Infinix Zero 40 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 30 Aug 2024 15:30:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/#respond Fri, 30 Aug 2024 15:30:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13263 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన Zero సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Infinix Zero 40 4G, Infinix Zero 40 5G అనే పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, గోప్రో మోడల్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి వీటి […]

The post Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Zero 40 4జీ, 4జీ విడుదల
  • 144Hz అమోలెడ్ డిస్ప్లే
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో తన Zero సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Infinix Zero 40 4G, Infinix Zero 40 5G అనే పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, గోప్రో మోడల్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి వీటి ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Infinix Zero 40 4G, Zero 40 5G ధరలు

ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ధరను 399 డాలర్లు (సుమారు రూ.33,500) గా పెట్టారు. ఇన్ఫినిక్స్ జీరో 40 4జీ డివైజ్ ధరను 289 డాలర్లు (సుమారు రూ.24,200) గా నిర్ణయించారు. మార్కెట్‌ను బట్టి, డివైజెస్ ధరలు మారుతాయని కంపెనీ చెప్పింది.

మలేషియాలో ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ వేరియంట్ ధర MYR 1699 (సుమారు రూ.33,000), ఇన్ఫినిక్స్ జీరో 40 4జీ మోడల్ ధర MYR 1,200 (సుమారు రూ.23,300).

కలర్ ఆప్షన్స్: Infinix Zero 40 5జీ వేరియంట్ మూవింగ్ టైటానియమ్, రాక్ బ్లాక్ మరియు వయొలెట్ గార్డెన్ కలర్స్ లో లభిస్తుంది. 4జీ వేరియంట్ బ్లాసమ్ గ్లొ, మిస్టీ ఆక్వా మరియు రాక్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఇండియా లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

GoPro Mode: ఈ రెండు ఫోన్లు కూడా గో ప్రో డివైజ్ తో నేరుగా పెయిర్ అవుతాయి. ఫోన్ డిస్ప్లేను స్క్రీన్ ఫుటేజీ మానిటర్ గా వాడుకోవచ్చు. వ్లాగ్స్ చేసే వారికి ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వ్లాగ్ మోడ్ కూడా ఇచ్చారు. క్రియేటర్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Infinix Zero 40 5జీ, 4జీ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 40 5జీ వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ అందించారు. 4జీ వేరియంట్ లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్లు 24జిబి వరకు డైనమిక్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 512జిబి ఇంటర్నల్ స్టోరేజీని అందించారు.

సాఫ్ట్‌వేర్: Infinix Zero 40 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఇన్ఫినిక్స్ యూఐ కస్టమ్ స్కిన్ తో పని చేస్తాయి.

కెమెరా: Infinix Zero 40 ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. 5జీ మోడల్ 20 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Zero 40 సిరీస్ ఫోన్లలో డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జెమిని ఏఐ అసిస్టెంట్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Infinix Zero 40 Series: 108MP కెమెరాతో లాంచైన Zero 40 4G, Zero 40 5G first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-zero-40-5g-globally-launched-know-the-details/feed/ 0
Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/ https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/#respond Mon, 22 Jul 2024 11:41:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=12612 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. Infinix […]

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Zero 40 4G లాంచ్
  • మోడల్ నంబర్ X6860
  • హీలియో జీ99 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Infinix Zero 40 4G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Zero 40 4G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై X6860 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

క్రింద ఇమేజ్ లో Infinix Zero 40 4G పేరుని మీరు గమనించవచ్చు. సర్టిఫికేషన్ ప్రకారం, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 జీపీయూ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఇంకా Infinix Zero 40 4G డివైజ్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పిక్సెల్ డెన్సిటీ తో లిస్ట్ అయ్యింది.

అలాగే గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Infinix Zero 40 4G టీయూవీ లిస్టింగ్

Infinix Zero 40 4G డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై X6860 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ పేరును ఈ లిస్టింగ్ పై పేర్కొనలేదు.

Infinix Zero 40 4G డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టీయూవీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.

మెమొరీ: Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Infinix Zero 30 4G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-zero-40-4g-listed-google-play-console-tuv-sites/feed/ 0