iPhone 14 Pro Max - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Nov 2022 08:53:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 14 Pro, 14 Pro Max పంపిణీలో జాప్యం, కొవిడ్ విజృంభణే కారణం https://www.91mobiles.com/telugu/iphone-14-pro-production-slows-down-covid-19-lockdown-late-delivery/ Mon, 07 Nov 2022 08:53:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=3274 హైలైట్స్ ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లో iPhone 14 Pro, 14 Pro Max వేయిటింగ్ టైమ్ 3 నుంచి 4 వారాలు చైనాలో తరచూ కొవిడ్ లాక్డౌన్స్, నెమ్మదించిన ఆపిల్స్ ఫోన్ల ఉత్పత్తి వర్కర్స్ తరలిపోతుండటంతో ఆపిల్ ఉత్పత్తుల తయారీదారు Foxconn కంపెనీలో ప్రొడక్షన్ పై ప్రభావం చైనాలో తరచూ లాక్డౌన్స్ విధిస్తుండటంతో ఆ ప్రభావం దిగ్గజ కంపెనీ అయిన Apple పై పడింది. చైనాలో ఆపిల్ ఉత్పత్తులను తయారీ చేస్తున్న కంపెనీలపై ఈ […]

The post iPhone 14 Pro, 14 Pro Max పంపిణీలో జాప్యం, కొవిడ్ విజృంభణే కారణం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ లో iPhone 14 Pro, 14 Pro Max వేయిటింగ్ టైమ్ 3 నుంచి 4 వారాలు
  • చైనాలో తరచూ కొవిడ్ లాక్డౌన్స్, నెమ్మదించిన ఆపిల్స్ ఫోన్ల ఉత్పత్తి
  • వర్కర్స్ తరలిపోతుండటంతో ఆపిల్ ఉత్పత్తుల తయారీదారు Foxconn కంపెనీలో ప్రొడక్షన్ పై ప్రభావం

చైనాలో తరచూ లాక్డౌన్స్ విధిస్తుండటంతో ఆ ప్రభావం దిగ్గజ కంపెనీ అయిన Apple పై పడింది. చైనాలో ఆపిల్ ఉత్పత్తులను తయారీ చేస్తున్న కంపెనీలపై ఈ కొవిడ్ లాక్డౌన్స్ ప్రభావం పడింది. మరోవైపు ఆపిల్ సంస్థ తన ఐఫోన్ 14 తయారీని ఇతర లొకేషన్స్ కి షిఫ్ట్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం చైనాలో ఆపిల్ యొక్క ప్రో వేరియంట్స్ మాత్రమే తయారవుతున్నాయి. చైనాలోని కీలక ప్రాంతాల్లో తరచూ లాక్డౌన్స్ పెడుతుండటంతో iPhone 14 Pro మోడల్స్ ని డిమాండ్ కి తగినట్లుగా ఆపిల్ పంపిణీ చేయలేకపోతోంది.

చైనాలో లాక్డౌన్స్ కారణంగా తాము ఊహించిన దాని కంటే తక్కువస్థాయిలో ప్రీమియమ్ ఐఫోన్ మోడల్స్ డెలివరీ జరిగినట్లు ఆపిల్ తెలిపింది. కొవిడ్-19 రిస్ట్రిక్షన్స్ వల్లన జెంగ్జూ లోని ప్రధాన అసెంబ్లీ యూనిట్ పై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు ఆపిల్ పేర్కొంది. చాలా వరకు తక్కువ సామర్థ్యంతో ఈ యూనిట్ పని చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది. మరోపక్క iPhone 14 Pro, iPhone 14 Pro Max మోడల్స్ కి డిమాండ్ భారీస్థాయిలో ఉన్నట్లు ఆపిల్ చెప్పింది. కస్టమర్లు ఆపిల్ ఉత్పత్తుల కోసం చాలా రోజులు వేచి చూడక తప్పదని ఆపిల్ తెలిపింది.

ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో హ్యాండ్సెట్స్ నవంబర్ ఆఖర్లో లేదా డిసెంబర్ ఆరంభంలో డెలివరీ అవుతాయని ఆపిల్ అధికార వెబ్‌సైట్ లో ఉంది. ఆపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో డెలివరీ సమయం 3 నుంచి 4 వారాలుగా చూపిస్తోంది. కలర్, స్టోరేజీ లతో సంబంధం లేకుండా అన్ని వేరియంట్స్ కి ఇదే వెయిటింగ్ పీరియడ్ ఉంది.

iPhone 14 Pro, 14 Pro Max స్పెసిఫికేషన్స్

iPhone 14 Pro, 14 Pro Max స్మార్ట్ ఫోన్స్ లో A16 Bionic చిప్సెట్ వాడారు. ఈ డివైజెస్ వరుసగా 6.1-ఇంచ్ మరియు 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేస్ కలిగి ఉన్నాయి. వీటిలో 120 హెర్ట్జ్ ప్రొమోషన్ రిఫ్రెష్ రేట్ ఉంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోన్స్ లో ఉంది. డ్యూయల్ నాచ్ కటౌట్, డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

iPhone 14 Pro మోడల్స్ లో కొత్త కెమెరా సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీటిలో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ (2ఎక్స్ ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iPhone 14 Pro మోడల్స్ ఐఓఎస్ 16 పై పని చేస్తాయి. బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయడం లేదు. ప్రో మోడల్స్ 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. 15 వాట్ మ్యాగ్ సేఫ్ చార్జింగ్, 7.5 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

iPhone 14 Pro 128జిబి వేరియంట్ ధర రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతుంది. iPhone 14 Pro Max 128జిబి యూనిట్ ధర రూ.1,39,900 గా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post iPhone 14 Pro, 14 Pro Max పంపిణీలో జాప్యం, కొవిడ్ విజృంభణే కారణం first appeared on 91Mobiles Telugu.

]]>
డైనమిక్ ఐల్యాండ్, 48MP కెమెరా, A16 Bionic చిప్ తో లాంచ్ అయిన iPhone 14 Pro, 14 Pro Max https://www.91mobiles.com/telugu/iphone-14-pro-and-14-pro-max-launched-price-specs/ Thu, 08 Sep 2022 05:49:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2186 హైలైట్స్: లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐల్యాండ్ (పిల్-షేప్ నాచ్), ఏ16 బయోనిక్ చిప్ తో లాంచ్ అయిన హ్యాండ్సెట్స్ 48ఎంపి కెమెరాతో వస్తున్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అఫీషియల్ గా లాంచ్ అయ్యాయి. అల్ట్రా-ప్రీమియమ్ ఫీచర్లను ఈ ఫోన్స్ కలిగి ఉన్నాయి. కొత్త డిజైన్, చిప్సెట్, కెమెరాస్, సిమ్ ట్రేస్ లేకుండా […]

The post డైనమిక్ ఐల్యాండ్, 48MP కెమెరా, A16 Bionic చిప్ తో లాంచ్ అయిన iPhone 14 Pro, 14 Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్
  • డైనమిక్ ఐల్యాండ్ (పిల్-షేప్ నాచ్), ఏ16 బయోనిక్ చిప్ తో లాంచ్ అయిన హ్యాండ్సెట్స్
  • 48ఎంపి కెమెరాతో వస్తున్న ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అఫీషియల్ గా లాంచ్ అయ్యాయి. అల్ట్రా-ప్రీమియమ్ ఫీచర్లను ఈ ఫోన్స్ కలిగి ఉన్నాయి. కొత్త డిజైన్, చిప్సెట్, కెమెరాస్, సిమ్ ట్రేస్ లేకుండా (యూఎస్ మార్కెట్), భారీ ధరతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ యూఎస్ ప్రారంభ ధర రూ.80,000 గా ఉంది. భారత్ లో రూ.1 లక్ష దాటే అవకాశముంది. ఏ16 బయోనిక్ చిప్, 48ఎంపి కెమెరా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వంటి ముఖ్య ఫీచర్లను ఈ ఫోన్స్ కలిగి ఉన్నాయి. ఐఫోన్ ప్రో మోడల్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 14 Pro, iPhone 14 Pro Max ధర, విక్రయ తేదీ

ఐఫోన్ 14 ప్రో ధర భారత్ లో రూ.1,29,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 1టీబీ వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి హ్యాండ్సెట్స్ ప్రీ-ఆర్డర్ మొదలవుతుంది. సెప్టెంబర్ 13 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ రెండు ఫోన్లు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. అవి: స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్.

iPhone 14 Pro, Pro Max స్పెసిఫికేషన్స్

iPhone 14 Pro, Pro Max డివైజెస్ కొత్త ఫ్రంట్ డిజైన్ తో వస్తున్నాయి. పిల్-షేప్డ్ నాచ్ లో ఫేస్ ఐడీ కంపోనెంట్స్, ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా మాత్రమే ఉంటాయి. ప్రాక్సిమిటీ, ఇతర సెన్సర్ లను స్క్రీన్ వెనకాల అమర్చారు. యానిమేషన్ ద్వారా నాచ్, స్క్రీన్ తో ఈజీగా బ్లెండ్ అవుతోంది. ఈ అమరికను ఆపిల్ ‘డైనమిక్ ఐల్యాండ్’ అని పిలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైనమిక్ ఐల్యాండ్ విస్తరించి యూజర్ ని అలర్ట్ చేస్తుంది. ఆమేరకు డైనమిక్ ఐల్యాండ్ యొక్క పనితీరుని ఆపిల్ ప్రదర్శించింది.

iPhone 14 Pro లో 6.1 అంగుళాల డిస్ప్లే, iPhone 14 Pro Max లో 6.7 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. రెండు డివైజెస్ లో 1600 నిట్స్ – 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. హెచ్డీఆర్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10, హెచ్ఎల్‌జీ, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ప్రోమోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గేముత్, 460 పీపీఐ, ఏ16 బయోనిక్ చిప్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి. 6జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి/1టీబీ స్టోరేజీ వేరియంట్లో ఈ డివైజెస్ లభించనున్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, రెండు ప్రో మోడల్స్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 48ఎంపి క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది. బ్రైట్నెస్ రెండింతలు ఫ్లాష్ ద్వారా రానుంది. 4కే వీడియో రికార్డింగ్ సౌకర్యం ఈ ఫోన్లలో ఉంది. శాటిలైట్ సర్వీస్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, క్రాష్ డిటెక్షన్, ఫేస్ ఐడీ వంటి భద్రత ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

The post డైనమిక్ ఐల్యాండ్, 48MP కెమెరా, A16 Bionic చిప్ తో లాంచ్ అయిన iPhone 14 Pro, 14 Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>