Infinix Note 40 Series Racing Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 07 Jun 2024 08:44:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ గ్లోబల్‌గా విడుదల; ధర వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-note-40-series-racing-edition-globally-released-know-the-price/ Fri, 07 Jun 2024 08:44:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=11955 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Note 40 Series రేసింగ్ ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40, Note 40 5G, Note 40 Pro, Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. బీఎండబ్ల్యూ డిజైన్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో సేల్‌కి అందుబాటు ఉన్నాయి. ఓసారి ధర […]

The post Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ గ్లోబల్‌గా విడుదల; ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన 5 స్మార్ట్‌ఫోన్స్
  • కొత్త లుక్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Note 40 Series రేసింగ్ ఎడిషన్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40, Note 40 5G, Note 40 Pro, Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. బీఎండబ్ల్యూ డిజైన్ తో ఈ ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో సేల్‌కి అందుబాటు ఉన్నాయి. ఓసారి ధర వివరాలు తెలుసుకుందాం.

Infinix Note 40 Series Racing Edition గ్లోబల్‌గా విడుదల

Infinix Note 40 Series Racing Edition లో భాగంగా మొత్తం 5 మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ కొత్త మోడల్స్ ను బీఎండబ్ల్యూ గ్రూప్ డిజైన్‌వర్క్స్ తో కలిసి ఇన్ఫినిక్స్ రూపొందించింది.

డివైజెస్ బ్యాక్ ప్యానెల్ పై సన్నని స్ట్రిప్ లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ బెటర్ గ్రిప్ అందిస్తాయి.

బ్రాండ్ ప్రకారం, ఈ డిజైన్‌ను అడ్వాన్స్డ్ యూవీ ట్రాన్స్‌ఫర్ ప్రింటింగ్ ప్రాసెస్‌ను ఉపయోగించి రూపొందించినట్లు తెలుస్తోంది.

లాంచైన 5 స్మార్ట్‌ఫోన్లు గ్లాసీ ఫినిష్ తో సిల్వర్ కలర్ ఆప్షన్ లో వచ్చాయి. రియర్ కెమెరా మాడ్యూల్ వద్ద ట్రైకలర్ కూడా కనిపిస్తోంది.

Infinix Note 40 Series Racing Edition పలు సాఫ్ట్‌వేర్ మార్పులతో వచ్చింది. యూజర్లు ఎక్స్‌క్లూజివ్ వాల్‌పేపర్స్, యూఐ ఎలిమెంట్స్ ను ఈ కొత్త రేసింగ్ ఎడిషన్ మోడల్స్ లో పొందవచ్చు.

Infinix Note 40 Series Racing Edition ధర

రేసింగ్ ఎడిషన్ లో పలు డిజైన్ మార్పులు తప్పితే మిగతా అంతా గత మోడల్స్ మాదిరి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వీటిలో మార్పు లేదు. అయితే ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.

Infinix Note 40 Racing Edition ధరను 209 డాలర్లు (సుమారు రూ.17,453) గా నిర్ణయించారు.

Infinix Note 40 5G Racing Edition ధర 259 డాలర్లు (సుమారు రూ.21,629) గా ఉంది.

Infinix Note 40 Pro Racing Edition ధర 279 డాలర్లు (సుమారు రూ.23,299) గా ఉంది.

Infinix Note 40 Pro 5G రేసింగ్ ఎడిషన్ ధర 309 డాలర్లు (సుమారు రూ.25,804) గా ఉంది.

Infinix Note 40 Pro+ 5G రేసింగ్ ఎడిషన్ ధర 329 డాలర్లు (సుమారు రూ.27,474) గా ఉంది.

Infinix Note 40 Series Racing Edition స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.

The post Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ గ్లోబల్‌గా విడుదల; ధర వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: త్వరలో లాంచ్ కానున్న Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/infinix-note-40-series-racing-edition-teaser-released-launch-expected-soon/ Tue, 04 Jun 2024 12:54:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11890 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix కొన్ని నెలల క్రితం Note 40 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ Note 40 లైనప్ లో కొత్త ఎడిషన్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా Infinix Note 40 Series Racing Edition లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ డిజైన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Infinix Note […]

The post Infinix: త్వరలో లాంచ్ కానున్న Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో నోట్ 40 రేసింగ్ ఎడిషన్ లాంచ్
  • టీజర్ విడుదల చేసిన ఇన్ఫినిక్స్
  • నోట్40, నోట్40 ప్రో, నోట్ 40 ప్రో+

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix కొన్ని నెలల క్రితం Note 40 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ Note 40 లైనప్ లో కొత్త ఎడిషన్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా Infinix Note 40 Series Racing Edition లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ డిజైన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ టీజర్

Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ యొక్క వీడియో టీజర్‌ను ఇన్ఫినిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదిక X పై షేర్ చేసింది. వీడియోలో డివైజ్‌ని గమనిస్తే, బీఎండబ్ల్యూ లోగో, ఐకానిక్ ట్రై-కలర్ స్ట్రిప్ కెమెరా మాడ్యూల్ కి పక్కన ఉంది.

అయితే ప్రస్తుతానికి బ్రాండ్ నుంచి డివైజ్‌కి సంబంధించిన లాంచ్ తేదీ వెలువడలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Infinix Note 40 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్ డెప్త్, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గ్యామట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Infinix Note 40 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

ఇతర ఫీచర్లు: Infinix Note 40 5G లో జెబిఎల్ డ్యూయల్ స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్-యాక్సిస్ మోటర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.

Infinix Note 40 5G డివైజ్ మ్యాగ్‌కిట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కిట్ లో మ్యాగ్నెటిక్ కేస్ ఉంటుంది. దీని ద్వారా 15 వాట్ వైర్లెస్ చార్జర్ ని ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఇన్ఫినిక్స్ 3000 ఎంఏహెచ్ ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తోంది.

Infinix Note 40 5G లో చీతా ఎక్స్1 పవర్ మేనేజ్మెంట్ చిప్ కూడా ఉంది. ఈ చిప్ బ్యాటరీ టెంపరేచర్ మరియు వొల్టేజీని గమనిస్తుంటుంది. దీంతో ఫాస్ట్ అండ్ సేఫ్ చార్జింగ్ సాధ్యమవుతుంది.

The post Infinix: త్వరలో లాంచ్ కానున్న Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>