iQOO Z7i 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 Mar 2023 15:00:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Dimensity 6020 చిప్సెట్‌తో లాంచైన iQOO Z7i, పూర్తి వివరాలివిగో! https://www.91mobiles.com/telugu/iqoo-z7i-launched-china-price-specs-availability/ Mon, 13 Mar 2023 15:00:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=5496 iQOO Z7i స్మార్ట్ ఫోన్ చైనాలో అఫీషియల్ గా లాంచైంది. జెడ్7 సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే. iQOO Z7i డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లను ఉద్దేశించి తీసుకొచ్చిన చిప్సెట్ ఇది. iQOO Z7i ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూనిక్ డైమండ్-కట్ డిజైన్ ని కలిగి ఉంది. iQOO Z7i లో 6.51-ఇంచ్ […]

The post Dimensity 6020 చిప్సెట్‌తో లాంచైన iQOO Z7i, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనా మార్కెట్ లో లాంచైన iQOO Z7i స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో వచ్చిన iQOO Z7i
  • iQOO Z7i ప్రారంభ ధర ఆర్ఎంబి 949 (సుమారు రూ.11,300)

iQOO Z7i స్మార్ట్ ఫోన్ చైనాలో అఫీషియల్ గా లాంచైంది. జెడ్7 సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ ఇదే. iQOO Z7i డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లను ఉద్దేశించి తీసుకొచ్చిన చిప్సెట్ ఇది. iQOO Z7i ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూనిక్ డైమండ్-కట్ డిజైన్ ని కలిగి ఉంది.

iQOO Z7i లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 128జిబి స్టోరేజీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

iQOO Z7i ధర

iQOO Z7i డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను ఆర్ఎంబి 949 (సుమారు రూ.11,300) గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి వేరియంట్ ధర ఆర్ఎంబి 999 (సుమారు రూ.13,100) గా ఉంది. మూన్ షాడో బ్లాక్, ఐస్ లేక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 20 నుంచి చైనాలో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

iQOO Z7i స్పెసిఫికేషన్స్

  • 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 13ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్
  • 5ఎంపి సెల్ఫీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్

iQOO Z7i స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 88.9 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, మాలి-జీ57 జీపీయూ, 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఓషన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. గ్లోబల్ గా ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇంకా గ్లోబల్ లాంచ్ వివరాలు తెలియాల్సి ఉంది.

iQOO Z7i డివైజ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Dimensity 6020 చిప్సెట్‌తో లాంచైన iQOO Z7i, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>