iQOO 10 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 19 Jul 2022 18:17:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro https://www.91mobiles.com/telugu/iqoo-10-series-launched-in-china-specs-price-details/ Tue, 19 Jul 2022 18:17:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=1087 హైలైట్స్: చైనాలో లాంచ్ అయిన ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్న ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ ఐకూ 10 ప్రో RMB 3,699 (రూ.43,900) ప్రారంభ ధరతో మొదలు కానున్న ఐకూ 10 సిరీస్ ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ఐకూ 9 సిరీస్ కు సక్సెసర్స్ గా వచ్చాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 […]

The post లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో లాంచ్ అయిన ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్
  • 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్న ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్ ఐకూ 10 ప్రో
  • RMB 3,699 (రూ.43,900) ప్రారంభ ధరతో మొదలు కానున్న ఐకూ 10 సిరీస్

ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ఐకూ 9 సిరీస్ కు సక్సెసర్స్ గా వచ్చాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లను ఈ సిరీస్ లో జతచేసింది ఐకూ. ఇక ఐకూ 10 ప్రో ప్రపంచపు తొలి 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇది 12 నిమిషాల్లో 4700ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.

iQOO 10, iQOO 10 Pro ధరలు, లభ్యత

ఐకూ 10 8జిబి/128జిబి మోడల్ ధర RMB 3,699 (దాదాపు రూ.43,900). 8జిబి/256జిబి మోడల్ ధర రూ. RMB 3999 (దాదాపు రూ.47,400), 12జిబి/256జిబి వర్షన్ ధర RMB 4299 (దాదాపు రూ.51,000), 12జిబి/512జిబి ధర RMB 4699 (దాదాపు రూ.55,700). కాగా, ఈ ఫోన్ ఆరెంజ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇక ఐకూ 10 ప్రో 8జిబి+256జిబి మోడల్ ధర RMB 4,999, 12జిబి+256జిబి వర్షన్ ధర RMB 5499, 12జిబి+512జిబి వేరియంట్ ధర RMB 5,999. ఈ ఫోన్ నలుపు, తెలుపు రంగు ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO 10 స్పెసిఫికేషన్స్

6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఈ5 అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, స్లిమ్ బెజెల్స్, 2400*1080 రెజుల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఐకూ 10 లో 50 ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది శాంసంగ్ తయారు చేసిన జీఎన్5 సెన్సర్. అలాగే 13ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12ఎంపి ఐఎంఎక్స్663 పోట్రెయిట్ సెన్సర్, 16ఎంపి సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఐకూ 10 లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి.

5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎష్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

iQOO 10 Pro స్పెసిఫికేషన్స్

ఐకూ 10 ప్రో లో 6.78 అంగుళాల 2కే ఈ5 అమోలెడ్ ఎల్టీపీవో 3.0 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3200*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, కర్వ్డ్ ఎడ్జెస్, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషియన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఐకూ 10 ప్రో లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ (150 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 14.6 3ఎక్స్ పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ఇక ఇమేజింగ్ కొరకు ఇందులో వీ1+ చిప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

ఐకూ 10 ప్రో ఫోన్లో 4700ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 12 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇకపోతే ఈ ఫోన్లో భద్రత కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అమర్చారు. స్టీరియో స్పీకర్లు, హైఫై ఆడియో, టైప్ సీ ఆడియో కనెక్టివిటీ, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post లాంచ్ అయిన iQOO 10, iQOO 10 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-10-pro-200w-fast-charging-confirmed-by-company/ Mon, 11 Jul 2022 10:51:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=881 హైలైట్స్: * జులై 19న చైనాలో ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి * iQOO 10 Pro ఫోన్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ * ఐకూ 10 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 కూడా ఉండనుంది. ఇది 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది. ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్దమవుతోంది. […]

The post ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* జులై 19న చైనాలో ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి

* iQOO 10 Pro ఫోన్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ

* ఐకూ 10 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 కూడా ఉండనుంది. ఇది 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది.

ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్దమవుతోంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 మరియు ఐకూ 10 ప్రో కూడా ఉంటాయి. చైనాలో ఈ ఫోన్లు 2022, జులై 19 న లాంచ్ అవుతాయి. ఇక లాంచ్ కు ముందు ఐకూ 10 ప్రో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. ఇప్పటి హయ్యస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఇదే అవ్వనుంది. ఇదిలా ఉంటే, ఐకూ 10 మాత్రం కేవలం 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

iQOO 10 Pro 200W ఫాస్ట్ ఛార్జింగ్ తో రావడం కన్ఫర్మ్

పైన చూస్తున్న ప్రమోషనల్ పోస్టర్ ప్రకారం, ఐకూ 10 ప్రో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో ఐకూ 10 ప్రో మాత్రమే ఇంతటి భారీ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉండి, అగ్రస్థానంలో నిలిచింది. మరి సున్నా నుంచి వంద శాతం ఛార్జింగ్ పూర్తి చేసేందుకు ఈ కొత్త 200W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.

అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, 200 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో ఐకూ 10 ప్రో ని ఛార్జ్ చేస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఈ డివైజ్ 63 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 నిమిషాలు సమయం తీసుకుంది. మరి 63 శాతం నుంచి 100 శాతం చేరుకునేందుకు ఎంత టైం పడుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

iQOO 10 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఐకూ 10 ప్రో 6.78 అంగుళాల 2కే+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5/ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12, ఒరిజిన్ ఓఎస్ స్కిన్ వంటి ఫీచర్లతో వస్తోంది.

ఇక కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే, ఐకూ 10 ప్రో లో 50ఎంపి ప్రధాన కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 14.6ఎంపి టెలీఫోటో కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఐకూ 10 ప్రో 4,550ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>