Infinix Zero 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Sep 2022 05:30:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 FCC లిస్టింగ్ పై కనిపించిన Infinix Zero 5G 2023 మోడల్, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/infinix-zero-5g-2023-model-spotted-fcc-listing-specs/ Tue, 20 Sep 2022 05:22:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2449 హైలైట్స్: ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై కనిపించిన Infinix Zero 5G 2023 సర్టిఫికేషన్ జాబితాలో కనిపించిన బ్యాటరీ, కనెక్టివిటీ, డైమెన్షన్ వివరాలు 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Infinix Zero 5G Transsion సంస్థ యొక్క సొంత బ్రాండ్ అయిన Infinix గతేడాది Infinix Zero 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నుంచి ఇదే మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ కావడం విశేషం. భారత మార్కెట్ లో ఇన్ఫినిక్స్ కి ఈ […]

The post FCC లిస్టింగ్ పై కనిపించిన Infinix Zero 5G 2023 మోడల్, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై కనిపించిన Infinix Zero 5G 2023
  • సర్టిఫికేషన్ జాబితాలో కనిపించిన బ్యాటరీ, కనెక్టివిటీ, డైమెన్షన్ వివరాలు
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Infinix Zero 5G

Transsion సంస్థ యొక్క సొంత బ్రాండ్ అయిన Infinix గతేడాది Infinix Zero 5G ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నుంచి ఇదే మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ కావడం విశేషం. భారత మార్కెట్ లో ఇన్ఫినిక్స్ కి ఈ ఫోన్ మోస్ట్ ప్రీమియమ్ ఫోన్. ఇప్పుడు ఇన్ఫినిక్స్ కంపెనీ Infinix Zero 5G యొక్క 2023 మోడల్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.

X6815C అనే మోడల్ నంబర్ తో Infinix Zero 5G 2023 ఫోన్ FCC లిస్టింగ్ పై కనిపించింది. ఎఫ్‌సీసీ జాబితా ద్వారా మనకు స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఫీచర్స్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, ఫోన్ డయాగ్రామ్ కనిపించాయి.

ఫోన్ డయాగ్రామ్ ద్వారా ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉందని స్పష్టమైంది. అలాగే లిస్టింగ్ ని గమనిస్తే, ఈ ఫోన్ 4900ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంకా 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్ వర్షన్ 5.0, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. Infinix Zero 5G 2023 మోడల్ కి సంబంధించిన ఇతర వివరాలను జాబితా వెల్లడించలేదు. అయితే 2022 మోడల్ మాదిరి ఫీచర్లు ఇందులో కూడా ఉండనున్నాయని సమాచారం.

Infinix Zero 5G 2023 మోడల్ 169ఎంఎం పొడవు, 77ఎంఎం వెడల్పు, 9ఎంఎం మందం ఉండనుంది. అంటే 2022 లో వచ్చిన మోడల్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది. మునుపటి మోడల్ 168.7ఎంఎం పొడవు, 76.5ఎంఎం వెడల్పు, 8.8ఎంఎం మందం ఉంది. ఫోన్ డయాగ్రామ్ ని బట్టి, Infinix Zero 5G 2023 లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.

Infinix Zero 5G స్పెసిఫికేషన్స్

Infinix Zero 5G ఈ ఏడాది ఫిబ్రవరి లో లాంచ్ అయ్యింది. బ్రాండ్ నుంచి లాంచ్ అయిన తొలి 5జీ ఫోన్ అయిన దీంట్లో, 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా విభాగం చూస్తే, Infinix Zero 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ సెన్సర్, 13ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. Infinix Zero 5G లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. అలాగే భారత్ లో లాంచ్ తేదీపై కూడా స్పష్టత రానుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post FCC లిస్టింగ్ పై కనిపించిన Infinix Zero 5G 2023 మోడల్, రివీల్ అయిన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>