iQOO Z7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:55:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Google Ad ద్వారా రివీల్ అయిన iQOO Z7 ఇండియా లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/iqoo-z7-india-launch-date-google-ad-confirmation/ Mon, 06 Mar 2023 14:37:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=5234 మార్చి 21 న iQOO Z7 భారత్ లో లాంచ్ కానుందని ఆన్‌లైన్ లో షేర్ అయిన ఒక స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. గూగుల్ స్క్రీన్ షాట్ ద్వారా అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ కానుందని తెలిసింది. గత కొన్ని రోజులుగా iQOO Z7 డివైజ్ చార్జింగ్ స్పీడ్, మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి తాజాగా లీకైన సమాచారం […]

The post Google Ad ద్వారా రివీల్ అయిన iQOO Z7 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గూగుల్ యాడ్ ద్వారా రివీల్ అయిన iQOO Z7 లాంచ్ తేదీ, మార్చి 21 న లాంచ్ అవుతోన్న iQOO Z7
  • యాడ్ ప్రకారం వివిధ బ్యాంక్ ఆఫర్లతో లాంచ్ కానున్న iQOO Z7 స్మార్ట్ ఫోన్
  • యాడ్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్ Oneily Gadget

మార్చి 21 న iQOO Z7 భారత్ లో లాంచ్ కానుందని ఆన్‌లైన్ లో షేర్ అయిన ఒక స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. గూగుల్ స్క్రీన్ షాట్ ద్వారా అందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ కానుందని తెలిసింది. గత కొన్ని రోజులుగా iQOO Z7 డివైజ్ చార్జింగ్ స్పీడ్, మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి తాజాగా లీకైన సమాచారం ఏంటో తెలుసుకుందాం.

మార్చి 21 న లాంచ్ కానున్న iQOO Z7

తాజాగా సమాచారం మనకు ప్రముఖ టిప్‌స్టర్ Oneily Gadget నుంచి వచ్చింది. టిప్‌స్టర్ iQOO Z7 యొక్క గూగుల్ యాడ్ స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో లాంచ్ తేదీ వివరాలు బయటకు వచ్చాయి. iQOO Z7 డివైజ్ స్లే, స్ట్రీమ్, షూట్, రిపీట్ అనే ట్యాగ్‌లైన్ తో వచ్చింది. ట్యాగ్ లైన్ తో పాటు లాంచ్ తేదీ మార్చి 21, 2023 అని ఉంది. ఆకర్షణీయమైన ఆఫర్, బ్యాంక్ క్యాష్ బ్యాక్ తో iQOO Z7 స్మార్ట్ ఫోన్ రానుందని యాడ్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం iQOO సీఈవో నిపున్ మార్యా AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ని షేర్ చేశారు. iQOO Z7 స్కోర్ 4.8 లక్షలుగా ఉంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ కలిగిన అన్ని ఫోన్స్ కూడా ఈ రేంజ్ లోనే స్కోర్ కలిగి ఉన్నాయి. మార్యా ట్వీట్ ని ఆధారంగా చేసుకుని, iQOO Z7 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో రానుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

iQOO Z7 డివైజ్ ఆమధ్య 3C సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు అర్థమవుతోంది. కాస్త చవకైన iQOO Z7x ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐకూ జెడ్ 7 లైనప్ లో ఎన్ని డివైజెస్ లాంచ్ కానున్నాయో అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.

గత నెలలో iQOO Z7 లాంచ్ ని iQOO సంస్థ టీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి రూమర్ రాయుళ్ళు ఈ లైనప్ కి సంబంధించిన సమాచారాన్ని వెలికి తీయడంలో బిజీగా మారిపోయారు. త్వరలోనే ఐకూ సంస్థ నుంచి iQOO Z7 కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Google Ad ద్వారా రివీల్ అయిన iQOO Z7 ఇండియా లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7; టీజ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-z7-teased-by-company-india-launch-imminent/ Fri, 24 Feb 2023 14:23:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=5094 2023 ఆరంభం నుంచి iQOO సంస్థ మాంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు ఐకూ నుంచి iQOO 11, iQOO Neo 7 ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ మరొక ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న iQOO Z7 సిరీస్ ని ఐకూ సంస్థ సోషల్ మీడియాలో టీజ్ చేసింది. ఐకూ ఇండియా సీఈవో, నిపుణ్ మార్య […]

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7; టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో iQOO Z7 లాంచ్ కానుందని స్పష్టం చేసిన iQOO సంస్థ
  • Z7 లైనప్ లో ఫోన్ ని టీజ్ చేసిన ఐకూ ఇండియా సీఈవో నిపున్ మార్య
  • iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Z7 సిరీస్, లైనప్ లో లాంచ్ కానున్న స్టాండర్డ్ మరియు ప్రో వేరియంట్స్

2023 ఆరంభం నుంచి iQOO సంస్థ మాంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు ఐకూ నుంచి iQOO 11, iQOO Neo 7 ఫోన్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ మరొక ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. iQOO Z6 సిరీస్ కి సక్సెసర్ గా రానున్న iQOO Z7 సిరీస్ ని ఐకూ సంస్థ సోషల్ మీడియాలో టీజ్ చేసింది.

ఐకూ ఇండియా సీఈవో, నిపుణ్ మార్య iQOO Z7 సిరీస్ లాంచ్ ని ట్విట్టర్ ద్వారా టీజ్ చేశారు. మార్చి నెలలో iQOO Z7 సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. నిపుణ్ షేర్ చేసిన ఇమేజ్ ద్వారా ఫోన్ డిజైన్ ఎలా ఉండనుందో తెలుస్తోంది. iQOO Z7 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం పదండి.

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO Z7 సిరీస్

iQOO Z7 సిరీస్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, iQOO Z7 పూర్తి సిరీస్ ని లాంచ్ చేస్తుందా? లేదా ఒకే డివైజ్ ని లాంచ్ చేస్తుందా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఐకూ ఇండియా సీఈవో నిపుణ్ మార్య iQOO Z7 డివైజ్ డిజైన్ ని రివీల్ చేశారు. ఇమేజ్ లో డివైజ్ ని చూస్తుంటే, ఫోన్ డిజైన్ Vivo T1x ని పోలి ఉన్నట్లు అనిపిస్తోంది. Vivo T1x గతేడాది భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ వర్టికల్ కెమెరా మాడ్యూల్ ని బ్యాక్ ప్యానెల్ పై కలిగి ఉంటుంది. ఫ్లాష్ తో పాటు ఫోటోగ్రఫీ హై డెఫినిషన్ అని టెక్ట్స్ రాసి ఉంది. అలాగే పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బాటమ్ లో ఐకూ బ్రాండింగ్ కనిపిస్తోంది.

iQOO Z7 కి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియలేదు. Z సిరీస్ ఎక్స్‌క్లూజివ్ గా అమెజాన్ లో విక్రయించబడుతున్న కారణంగా, త్వరలో రాబోవు iQOO Z7 సిరీస్ కూడా అమెజాన్ ద్వారానే అమ్మకాలు జరుపుకోనుందని భావించవచ్చు.

iQOO Z7 సిరీస్ లో iQOO Z7 5G, iQOO Z7 Pro 5G డివైజెస్ లాంచ్ కానున్నాయని గత నివేదికలు స్పష్టం చేసాయి. iQOO Z7 5G ఫోన్ I2207 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రో మోడల్ విషయానికి వస్తే, అది I2213 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ప్రస్తుతానికి iQOO Z7 సిరీస్ కి సంబంధించి తెలిసిన వివరాలు ఇంతే. త్వరలోనే ఐకూ కంపెనీ నుంచి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7; టీజ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>