Infinix Hot 40 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 03 Nov 2023 18:30:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/infinix-hot-40-hot-40-pro-hot-40i-google-play-console-listing-key-details/ Fri, 03 Nov 2023 18:23:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=8692 Infinix సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. హాట్ సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఈ Hot 40 లైనప్ లో Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ ఫోన్లు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది. Infinix Hot 40 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ Infinix Hot […]

The post Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 లో లాంచ్ కానున్న Infinix లో-బడ్జెట్ ఫోన్లు
  • గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెక్స్
  • మీడియాటెక్ హీలియో చిప్‌తో వస్తోన్న డివైజెస్

Infinix సంస్థ త్వరలోనే కొత్త బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. హాట్ సిరీస్ లో ఈ డివైజెస్ రానున్నాయి. ఈ Hot 40 లైనప్ లో Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i డివైజెస్ ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ ఫోన్లు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ డివైజెస్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నాయని తెలుస్తోంది.

Infinix Hot 40 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40 మీడియాటెక్ ఎమ్‌టీ6769హెచ్ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • ఈ చిప్సెట్ హీలియో జీ88 అని ప్రాథమికంగా నిర్దారిస్తున్నారు. అంటే ఈ ఫోన్ 4జీ డివైజ్ అని అర్థమవుతోంది.
  • ఇతర వివరాలను చూస్తే, Infinix Hot 40 ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది.
  • ఇంకా Infinix Hot 40 డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

Infinix Hot 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40 Pro డివైజ్ ఈ లైనప్ లో టాప్ మోడల్ అని తెలుస్తోంది.
  • ఈ డివైజ్ మీడియాటెక్ ఎమ్‌టి6789వి/సీడీ చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది. అంటే ఇది హీలియో జీ99 చిప్ అని భావిస్తున్నారు.
  • ఇంకా Infinix Hot 40 Pro డివైజ్ 8జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2460*1080 రెజుల్యూషన్ వంటి స్పెసిఫికేషన్స్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది.

Infinix Hot 40i గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

  • Infinix Hot 40i డివైజ్ ఈ లైనప్ లో చీపెస్ట్ మోడల్. గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది.
  • Infinix Hot 40i డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తోంది.
  • Infinix Hot 40i ఫోన్ హెచ్డీ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.

The post Google Play కన్సోల్ పై లిస్టైన Infinix Hot 40, Hot 40 Pro, Hot 40i; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>