Infinix Hot 20 Play - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Dec 2022 11:01:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 90Hz రిఫ్రెష్ రేట్, 7GB ర్యామ్ తో లాంచైన Infinix Hot 20 Play https://www.91mobiles.com/telugu/infinix-hot-20-play-launched-with-90hz-refresh-rate-7gb-ram/ Thu, 01 Dec 2022 11:00:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=3802 హైలైట్స్ భారత్ లో లాంచైన Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ తో లాంచైన Infinix Hot 20 Play Infinix Hot 20 Play ధర రూ.8,999 మాత్రమే తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది ఇన్ఫినిక్స్ సంస్థ. జనాలు ఈ ఫోన్లను బాగానే కొంటున్నారు. దీంతో అనతి కాలంలోనే ఇన్ఫినిక్స్ కంపెనీ […]

The post 90Hz రిఫ్రెష్ రేట్, 7GB ర్యామ్ తో లాంచైన Infinix Hot 20 Play first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో లాంచైన Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్
  • 6.82-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ తో లాంచైన Infinix Hot 20 Play
  • Infinix Hot 20 Play ధర రూ.8,999 మాత్రమే

తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ తనకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకుంది ఇన్ఫినిక్స్ సంస్థ. జనాలు ఈ ఫోన్లను బాగానే కొంటున్నారు. దీంతో అనతి కాలంలోనే ఇన్ఫినిక్స్ కంపెనీ ఫోన్లకు బాగా గిరాకీ ఏర్పడింది. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో కాస్త బెటర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని అందిస్తూ ఇన్ఫినిక్స్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ భారత్ లో Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ తో లాంచైంది. కేవలం రూ.8,999 ధరతో ఈ ఫోన్ లభిస్తుండటం విశేషం. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. అరోరా గ్రీన్, ఫ్యాంటసీ పర్పుల్, లూనా బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో Infinix Hot 20 Play ని కొనుగోలు చేయవచ్చు. మరి Infinix Hot 20 Play యొక్క ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? అయితే పదండి.

Infinix Hot 20 Play స్పెసిఫికేషన్స్

Infinix Hot 20 Play లో 6.82-ఇంచ్ భారీ డిస్ప్లే అందించారు. ఇది 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. డిస్ప్లే ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. పంచ్ హోల్ స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇంత తక్కువ ధరలో పంచ్-హోల్ డిజైన్ అందిస్తుండటం విశేషం. ఇక 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇంకా 450 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, ఐకేర్ మోడ్ వంటి ఫీచర్లు ఈ డిస్ప్లేలో ఉన్నాయి.

Infinix Hot 20 Play ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్లో అమర్చారు. ఇది 2.3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. Infinix Hot 20 Play 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచైంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్ ని 3జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తం 7జిబి ర్యామ్ యూజర్లకు లభిస్తుంది.

Infinix Hot 20 Play లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Infinix Hot 20 Play ధర

భారత్ లో Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి సింగిల్ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. అరోరా గ్రీన్, ఫ్యాంటసీ పర్పుల్, లూనా బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 90Hz రిఫ్రెష్ రేట్, 7GB ర్యామ్ తో లాంచైన Infinix Hot 20 Play first appeared on 91Mobiles Telugu.

]]>