iQOO 11 Legend - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 16 Nov 2022 10:32:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రివీల్ అయిన iQOO 11 Legend ర్యామ్, స్టోరేజీ https://www.91mobiles.com/telugu/iqoo-11-legend-ram-storage-launch-revealed/ Wed, 16 Nov 2022 10:31:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3472 హైలైట్స్ ప్రీమియమ్ మోడల్ గా వస్తోన్న iQOO 11 Legend 16 జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్న iQOO 11 Legend త్వరలోనే ఏషియా మార్కెట్స్ లో లాంచ్ కానున్న iQOO 11 Legend స్టాండర్డ్ వేరియంట్ iQOO 11 తో పాటు iQOO 11 Legend కూడా లాంచ్ కానుందని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ఈ విషయాన్ని వెల్లడించాడు. అలాగే iQOO 11 Legend యొక్క […]

The post రివీల్ అయిన iQOO 11 Legend ర్యామ్, స్టోరేజీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రీమియమ్ మోడల్ గా వస్తోన్న iQOO 11 Legend
  • 16 జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానున్న iQOO 11 Legend
  • త్వరలోనే ఏషియా మార్కెట్స్ లో లాంచ్ కానున్న iQOO 11 Legend

స్టాండర్డ్ వేరియంట్ iQOO 11 తో పాటు iQOO 11 Legend కూడా లాంచ్ కానుందని 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ సమాచారం అందింది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ఈ విషయాన్ని వెల్లడించాడు. అలాగే iQOO 11 Legend యొక్క ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలు కూడా తెలిశాయి. iQOO 11 Legend 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో వస్తోంది. అయితే మిగతా ర్యామ్ వేరియంట్స్ అందుబాటులో ఉంటాయా లేదా అనేది తెలియదు. మరోవైపు లాంచ్ టైమ్ లైన్ ఎప్పుడో ఇంకా కచ్చితంగా తెలియదు. త్వరలోనే ఈ ఫోన్ ఏషియా మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

పేరుకి తగినట్లుగానే iQOO 11 Legend లైనప్ లో టాప్-ఎండ్ వర్షన్ అని తెలుస్తోంది. భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా ఇతర వివరాలు ఇప్పటికి తెలియలేదు.

త్వరలో లాంచ్ కానున్న iQOO 11 Legend

iQOO 11 సిరీస్ 2023 జనవరిలో భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ లో iQOO 11 Legend కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న ఐకూ 9 సిరీస్ కి సక్సెసర్ గా ఈ హ్యాండ్సెట్ రానుంది. రానున్న రోజుల్లో iQOO 11 Legend కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

iQOO 11 స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్టాండర్డ్ వేరియంట్ అయిన iQOO 11 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 144 హెర్ట్జ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడనున్నారు. కెమెరా విభాగం చూస్తే, ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి. iQOO 11 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తోంది. ఈ ఫోన్ వీ2 ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ ని కలిగి ఉండనుంది. ఈ డివైజ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది.

iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 Pro లో 50 ఎంపి + 50ఎంపి + 48ఎంపి + 64ఎంపి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రివీల్ అయిన iQOO 11 Legend ర్యామ్, స్టోరేజీ first appeared on 91Mobiles Telugu.

]]>