iPhone SE 2022 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Sep 2022 08:21:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 14 లాంచ్ తర్వాత పెరిగిన iPhone SE 2022 ధర https://www.91mobiles.com/telugu/apple-hiked-iphone-se-2022-price-rs-6000-india/ Fri, 09 Sep 2022 08:21:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=2223 హైలైట్స్: భారత్ లో రూ.6000 పెరిగిన iPhone SE 2022 ధర రూ.43,000 తో లాంచ్ అయిన iPhone SE 2022, ప్రస్తుతం ఫోన్ ప్రారంభ ధర రూ.49,900 A15 Bionic చిప్, 12MP కెమెరా, 5G కనెక్టివిటీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ఐఫోన్ 14 సిరీస్ ని ఆపిల్ ఈ వారంలో లాంచ్ చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 ఫోన్ల ధరలను తగ్గించింది. దీంతో ఈ ఫోన్లను […]

The post iPhone 14 లాంచ్ తర్వాత పెరిగిన iPhone SE 2022 ధర first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో రూ.6000 పెరిగిన iPhone SE 2022 ధర
  • రూ.43,000 తో లాంచ్ అయిన iPhone SE 2022, ప్రస్తుతం ఫోన్ ప్రారంభ ధర రూ.49,900
  • A15 Bionic చిప్, 12MP కెమెరా, 5G కనెక్టివిటీ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 14 సిరీస్ ని ఆపిల్ ఈ వారంలో లాంచ్ చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 12 ఫోన్ల ధరలను తగ్గించింది. దీంతో ఈ ఫోన్లను కొనాలనుకునే వారికి ఆపిల్ శుభవార్త చెప్పినట్లైంది. అయితే, మెల్లగా కాంపాక్ట్ ఫోన్ ఆపిల్ ఎస్ఈ 2022 ధరను ఆపిల్ పెంచేసింది. బేస్ మోడల్ పై రూ.6000 ధర పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఈ ఏడాది మొదట్లో ఐఫోన్ ఎస్ఈ 2022 రూ.43,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది.

ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయిన కేవలం కొన్ని రోజులకు ఈ కాంపాక్ట్ ఫోన్ ధరను ఆపిల్ పెంచేసింది. ఇకపోతే ఐఫోన్ 14 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.79,900 గా ఉంది. iPhone SE 2022 ధరను పెంచడానికి ఆపిల్ ఏ కారణాన్ని వెల్లడించలేదు. యూఎస్ డాలర్, రూపీ కన్వర్షన్ వల్లన ఈ ధరల వ్యత్యాసం చోటు చేసుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, కంపోనెంట్స్, లాజిస్టిక్స్ ధరలు కూడా పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది.

భారత్ లో iPhone SE 2022 ధర

iPhone SE 2022 64జిబి వర్షన్ రూ.43,900 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీని ధర రూ.49,900 గా ఉంది. 128జిబి ధర రూ.54,900 కాగా, 256జిబి ధర రూ.64,900 గా ఉంది. ఆపిల్ వెబ్ సైట్ లో పెరిగిన ధరలు దర్శనమిస్తున్నాయి.

iPhone SE 2022 స్పెసిఫికేషన్స్

iPhone SE 2022 4.7 ఇంచెస్ ట్రూటోన్ హెచ్డీ డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే 750*1334 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. హెచ్డీఆర్10 సపోర్ట్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఏ15 బయోనిక్ చిప్ ని ఇందులో అమర్చారు. ఐఫోన్ ఎస్ఈ 3 64జిబి, 128జిబి, 256జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.

iPhone SE 2022 లో 12ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్, డీప్ ఫ్యూజన్, నైట్ మోడ్, సినిమాటిక్ వీడియో రికార్డింగ్, పొట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 7ఎంపి కెమెరా అమర్చారు.

iPhone SE 2022 20వాట్ ఫాస్ట్ చార్జింగ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ (మ్యాగ్ సేఫ్ కాదు) ని కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, 5జీ, గిగాబిట్-క్లాస్ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.0, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ చిప్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, లైట్నింగ్ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 138.4 మిల్లీమీటర్ల పొడవు, 67.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.3 మిల్లీ మీటర్ల మందం, 148 గ్రాముల బరువు ఉంటుంది. iPhone SE 2022 లో టచ్ ఐడీ సెన్సర్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post iPhone 14 లాంచ్ తర్వాత పెరిగిన iPhone SE 2022 ధర first appeared on 91Mobiles Telugu.

]]>