Infinix Smart 7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:12:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 13ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 https://www.91mobiles.com/telugu/infinix-smart-7-launched-india-price-specs-availability/ Wed, 22 Feb 2023 07:43:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5052 నేడు భారతీయ మార్కెట్ లో Infinix Smart 7 లాంచైంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ1 అనే ప్రాసెసర్ వాడారు. రెడ్మీ ఏ1, పోకో సీ50, టెక్నో పాప్ 7 ప్రో వంటి ఫోన్లతో Infinix Smart 7 పోటీ పడనుంది. Infinix Smart 7 లో భారీ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, […]

The post 13ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారతీయ మార్కెట్ లో లాంచైన Infinix Smart 7 స్మార్ట్ ఫోన్
  • 13ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ పోర్ట్ తో వచ్చిన Infinix Smart 7
  • భారత్ లో Infinix Smart 7 ఫోన్ 4జిబి+64జిబి వేరియంట్ ధర రూ.7,299

నేడు భారతీయ మార్కెట్ లో Infinix Smart 7 లాంచైంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ1 అనే ప్రాసెసర్ వాడారు. రెడ్మీ ఏ1, పోకో సీ50, టెక్నో పాప్ 7 ప్రో వంటి ఫోన్లతో Infinix Smart 7 పోటీ పడనుంది. Infinix Smart 7 లో భారీ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఓసారి Infinix Smart 7 ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Smart 7 ధర, లభ్యత

Infinix Smart 7 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Infinix Smart 7 స్పెసిఫికేషన్స్

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ1 అనే చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీపీయూ వినియోగించారు. Infinix Smart 7 డివైజ్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ లో 3జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Smart 7 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫ్రంట్ కూడా ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

Infinix Smart 7 లో పవర్ బ్యాకప్ కోసం 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే సాఫ్ట్ వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటుంది.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ అజూర్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వేవ్ ప్యాటర్న్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ బ్యాక్ ప్యానెల్ తో ఈ ఫోన్ రావడం విశేషం. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.63 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.37 మిల్లీ మీటర్ల మందం, 207 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 13ఎంపి కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Smart 7 https://www.91mobiles.com/telugu/infinix-smart-7-india-launch-timeline-price-details/ Wed, 15 Feb 2023 13:57:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=4945 వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందించడంలో Infinix సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుదన్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను అందిస్తూ జనాలకు తక్కువ సమయంలోనే చేరువైంది ఇన్ఫినిక్స్ సంస్థ. ఇప్పుడు బడ్జెట్ బయ్యర్ల కోసం Infinix Smart 7 అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 22 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. భారత్ లో Infinix Smart 7 ధర భారత […]

The post ఫిబ్రవరి 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Smart 7 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 7జిబి ర్యామ్, 6,000mAh బ్యాటరీతో వస్తోన్న Infinix Smart 7 స్మార్ట్ ఫోన్
  • ఫిబ్రవరి 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Smart 7 డివైజ్
  • భారత్ లో Infinix Smart 7 ధర రూ.7,299 గా ఉండే అవకాశం

వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందించడంలో Infinix సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుదన్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను అందిస్తూ జనాలకు తక్కువ సమయంలోనే చేరువైంది ఇన్ఫినిక్స్ సంస్థ. ఇప్పుడు బడ్జెట్ బయ్యర్ల కోసం Infinix Smart 7 అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 22 న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది.

భారత్ లో Infinix Smart 7 ధర

భారత మార్కెట్ లో Infinix Smart 7 ధర రూ.7,299 గా ఉండనుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో ఫోన్ లభించనుంది.

Infinix Smart 7 స్పెసిఫికేషన్స్

  • 4జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్
  • 3జిబి వర్చువల్ ర్యామ్
  • 64జిబి స్టోరేజీ
  • 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ

Infinix Smart 7 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వి షేప్డ్ నాచ్ డిజైన్ తో డిస్ప్లే ఉంటుంది. మూడు వైపులా బెజెల్ లెస్ డిజైన్ బాటమ్ లో చిన్ కాస్త మందంగా కనిపిస్తుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ తో వస్తోంది. ఇది ఫోన్ కి మంచి లుక్ ని అందిస్తుంది.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో 4జిబి ర్యామ్ తో లాంచ్ అవుతోంది. ఇంకా ఈ డివైజ్ 3జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తుండటం విశేషం. 64జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. అయితే ఈ ఫోన్ లో ఏ ప్రాసెసర్ వాడారో ఇంకా తెలియదు. ప్రాసెసర్ వివరాల కోసం ఫిబ్రవరి 22 వరకు ఆగాల్సిందే.

Infinix Smart 7 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ లో హైలైట్ పాయింట్ బ్యాటరీ అనే చెప్పాలి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకధాటిగా 10 సినిమాలు చూడవచ్చని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఈ ఫోన్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా + ఒక వీజీఏ లెన్స్ ఉండే అవకాశం ఉంది. లెన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు లాంచ్ రోజున తెలుస్తాయి. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 22 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Smart 7 first appeared on 91Mobiles Telugu.

]]>