iPhone 16 Pro Max - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 10 Sep 2024 07:41:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Apple: భారత్‌లో లాంచైన iPhone 16 Pro, iPhone 16 Pro Max https://www.91mobiles.com/telugu/apple-iphone-16-pro-and-16-pro-max-launched-in-india-know-the-details/ https://www.91mobiles.com/telugu/apple-iphone-16-pro-and-16-pro-max-launched-in-india-know-the-details/#respond Tue, 10 Sep 2024 04:55:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13406 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తన iPhone 16 సిరీస్ ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా […]

The post Apple: భారత్‌లో లాంచైన iPhone 16 Pro, iPhone 16 Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో iPhone 16 సిరీస్ విడుదల
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • ఆపిల్ 3ఎన్ఎమ్ ఏ18 ప్రో చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తన iPhone 16 సిరీస్ ఫోన్లను భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 16 Pro, iPhone 16 Pro Max మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా గ్రేడ్ 5 టైటానియమ్, 3ఎన్ఎమ్ ఏ18 ప్రో చిప్సెట్ తో వచ్చాయి. ఇప్పుడు ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

iPhone 16 Pro, iPhone 16 Pro Max ధర

iPhone 16 Pro 128జిబి మోడల్ యొక్క ధర రూ.1,19,900 గా ఉంది. 256జిబివ వేరియంట్ ధర 1,29,900 గా ఉంది. 512జిబి వేరియంట్ ధర రూ.1,49,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,69,900 గా ఉంది.

మరోవైపు, iPhone 16 Pro Max 256జిబి మోడల్ ధర రూ.1,44,900 గా ఉంది. 512జిబి వేరియంట్ ధర రూ.1,64,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,84,900 గా ఉంది.

సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ రెండు ఫోన్లు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి.

iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఫోన్లు డెజర్ట్ టైటానియమ్, వైట్ టైటానియమ్, బ్లాక్ టైటానియమ్, నేచురల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iPhone 16 Pro, iPhone 16 Pro Max స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 16 Pro లో 6.3-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్ ఇచ్చారు. iPhone 16 Pro Max లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇందులో అందించారు.

ప్రాసెసర్: iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఫోన్లలో ఏ18 ప్రో బయోనిక్ చిప్సెట్ ఇచ్చారు. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.89 గిగాహెర్ట్జ్.

కెమెరా: iPhone 16 Pro సిరీస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 12ఎంపి 5ఎక్స్ టెలీఫోటో లెన్స్, 48ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: iPhone 16 Pro సిరీస్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు. రెండు ఫోన్లు కూడా మ్యాగ్‌సేఫ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి.

సాఫ్ట్‌వేర్: iPhone 16 Pro మరియు iPhone 16 Pro Max ఫోన్లు ఐఓఎస్ 18 ఓఎస్ పై పని చేస్తాయి.

ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లు ఐపీ68 రేటింగ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మ్యాగ్‌సేఫ్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ ఉన్నాయి.

The post Apple: భారత్‌లో లాంచైన iPhone 16 Pro, iPhone 16 Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/apple-iphone-16-pro-and-16-pro-max-launched-in-india-know-the-details/feed/ 0