iPhone 11 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Sep 2022 14:21:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones https://www.91mobiles.com/telugu/apple-iphones-discount-sales-flipkart/ Wed, 21 Sep 2022 14:21:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=2489 హైలైట్స్: ఐఫోన్స్ పై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించిన ఆపిల్ సంస్థ ఎన్నడూ లేని రీతిలో తగ్గిన ఐఫోన్ ధరలు, సంతోషంలో ఐఫోన్ లవర్స్ iPhone 14 లాంచ్ తర్వాత iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఆపిల్ మీరు కనుక ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే మంచి తరుణం. ఒక రకంగా చెప్పాలంటే, ఇది గోల్డెన్ చాన్స్. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ iPhone 11, iPhone […]

The post తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్స్ పై బంపర్ డిస్కౌంట్స్ ప్రకటించిన ఆపిల్ సంస్థ
  • ఎన్నడూ లేని రీతిలో తగ్గిన ఐఫోన్ ధరలు, సంతోషంలో ఐఫోన్ లవర్స్
  • iPhone 14 లాంచ్ తర్వాత iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన ఆపిల్

మీరు కనుక ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే మంచి తరుణం. ఒక రకంగా చెప్పాలంటే, ఇది గోల్డెన్ చాన్స్. ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ iPhone 11, iPhone 12, iPhone 13 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి మొదలయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్లను తక్కువలో తక్కువ రూ.19,000 ధరలో సొంతం చేసుకోవచ్చు. ఓసారి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ల ధరలపై లుక్ వేయండి. మీరు సంతోషంలో మునిగి తేలడం ఖాయం. మరి ఆఫర్ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

డిస్కౌంట్ పై Apple iPhone

ఎక్కువ ధర పలికే ఐఫోన్ 14 ని కొనలేకపోతున్నారా? అయితే ఏం బాధపడవద్దు. ఎందుకంటే తక్కువ ధరలో ఐఫోన్ గత మోడల్స్ ని మీరు ఫ్లిప్ కార్ట్ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 23 న ప్రారంభమయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ఐఫోన్ మోడల్స్ ని మంచి డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

iPhone 11 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.43,900 గా ఉంది. ఈ ఫోన్ పై రూ.19000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. అంటే మీ పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా 19 వేలు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకు ఐఫోన్ 11 ని సొంతం చేసుకోవచ్చు.

iPhone 12 128జిబి వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం రూ.64,900 గా ఉంది. ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.19,000 వరకు లభిస్తుంది. ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఫోన్ కొనుగోలు పై 5 శాతం డిస్కౌంట్ పొందుతారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ టైమ్ లో ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

iPhone 13 మరియు iPhone 14 ఫోన్లు డిజైన్ పరంగా దాదాపు ఒకే విధంగా కనిపిస్తాయి. అయితే, రెండు ఫోన్ల ధరలు మాత్రం వేరు. iPhone 13 ధర ప్రస్తుతం రూ.69,900 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో రూ.19,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తోంది. మీ వద్ద ఐఫోన్ 11 ఉంటే మీకు రూ.18 వేలు అంత కంటే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఐఫోన్ 13 ధర రూ.50,900 వరకు తగ్గనుంది. మీరు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు వేచి చూస్తే, ఐఫోన్ 13 ధర రూ.20,000 వరకు తగ్గనుంది. తక్కువలో తక్కువ రూ.49,000 కి iPhone 13 ని సొంతం చేసుకోవచ్చని ఇటీవలె ఫ్లిప్ కార్ట్ సూచించింది.

The post తక్కువ ధరలో లభిస్తోన్న APPLE iPhones first appeared on 91Mobiles Telugu.

]]>