Infinix Hot 30 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 14 Jul 2023 09:17:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తక్కువ ధరలో 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన Infinix కంపెనీ; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/infinix-hot-30-5g-launched-price-specs-availability/ Fri, 14 Jul 2023 09:17:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=7185 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ యూజర్లలో మంచి పేరు సంపాదించింది ఇన్ఫినిక్స్ సంస్థ. ఓవైపు పెద్ద కంపెనీలు ఎక్కువ ధరలో 5జీ ఫోన్లను లాంచ్ చేస్తుంటే, ఇన్ఫినిక్స్ మాత్రం తక్కువ బడ్జెట్ లో 5జీ డివైజెస్ ని తీసుకొస్తూ అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంటోంది. సరే, ఓసారి Infinix Hot 30 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం. Infinix Hot 30 5G ధర ఇన్ఫినిక్స్ సంస్థ […]

The post తక్కువ ధరలో 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన Infinix కంపెనీ; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Hot 30 శ్రేణిలో కొత్త డివైజ్ ని తీసుకొచ్చిన Infinix
  • 6000mAh బ్యాటరీతో వచ్చిన హ్యాండ్సెట్
  • జులై 18 నుంచి ఫ్లిప్ కార్ట్ లో మొదలుకానున్న సేల్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందించే ఫోన్లను లాంచ్ చేస్తూ యూజర్లలో మంచి పేరు సంపాదించింది ఇన్ఫినిక్స్ సంస్థ. ఓవైపు పెద్ద కంపెనీలు ఎక్కువ ధరలో 5జీ ఫోన్లను లాంచ్ చేస్తుంటే, ఇన్ఫినిక్స్ మాత్రం తక్కువ బడ్జెట్ లో 5జీ డివైజెస్ ని తీసుకొస్తూ అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంటోంది. సరే, ఓసారి Infinix Hot 30 5G పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 30 5G ధర

ఇన్ఫినిక్స్ సంస్థ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో Infinix Hot 30 5G ని లాంచ్ చేసింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499 గా ఉంది. జులై 18 నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Infinix Hot 30 5G డిజైన్

ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, సూపర్బ్ అట్రాక్టివ్ లుక్ తో ఫోన్ వస్తోందని కంపెనీ తెలిపింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రెండు సర్క్యులర్ కెమెరా సెన్సర్స్ ఉంటాయి. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. Infinix Hot 30 5G డివైజ్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ఐపీ53 రేటింగ్, స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తోంది. పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉంది.

Infinix Hot 30 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Hot 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 580 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
  • స్టోరేజీ: Infinix Hot 30 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ర్యామ్ ని 16జిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: Infinix Hot 30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Infinix Hot 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Hot 30 5G లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

The post తక్కువ ధరలో 5జీ ఫోన్ ని లాంచ్ చేసిన Infinix కంపెనీ; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
6000mAh బ్యాటరీ, 16GB ర్యామ్ తో జులై 14 న లాంచ్ కానున్న Infinix Hot 30 5G https://www.91mobiles.com/telugu/infinix-hot-30-5g-launch-date-july-14-2023-india-key-details/ Thu, 06 Jul 2023 06:10:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=7089 భారతీయ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Hot 30 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జులై 14 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. Infinix Hot 30 5G […]

The post 6000mAh బ్యాటరీ, 16GB ర్యామ్ తో జులై 14 న లాంచ్ కానున్న Infinix Hot 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.15,000 లోపు ధరలో లాంచ్ కానున్న Infinix Hot 30 5G
  • 14 5జీ బ్యాండ్స్ తో రానున్న Infinix Hot 30 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్

భారతీయ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Hot 30 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జులై 14 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Hot 30 5G ఇండియా లాంచ్

Infinix Hot 30 5G డివైజ్ జులై 14 న భారత్ లో లాంచ్ అవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Hot 30 5G సేల్ కి రానుంది. ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా చూడవచ్చు.

భారత్ లో Infinix Hot 30 5G ధర

లాంచ్ తేదీతో పాటు Infinix Hot 30 5G ధరపై కూడా కంపెనీ నుంచి హింట్ వచ్చింది. రూ.15,000 లోపు ధరతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ తెలిపింది. Infinix Hot 30 5G డివైజ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో రానుంది. అరోరా బ్లూ, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Infinix Hot 30 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Hot 30 5G లో పంచ్-హోల్ కటౌట్, 580 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు.
  • ప్రాసెసర్: Infinix Hot 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడానున్నట్లు సమాచారం. ఇదొక ఆక్టా-కోర్ చిప్.
  • ఓఎస్: Infinix Hot 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ర్యామ్: Infinix Hot 30 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉండటం విశేషం. యూజర్ కి 8జిబి + 8జిబి అంటే 16జిబి ర్యామ్ లభించనుంది.
  • కెమెరా: Infinix Hot 30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • 5జీ బ్యాండ్: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్స్ ఎయిర్టెల్, జియో 5జీ సర్వీస్ పై బాగా పని చేస్తాయి.
  • బ్యాటరీ: Infinix Hot 30 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 6000mAh బ్యాటరీ, 16GB ర్యామ్ తో జులై 14 న లాంచ్ కానున్న Infinix Hot 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>