iQOO 13 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 12 May 2024 17:50:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-13-battery-and-charging-specs-leaked/ Sun, 12 May 2024 17:50:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11487 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ […]

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2024 ఆఖర్లో లాంచ్ కానున్న iQOO 13
  • లైనప్‌లో రానున్న iQOO 13, 13 Pro
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో 13-సిరీస్ లాంచ్ కానుంది. గతేడాది వచ్చిన iQOO 12 సిరీస్‌కి ఇది సక్సెసర్ గా రానుంది. ఈ ఏడాది ఆఖర్లో ఐకూ 13 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. తాజాగా iQOO 13 యొక్క బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 బ్యాటరీ మరియు చార్జింగ్ వివరాలు (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై iQOO 13 యొక్ చార్జింగ్ మరియు బ్యాటరీ వివరాలు షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO 13 డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే గత మోడల్ iQOO 12 లో ఇచ్చిన 5000 ఎంఏహెచ్ కంటే ఇది ఎక్కువ.

iQOO 13 యొక్క చార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపారు.

iQOO 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO 13 బేస్ మోడల్ 1.5కే రెజుల్యూషన్ గల ఫ్లాట్ డిస్ప్లేతో రానుంది. మరోవైపు, iQOO 13 Pro 2కే రెజుల్యూషన్ గల కర్వ్డ్ డిస్ప్లేతో వస్తోంది.

లీకైన సమాచారం ప్రకారం, iQOO బ్రాండ్ తన కొత్త ఫోన్లకు డిస్ప్లేలను శాంసంగ్ మరియు బీఓఈ కంపెనీల నుంచి కొనే అవకాశం ఉంది.

iQOO 13 లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ వాడనున్నారు. క్వాల్కమ్ ఈ ప్రాసెసర్‌ని 2024 అక్టోబర్ నెలలో లాంచ్ చేయనుంది.

iQOO 13 మరియు iQOO 13 Pro ఫోన్లలో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయని సమాచారం.

iQOO 13 మరియు iQOO 13 ప్రో ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది.

iQOO 12 స్పెసిఫికేషన్స్

iQOO 12 డివైజ్ లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

iQOO 12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ వాడారు.

iQOO 12 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.

iQOO 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి ఒవి64బి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iQOO 13: లీకైన ఐకూ 13 బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>