iPhone - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 Nov 2023 09:41:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 33 iPhones దొంగిలించి, గర్ల్‌ఫ్రెండ్‌కి కారు గిఫ్ట్ ఇచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్! https://www.91mobiles.com/telugu/33-iphones-stolen-by-delivery-executive-gifted-car-to-girlfriend-in-turkey/ Fri, 17 Nov 2023 09:41:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8876 ప్రేమికులు తమ ప్రేమను చూపేందుకు ఎన్నో మార్గాలను ప్రయత్నించవచ్చు. కానీ అది తప్పుడు మార్గమైతే చిక్కులు తప్పవు. ఎంతోమంది వినూత్న రీతిలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన ఒక ఘటన మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్దాం పదండి. టర్కీకి చెందిన ఒక ప్రేమికుడు రూ.25 లక్షలు విలువజేసే 33 ఐఫోన్లను దొంగిలించాడు. ఇదంతా తన ప్రేయసికి బహుమతి ఇచ్చేందుకే చేయడం గమనార్హం. పూర్తి కథేంటో తెలుసుకుందాం పదండి. ప్రేయసి కోసం 33 […]

The post 33 iPhones దొంగిలించి, గర్ల్‌ఫ్రెండ్‌కి కారు గిఫ్ట్ ఇచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 33 ఐఫోన్లు దొంగిలించిన డెలివరీ ఎగ్జిక్యూటివ్
  • ఐఫోన్లను అమ్మగా వచ్చిన డబ్బుతో కారు కొనుగోలు
  • టర్కీలో చోటు చేసుకున్న ఘటన

ప్రేమికులు తమ ప్రేమను చూపేందుకు ఎన్నో మార్గాలను ప్రయత్నించవచ్చు. కానీ అది తప్పుడు మార్గమైతే చిక్కులు తప్పవు. ఎంతోమంది వినూత్న రీతిలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన ఒక ఘటన మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్దాం పదండి. టర్కీకి చెందిన ఒక ప్రేమికుడు రూ.25 లక్షలు విలువజేసే 33 ఐఫోన్లను దొంగిలించాడు. ఇదంతా తన ప్రేయసికి బహుమతి ఇచ్చేందుకే చేయడం గమనార్హం. పూర్తి కథేంటో తెలుసుకుందాం పదండి.

ప్రేయసి కోసం 33 ఐఫోన్లను దొంగిలించిన వ్యక్తి

ఈ షాకింగ్ న్యూస్ టర్కీ నుంచి వచ్చింది. ప్రేమికుడు అజీమ్ ఒక కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక మాల్ లోని టెక్నాలజీ సెంటర్ కి ఆపిల్ ఐఫోన్లను డెలివరీ చేసే ఆర్డర్ అజీమ్ కి వచ్చింది. ఇక అంతే, ఇదే అదనుగా తన ప్లాన్ ని అమలు చేశాడు అజీమ్.

ఐఫోన్ డెలివరీ ఆర్డరును తీసుకున్న వెంటనే తన విధుల నుంచి బయటకు వచ్చేశాడు అజీమ్. అయితే ఐఫోన్స్ గల పార్సెల్ ని డెలివరీ చేయకుండా వాటిని దొంగిలించాడు. ఈ ఐఫోన్ల విలువ 30,000 డాలర్లు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీలో రూ.24,97,800 అని చెప్పవచ్చు.

దొంగిలించిన iPhones అమ్మి కారు కొనుగోలు

ఖరీదైన 33 ఐఫోన్లను దొంగిలించిన తర్వాత, అజీమ్ వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. చాలా తక్కువ సమయంలో ఎన్నో ఐఫోన్లను అమ్మేసి వచ్చిన డబ్బుతో ఒక కారు కొన్నాడు. ఆ కారుని అజీమ్ తన గర్ల్‌ఫ్రెండ్ కి బహుమతిగా ఇచ్చాడు. టర్కీలో ఐఫోన్ల ధర చాలా ఎక్కువ. భారతీయ కరెన్సీలో చూస్తే, అక్కడ iPhone 15 Pro Max ఫోన్ ధర దాదాపు రూ.2,70,000 గా ఉంటుంది.

కానీ, ఈ ప్రేమ జంట ఆనందం ఎంతోకాలం నిలవలేదు. తమకి చెందిన 33 ఐఫోన్లు మిస్ అయ్యాయని తెలుసుకున్న సదరు ఐఫోన్ స్టోర్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. డెలివరీ పర్సన్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ చూశాక, పోలీసులు అజీమ్ ఇంటిని సోదా చేసి దొంగిలించిన ఐఫోన్ల నుంచి 5 డివైజెస్ ని రికవరీ చేశారు. అలాగే ఐఫోన్లను అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్న కారుని కూడా రికవరీ చేశారు. అమ్ముడు కానీ 5 ఐఫోన్లతో పాటు కారుని పోలీసులు సీజ్ చేశారు.

Source: 91mobiles Hindi

The post 33 iPhones దొంగిలించి, గర్ల్‌ఫ్రెండ్‌కి కారు గిఫ్ట్ ఇచ్చిన డెలివరీ ఎగ్జిక్యూటివ్! first appeared on 91Mobiles Telugu.

]]>
ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/how-to-convert-image-to-pdf-android-ios-windows/ Thu, 12 Oct 2023 19:02:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8375 మీరు ఫోటోను PDF (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్)కి మార్చాలనుకుంటున్నారా? ఇది చాలా సులభం. మీరు ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మరియు మాక్ డివైజెస్ లో ఫోటోలను సులభంగా PDFకి మార్చవచ్చు. ఫోటోను PDFకి మార్చడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇమేజ్‌లో కాకుండా PDF ఫార్మాట్‌లో విషయాలను చదవడం సులభం. అంతేకాదు, PDF ఫైల్ యొక్క అసలు నాణ్యత అలాగే ఉంటుంది. ఫోటోను PDFకి ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోటోని పీడీఎఫ్ […]

The post ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

మీరు ఫోటోను PDF (పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్)కి మార్చాలనుకుంటున్నారా? ఇది చాలా సులభం. మీరు ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మరియు మాక్ డివైజెస్ లో ఫోటోలను సులభంగా PDFకి మార్చవచ్చు. ఫోటోను PDFకి మార్చడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఇమేజ్‌లో కాకుండా PDF ఫార్మాట్‌లో విషయాలను చదవడం సులభం. అంతేకాదు, PDF ఫైల్ యొక్క అసలు నాణ్యత అలాగే ఉంటుంది. ఫోటోను PDFకి ఎలా మార్చుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?

మీరు గనుక ఆండ్రాయిడ్ డివైజ్ లో జెపిజి లేదా పిఎన్‌జి ఫోటోని పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: ఆండ్రాయిడ్ డివైజ్ లో గ్యాలరీ యాప్ ఓపెన్ చేయండి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • స్టెప్ 3: దీని తర్వాత మీరు మూడు చుక్కల ఐకన్ పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 4: ఇప్పుడు మెనూ క్రింద మీకు ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • స్టెప్ 5: ఇప్పుడు మీకు సేవ్ యాజ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత మీకు డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: ఇప్పుడు మీరు ఫైల్ ని సేవ్ చేయడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి లొకేషన్ ఎంచుకోవాలి. ఫోటో నుంచి పీడీఎఫ్ కి కన్వర్ట్ కాబడిన ఫైల్ ని సేవ్ చేయడానికి మీకు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏదైనా ఒకదానిని ఎంచుకుని క్రింద కనిపించే సేవ్ బటన్ ని నొక్కండి.

ఐఫోన్ లో ఫోటోని పీడీఎఫ్ గా మార్చడం ఎలా?

ఆండ్రాయిడ్ డివైజెస్ లో మాదిరిగానే, ఐఫోన్ లో కూడా ఫోటోలను పీడీఎఫ్ గా మార్చడం తేలికే. అందుకోసం మీరు ఈ క్రింద కనిపిస్తున్న స్టెప్స్ ని ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: తొలుత మీరు ఐఫోన్ లో ఫోటోస్ యాప్ కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోనైతే పీడీఎఫ్ గా మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు షేర్ బటన్ పై క్లిక్ చేయండి. ట్యాప్ చేశాక, ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3: ఒక్కసారి మీరు ప్రింట్ పై క్లిక్ చేయగానే, ఫోటో పీడీఎఫ్ కి కన్వర్ట్ అయిపోతుంది.
  • స్టెప్ 4: ఇప్పుడు మీకు పైన కుడివైపున షేర్ బటన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ ఐఫోన్ లో సేవ్ టు ఫైల్స్ పై ట్యాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

విండోస్ లో JPG, GIF, PNG ఫోటోలను PDF కి కన్వర్ట్ చేయడం ఎలా?

విండోస్ ల్యాప్ టాప్ మరియు డెస్క్‌టాప్ లో మీరు జెపిజి, జిఐఎఫ్, పిఎన్‌జి ఫోటోలను జిఫ్ఫీలో పీడీఎఫ్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఆ విధానం ఎంతో తేలికే. క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • స్టెప్ 1: విండోస్ కంప్యూటర్ లో ఫోటోలను పీడీఎఫ్ గా మార్చాలనుకుంటే, మీరు తొలుత పీడీఎఫ్ గా మార్చాలనుకుంటోన్న ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి.
  • స్టెప్ 2: ఇప్పుడు మీరు ఆ ఫోటోని విండోస్ పిక్చర్స్ యాప్ లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు చుక్కల మెను టాప్ లో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: ఇక్కడ మీకు టాప్ లో ప్రింటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడీఎఫ్ పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: ఇప్పుడు మీరు బాటమ్ లో కనిపించే ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీని తర్వాత ఫోటో, పీడీఎఫ్ కి కన్వర్ట్ అవుతుంది. ఆ పీడీఎఫ్ ని సేవ్ చేసేందుకు లొకేషన్ ని ఎంచుకోండి. మీరు కావాలనుకుంటే, ఆ పీడీఎఫ్ ఫైల్ ని మీ డెస్క్‌టాప్ పై కూడా సేవ్ చేయవచ్చు.

Source: 91mobiles Hindi

The post ఫోటోని పీడీఎఫ్ (PDF) గా మార్చడం ఎలా? తేలికైన మార్గం తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఐఫోన్ చార్జర్ నుంచి షాక్ తగిలి బాలుడు మృతి; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/up-boy-dies-due-to-electric-shock-from-iphone-charger-while-removing-phone-from-charger/ Thu, 20 Apr 2023 11:42:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=5976 ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆపిల్ తన తొలి స్టోర్ ని భారత్ లో తెరిచింది. అయితే తాజాగా ఒక చెడు వార్త ఆపిల్ కి వెల్కమ్ చెప్పింది. ఓ బాలుడు చార్జింగ్ లో ఉన్న ఆపిల్ ఫోన్ ద్వారా షాక్ తగిలి మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో జరిగింది. బాలుడు పేరు సత్యం శర్మ అని అతడి వయసు 14 ఏళ్ళని తెలుస్తోంది. News18 కథనం ప్రకారం, సత్యం ఐఫోన్ […]

The post ఐఫోన్ చార్జర్ నుంచి షాక్ తగిలి బాలుడు మృతి; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు ఎలక్ట్రిక్ షాక్ తో 16 ఏళ్ళ బాలుడు మృతి
  • చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని వాడుతున్నప్పుడు జరిగిన ఘటన
  • సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ని ఘటనకు 2 రోజుల క్రితమే కొన్న బాలుడు

ఇటీవలె ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆపిల్ తన తొలి స్టోర్ ని భారత్ లో తెరిచింది. అయితే తాజాగా ఒక చెడు వార్త ఆపిల్ కి వెల్కమ్ చెప్పింది. ఓ బాలుడు చార్జింగ్ లో ఉన్న ఆపిల్ ఫోన్ ద్వారా షాక్ తగిలి మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో జరిగింది. బాలుడు పేరు సత్యం శర్మ అని అతడి వయసు 14 ఏళ్ళని తెలుస్తోంది. News18 కథనం ప్రకారం, సత్యం ఐఫోన్ చార్జింగ్ అవుతుండగా, అతనికి కాల్ వచ్చిందట. అతడు కాల్ రిసీవ్ చేసుకునేందుకు ఫోన్ ని తీసుకోగా వెంటనే షాక్ తగిలి క్రింద పడిపోయినట్లు సమాచారం.

ఫోన్ ని చార్జింగ్ కేబుల్ నుంచి తొలగించిన వెంటనే తగిలిన షాక్

రిపోర్ట్ ప్రకారం, సోమవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. సత్యం తన స్నేహితులతో ఆడుకుంటుండగా, తన ఫోన్ చార్జింగ్ లో ఉంది. కాల్ వచ్చిన క్రమంలో సత్యం ఫోన్ ని చార్జింగ్ నుంచి తొలగించాడు. ఇక అంతే, అతడికి భారీ షాక్ తగిలింది.

సత్యం స్నేహితుల ప్రకారం, ఫోన్ ని సత్యం చార్జింగ్ నుంచి తొలగించాడట. అతడు ధరించిన స్మార్ట్ వాచ్ లో కూడా రియాక్షన్ వచ్చిందని వారు తెలిపారు. షాక్ తగిలిన వెంటనే అతడు నేలపై పడిపోయినట్లు వారు తెలిపారు. ఆ వెనువెంటనే అతడి శరీరం నల్లబడి పోయిందని వారు అన్నారు.

రెండు రోజుల క్రితం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న బాలుడు

షాక్ తగిలిన వెంటనే సత్యం ని అతడి బంధువులు సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సత్యం ఇటీవలె 10 వ తరగతి పాస్ అయ్యాడు. అతడికి ఖరీదైన ఫోన్లంటే ఇష్టమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ కొనుక్కొమని డబ్బులు ఇచ్చారట. అతడు ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు మరణించడం చాలా బాధాకరం. ఇటువంటివి జరగొద్దని 91మొబైల్స్ తెలుగు కోరుకుంటోంది.

ఎవ్వరైనా సరే ఇకపై ఫోన్ చార్జింగ్ లో ఉన్నప్పుడు కాల్ వస్తే సాకెట్ ‘స్విచ్’ ఆఫ్ చేశాక, అప్పుడు కేబుల్ ని ఫోన్ నుంచి తొలగించండి. కాల్ రిసీవ్ చేసుకోవాలనే తొందరలో వెంటనే ఆన్సర్ చేసి మాట్లాడకండి. కాల్స్ ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. కానీ, ప్రాణం విలువైనది తిరిగి రాదు. దయచేసి ఆలోచించండి. ఎలక్ట్రానిక్ వస్తువులను హ్యాండిల్ చేసేప్పుడు జాగ్రత్త వహించండి. ఇటువంటి సందర్భాల్లో నిదానమే ప్రధానం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఐఫోన్ చార్జర్ నుంచి షాక్ తగిలి బాలుడు మృతి; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు https://www.91mobiles.com/telugu/apple-iphones-manufacturing-plant-hosur-bengaluru-tata-group/ Thu, 17 Nov 2022 09:02:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=3498 హైలైట్స్ కర్ణాటకలోని హోసూరుకి సమీపంలో రానున్న అతిపెద్ద Apple iPhones తయారీ కేంద్రం ఈ హబ్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించిన టెలీకామ్, ఐటీ మరియు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఐఫోన్స్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్న 6 వేల మంది గిరిజన మహిళలు బెంగళూరు హోసూరుకి సమీపంలో Apple iPhones యొక్క అతిపెద్ద తయారీ కేంద్రం రాబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని భారతీయ టెలీకామ్, ఐటీ […]

The post iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కర్ణాటకలోని హోసూరుకి సమీపంలో రానున్న అతిపెద్ద Apple iPhones తయారీ కేంద్రం
  • ఈ హబ్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని వెల్లడించిన టెలీకామ్, ఐటీ మరియు రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్
  • ఐఫోన్స్ తయారు చేసేందుకు శిక్షణ తీసుకున్న 6 వేల మంది గిరిజన మహిళలు

బెంగళూరు హోసూరుకి సమీపంలో Apple iPhones యొక్క అతిపెద్ద తయారీ కేంద్రం రాబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా 60,000 మందికి ఉపాధి లభించనుందని భారతీయ టెలీకామ్, ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ల తయారీపై ఇప్పటికే రాంచీ, హజారీభాగ్ లకు చెందిన 6,000 మందికి పైగా గిరిజన మహిళలు శిక్షణ పొందినట్లు మంత్రి తెలిపారు. వీరంతా త్వరలోనే విధుల్లో చేరతారని మంత్రి అన్నారు.

భారత్ కి కలిసొచ్చిన చైనా కొవిడ్ నిబంధనలు

భారత్ లో ఐఫోన్స్ తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఇటీవలె టాటా ఎలక్ట్రానిక్స్ పొందింది. దీంతో హోసూరులో ప్లాంట్ ని టాటా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయబోతోంది. ఇదివరకు ఫాక్స్‌కాన్, విస్ట్రన్, పెగట్రాన్ సంస్థలు భారత్ లో ఐఫోన్లను తయారు చేశాయి. ఫాక్స్‌కాన్ కి తమిళనాడులోని శ్రీపెరుంబుదుర్ లో ఫెసిలీటీ సెంటర్ ఉండగా, పెగట్రాన్ కి చెన్నైకి సమీపంలో ప్లాంట్ ఉంది. ఇక విస్ట్రన్ కి బెంగళూరులో అసెంబ్లీ ప్లాంట్స్ ఉన్నాయి.

టాటా గ్రూప్, తైవానీస్ ఆపిల్ సప్లయ్యర్ తో కలిసి ఐఫోన్స్ ని భారత్ లో అసెంబ్లింగ్ చేసేందుకు ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయబోతోంది. ఇది విజయవంతమైతే, ఐఫోన్లను తయారు చేయనున్న తొలి భారతీయ కంపెనీగా టాటా నిలుస్తుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆదిపత్యం చెలాయిస్తోన్న చైనాకు భారత్ గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది.

18 నుంచి 24 నెలల కాల వ్యవధిలో 45,000 మంది మహిళలను విధుల్లోకి తీసుకోవాలని టాటా ప్లాన్ చేస్తోందని బ్లూంబర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఐఫోన్స్ యొక్క మెకానిక్స్ మరియు కేసింగ్స్ ని ఉత్పత్తి చేస్తోన్న ఫ్యాక్టరీలో 10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

చైనాలోని జెంగ్‌జౌ లో Foxconn కి ఐఫోన్స్ తయారీ కోసం అతిపెద్ద ప్లాంట్ ఉంది. అయితే ఆ ప్రాంతంలో కఠినమైన కొవిడ్ నిబంధనల కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి నెమ్మదించింది. దీంతో iPhone 14 Pro, Pro Max ఫోన్ల పంపిణీలో జాప్యం నెలకొంది. ఫోన్లను బుక్ చేసుకున్న కస్టమర్లు రోజుల తరబడి షిప్పింగ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆపిల్ భారత్ మరియు ఇతర దేశాల్లో ఐఫోన్స్ తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది.

తాజా పరిణామాలతో తైవాన్ కి చెందిన Foxconn భారత్ లో తన వర్క్‌ఫోర్స్ ని 70,000 కి పెంచుకోవాలని నిర్ణయించింది. అంటే రానున్న రెండేళ్ళలో 53,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ప్రణాళిక వేసుకుంది. 2019 లో ఫాక్సాన్ ఆపరేషన్స్ ని మొదలుపెట్టింది. భారత్ లో తయారైన 85 శాతం ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అవుతుండగా, మిగతా 15 శాతం భారత్ లో అమ్ముడవుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post iPhones తయారు చేయనున్న గిరిజన మహిళలు first appeared on 91Mobiles Telugu.

]]>
షాకింగ్ న్యూస్: Apple iPhone అమ్మకాలపై నిషేధం https://www.91mobiles.com/telugu/no-charger-no-iphone-sales-brazil-decision/ Wed, 07 Sep 2022 08:03:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2156 హైలైట్స్: ఐఫోన్లపై నిషేధం విధించిన బ్రెజిల్ న్యాయ మంత్రిత్వశాఖ బాక్స్ లో చార్జర్ అందించకపోవడమే బ్యాన్ కి ప్రధాన కారణం ఆపిల్ కు 2.3 మిలియన్ డాలర్ల జరిమానా వేసిన బ్రెజిల్ ప్రభుత్వం ఆపిల్ నిర్వహించే ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ నేడు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. లాంచ్ పై ఇప్పటికే ఎంతో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రో వర్షన్ ఐఫోన్స్ డిజైన్ మేకోవర్ తో వస్తున్నాయి. ఈ కోలాహలం నడుమ […]

The post షాకింగ్ న్యూస్: Apple iPhone అమ్మకాలపై నిషేధం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్లపై నిషేధం విధించిన బ్రెజిల్ న్యాయ మంత్రిత్వశాఖ
  • బాక్స్ లో చార్జర్ అందించకపోవడమే బ్యాన్ కి ప్రధాన కారణం
  • ఆపిల్ కు 2.3 మిలియన్ డాలర్ల జరిమానా వేసిన బ్రెజిల్ ప్రభుత్వం

ఆపిల్ నిర్వహించే ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ నేడు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. లాంచ్ పై ఇప్పటికే ఎంతో బజ్ క్రియేట్ అయ్యింది. ప్రో వర్షన్ ఐఫోన్స్ డిజైన్ మేకోవర్ తో వస్తున్నాయి. ఈ కోలాహలం నడుమ ఆపిల్ కి షాక్ తగిలింది. బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ తమ దేశంలో ఐఫోన్స్ పై బ్యాన్ ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫోన్ తో చార్జర్ ని ప్రొవైడ్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే బ్రెజిల్ ప్రభుత్వం ఆపిల్ పై 2.3 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఆమేరకు బ్రెజిలియన్ ఫెడరల్ రిజిస్టర్ లో పేర్కొనబడింది.

2021 అక్టోబర్ లో, బ్రెజిల్ న్యాయశాఖ ఆపిల్, శాంసంగ్ లను ఉద్దేశించి, చార్జర్ తీసేయడానికి గల కారణాలేంటో తెలపాలని ఆదేశించింది. 2022 మే నెలలో ఆపిల్, శాంసంగ్ లపై అడ్మిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ని మొదలు పెట్టాలని బ్రెజిల్ కన్జూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేటర్ ని ప్రభుత్వం కోరింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆపిల్, ప్రభుత్వ నిర్ణయంపై అప్పీల్ కి వెళతామని తెలిపింది.

iPhone అమ్మకాలపై నిషేధం, స్పందించిన ఆపిల్

ఆపిల్ సంస్థ ఐఫోన్ తో పాటు బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్ ని అందించడం లేదని, అందుచేత ఐఫోన్స్ అమ్మకాలపై బ్రెజిల్ న్యాయశాఖ నిషేధం విధించింది. బ్రెజిలియన్ పత్రిక జీ1 లో ఆమేరకు కథనం ప్రచురితమైంది. “ఐఫోన్ 12 మోడల్ తదనంతరం చార్జింగ్ అడాప్టర్ లేకుండా వచ్చిన అన్ని ఐఫోన్లపై బ్యాన్ ని విధించడం జరిగింది. బీఆర్ఎల్ 12,274,500 జరిమానా వేయడం జరిగింది. చార్జర్ లేకుండా ఏ ఐఫోన్ కూడా అమ్మడానికి వీలు లేదు,” అని బ్రెజిల్ న్యాయశాఖ పేర్కొంది.

భూమి యొక్క కర్బన ఉద్గారాలను తగ్గించేందుకే తాము బాక్స్ నుంచి చార్జర్ ని తొలగించామని ఆపిల్ వాదిస్తోంది. అలాగే తమ వాదనను బలంగా నమ్ముతోంది. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అప్పీల్ చేయనున్నట్లు ఆపిల్ సంస్థ వెల్లడించింది.

“ఆపిల్ చేసే ప్రతి పని భూమిపై, జనాలపై ఎలా ప్రభావం చూపుతుందోనన్న విషయాన్ని కంపెనీ దృష్టిలో పెట్టుకుంటుంది. పవర్ అడాప్టర్లు భారీ మొత్తంలో జింక్, ప్లాస్టిక్ వినియోగానికి కారణమవుతాయి. బాక్స్ నుంచి వాటిని తొలగించడం వల్లన, 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఇది ప్రతి ఏడాది రోడ్లపై నుంచి 5 లక్షల కార్లను తొలగించడంతో సమానం. ఇప్పటికే ప్రపంచంలో బిలియన్ల కొలది యూఎస్బీ-ఏ చార్జర్లు వాడుకలో ఉన్నాయి. మేం ఇప్పటికే బ్రెజిల్ లో ఎన్నో కోర్టు కేసులు గెలిచాం. కస్టమర్లు తమ ఐఫోన్ల చార్జింగ్ కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తారని విశ్వసిస్తున్నాం. మేం ప్రభుత్వం తో మాట్లాడి వారి వాదనలను వింటాం. అలాగే నిర్ణయంపై అప్పీల్ కు వెళ్ళేందుకై ప్లాన్ చేస్తాం,” అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు, శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ల బాక్సుల్లో చార్జర్ లను జత చేసి బ్రెజిల్ లో అమ్మడం ప్రారంభించింది. అయితే, ఆపిల్ ఐఫోన్ బాక్సుల్లో చార్జర్ లు లేవు. ఇకపోతే ఆపిల్ సంస్థ 2030 కల్లా కార్బర్ న్యూట్రల్ గా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందుకోసమే బాక్సుల నుంచి చార్జర్ లను తొలగించడం మొదలు పెట్టింది. అయితే, ఆపిల్ పై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చార్జర్ తొలగింపు పై వివరణ కోరడమో లేదా కోర్టుకు లాగడమో చేశాయి.

The post షాకింగ్ న్యూస్: Apple iPhone అమ్మకాలపై నిషేధం first appeared on 91Mobiles Telugu.

]]>