#IndiaLaunchDate - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Jul 2022 13:11:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో రెడ్మీ కే50ఐ 5జీ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/redmik50i5g-india-launch-date/ Wed, 06 Jul 2022 13:08:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=805 హైలైట్స్: * Redmi K50i 5G జులై 20 న భారత్ లో లాంచ్ కానుండగా, జులై 22 నుంచి అమ్మకాలు మొదలవ్వనున్నాయి. * ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67W ఛార్జింగ్ మరియు 144Hz డిస్ప్లే కలిగి ఉంటుందని అంచనా. * Redmi K50i 5G ఫాంటమ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు రంగుల్లో లభ్యం కానుంది. అప్డేట్: భారత్ లో Redmi K50i 5G లాంచ్ అయ్యే […]

The post భారత్ లో రెడ్మీ కే50ఐ 5జీ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* Redmi K50i 5G జులై 20 న భారత్ లో లాంచ్ కానుండగా, జులై 22 నుంచి అమ్మకాలు మొదలవ్వనున్నాయి.

* ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 67W ఛార్జింగ్ మరియు 144Hz డిస్ప్లే కలిగి ఉంటుందని అంచనా.

* Redmi K50i 5G ఫాంటమ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు రంగుల్లో లభ్యం కానుంది.

అప్డేట్: భారత్ లో Redmi K50i 5G లాంచ్ అయ్యే తేదీని రెడ్మీ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జులై 20 న రెడ్మీ కే50ఐ 5జీ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా రెడ్మీ వెల్లడించింది. డిజైన్, ఫాంటమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ టీజర్ ద్వారా బయటకు వచ్చాయి.

అసలు కథ అలా మొదలైంది…

ఎంతోమంది అభిమానులను సంపాదించిన రెడ్మీ కే-సిరీస్ ఫోన్లు మూడేళ్ళ తర్వాత మళ్ళీ భారత గడ్డపై అడుగు పెడుతున్నాయి. త్వరలో కే-సిరీస్ ఫోన్ (రెడ్మీ కే50ఐ 5జీ) ఒకటి భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు ఇటీవలె సదరు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు రెడ్మీ కే50ఐ 5జీ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, సేల్ డేట్, కలర్ ఆప్షన్స్ ప్రైస్ బాబా ద్వారా షేర్ కాబడ్డాయి.

గత నెలలో, మేం రెడ్మీ నోట్ 11టీ ప్రో యొక్క రీబ్రాండ్ అంటూ.. రెడ్మీ కే50ఐ 5జీ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ను ఎక్స్ క్లూజివ్ గా రివీల్ చేశాం. Redmi K50i 5G భారత్ లో ఈ నెలాఖరు కల్లా లాంచ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే తదుపరి కొన్ని రోజులకు సేల్ మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది.

Redmi K50i 5G ఇండియా లాంచ్, సేల్ డేట్

ప్రైస్ బాబా కథనం ప్రకారం, రెడ్మీ కే50ఐ 5జీ జులై 20 న లాంచ్ అవ్వనుండగా, జులై 22 నుంచి భారత్ లో సేల్ మొదలవ్వనుంది. 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్/256జిబి స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. రెడ్మీ కే50ఐ 5జీ ఫాంటమ్ బ్లూ, స్టెల్త్ బ్లాక్, క్విక్ సిల్వర్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.

Redmi K50i 5G స్పెసిఫికేషన్స్

ముందుగా అనుకున్నట్లు, రెడ్మీ కే50ఐ 5జీ, రెడ్మీ నోట్ 11టీ ప్రో యొక్క రీబ్యాడ్జ్డ్ వర్షన్. 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 144Hz రిఫ్రెస్ రేట్, ఆండ్రాయిడ్ 12, ఎంఐయూఐ 13 స్కిన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 5,080ఎంఏహెచ్ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. రెడ్మీ కే50ఐ 5జీ ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ను కలిగి ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, రెడ్మీ కే50ఐ 5జీ ఫోన్లో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్లో పొందుపరిచారు.

The post భారత్ లో రెడ్మీ కే50ఐ 5జీ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>