Infinix Note 40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 12 Mar 2024 15:26:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: మార్చి 18న లాంచ్ అవుతోన్న Infinix Note 40 సిరీస్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-series-launch-date-march-18/ Tue, 12 Mar 2024 15:26:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=10647 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చింది. దాని ప్రకారం, Infinix Note 40 సిరీస్ మార్చి 18వ తేదీన లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ లోకి ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. లైనప్ లో పలు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఓసారి లాంచ్ మరియు లైనప్ లో వచ్చే మోడల్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post Infinix: మార్చి 18న లాంచ్ అవుతోన్న Infinix Note 40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మార్చి 18న Infinix Note 40 లాంచ్
  • లైనప్ లో 4 ఫోన్లు వచ్చే అవకాశం
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న Note 40

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన వచ్చింది. దాని ప్రకారం, Infinix Note 40 సిరీస్ మార్చి 18వ తేదీన లాంచ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్ లోకి ఈ కొత్త ఇన్ఫినిక్స్ ఫోన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. లైనప్ లో పలు మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఓసారి లాంచ్ మరియు లైనప్ లో వచ్చే మోడల్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 సిరీస్ లాంచ్ తేదీ

మార్చి 18న గ్లోబల్ మార్కెట్ లో Infinix Note 40 సిరీస్ లాంచ్ అవ్వనుందని కంపెనీ ప్రకటించింది. లైనప్ లో Infinix Note 40, Note 40 Pro, Note 40 Pro 5G, Note 40 Pro+ 5G ఫోన్లు లాంచ్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే Infinix Note 40 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సమయం పడుతుందని భావిస్తున్నారు.

Infinix Note 40 ధర (లీక్)

Infinix Note 40 స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ రష్యన్ మార్కెట్ ధర RUB 26,990 గా ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీలో ఇది రూ.24,600 ఉండొచ్చు.

Infinix Note 40 Pro ధర (లీక్)

Infinix Note 40 Pro ధర రష్యన్ మార్కెట్ లో RUB 29,990 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీలో ఇది రూ.27,300 గా ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • Infinix Note 40 సిరీస్ లోని బేస్ మోడల్ మీడియాటెక్ హీలియో జీ91 చిప్సెట్ తో వస్తుందని సమాచారం.
  • Infinix Note 40 Pro లో MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • Infinix Note 40 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
  • Infinix Note 40 Pro డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని సమాచారం. Infinix Note 40 Pro+ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Infinix Note 40 Pro+ లో వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే, ఈ టెక్నాలజీతో వస్తోన్న మొదటి ఇన్ఫినిక్స్ ఫోన్ ఇదే కానుంది.

The post Infinix: మార్చి 18న లాంచ్ అవుతోన్న Infinix Note 40 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro https://www.91mobiles.com/telugu/infinix-note-40-note-40-pro-listed-on-google-play-console-website/ Fri, 19 Jan 2024 16:14:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9811 Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 […]

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Note 40 సిరీస్
  • లైనప్ లో రానున్న Infinix Note 40, Note 40 Pro
  • 8జిబి ర్యామ్‌తో వస్తోన్న రెండు డివైజెస్

Infinix సంస్థ త్వరలో Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Infinix Note 40 మరియు Infinix Note 40 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యాయి. అయితే ప్రో మోడల్ ఇప్పటికే బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ యొక్క గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు, ప్రధాన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Note 40, Infinix Note 40 Pro గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

 

  • Infinix Note 40 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Infinix Note 40 Pro డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ పై X6850 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లు 8జిబి వరకు ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యాయి.
  • చిప్సెట్ MT6789V/CD అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. అంటే ఇది మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ అయ్యుంటుందని భావించవచ్చు.
  • రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానున్నాయి.
  • గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై రెండర్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ల లుక్ రివీల్ అయ్యింది.
  • రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ని కలిగి ఉన్నాయని రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • రెండు డివైజెస్ లో కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి.

Infinix Note 40 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ లో 1080*2436 పిక్సెల్స రెజుల్యూషన్ గల డిస్ప్లే, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 మరియు Infinix Note 40 Pro డివైజెస్ 8జిబి వరకు ర్యామ్, బేస్ మోడల్ 128జిబి స్టోరేజీతో రానున్నాయి.
  • కెమెరా: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఇవి 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • ఓఎస్: Infinix Note 40, Infinix Note 40 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.

The post Infinix: గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్‌పై లిస్టైన Infinix Note 40, Note 40 Pro first appeared on 91Mobiles Telugu.

]]>