2023 వివరాలు తెలుసుకుందాం […]

The post లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండిపెండెన్స్ డే ప్లాన్ ప్రకటించిన జియో
  • కొత్త బెనిఫిట్స్ తో వచ్చిన ఇండిపెండెన్స్ ఆఫర్
  • 2.5జిబి డెయిలీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఇంకా ఎన్నో బెనిఫిట్స్

ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో తాజాగా ఒక కొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 2023 ఏడాదికి గాను జియో కంపెనీ ఇండిపెండెన్స్ డే 2023 యాన్యువల్ రీచార్జ్ ప్యాక్ ని తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ ధర కూడా ఖరీదైనదే. 2022 ప్లాన్ తో పోల్చితే 2023 రీచార్జ్ ప్లాన్ లో కొత్తగా మరికొన్ని ప్రయోజనాలు వచ్చి చేరాయి. ఓసారి జియో యాన్యువల్ ప్లాన్ 2023 వివరాలు తెలుసుకుందాం పదండి.

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ధర

జియో సంస్థ తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే ఆఫర్ ధరను రూ.2,999 గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డెయిలీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

రూ.2,999 రీచార్జ్ ప్యాక్ బెనిఫిట్స్

  • రూ.249 విలువగల స్విగ్గీ ఆర్డర్స్ పై రూ.100 డిస్కౌంట్
  • యాత్ర ద్వారా చేసే ఫ్లైట్ బుకింగ్స్ పై రూ.1,500 వరకు తగ్గింపు
  • యాత్ర ద్వారా చేసే డొమెస్టిక్ హోటల్ బుకింగ్ పై 15 శాతం డిస్కౌంట్
  • అజియో లో రూ.999 పైబడి కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ప్రొడక్ట్స్ పై రూ.200 డిస్కౌంట్.
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ఆడియో ప్రొడక్ట్స్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్.

జియో తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్ 2023 ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అధిక వ్యాలిడిటీ, డెయిలీ డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. అలాగే మీరు గనుక టెక్స్ట్ మెసేజెస్ ఎక్కువగా వాడితే రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు. జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ 2023 గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. మీకు నచ్చితే గనుక రీచార్జ్ చేసుకుని ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి.

The post లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! first appeared on 91Mobiles Telugu.

]]>