iQOO Z9s Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Aug 2024 19:03:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Z9s, Z9s Pro 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-5g-india-launch-date-confirmed/#respond Fri, 02 Aug 2024 18:27:32 +0000 https://www.91mobiles.com/telugu/?p=12818 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో జెడ్9ఎస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా iQOO Z9s, Z9s Pro 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ సిరీస్ ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతాయని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. iQOO Z9s సిరీస్ […]

The post iQOO Z9s, Z9s Pro 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9s, Z9s Pro 5G లాంచ్ తేదీ కన్ఫర్మ్
  • ఆగస్టు 21న భారత్ లో లాంచ్
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో జెడ్9ఎస్ సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా iQOO Z9s, Z9s Pro 5G అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. భారత్ లో ఈ సిరీస్ ఆగస్టు 21వ తేదీన లాంచ్ అవుతాయని ఐకూ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

iQOO Z9s సిరీస్ లాంచ్ తేదీ

ఐకూ ఇండియా తాజాగా iQOO Z9s సిరీస్ భారత మార్కెట్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు 21న ఈ సిరీస్ విడుదలవ్వనుందని కంపెనీ వెల్లడించింది. ఈ లైనప్ లో ఐకూ జెడ్9ఎస్ మరియు ఐకూ జెడ్9ఎస్ ప్రో అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. లాంచ్‌ని ఐకూ యొక్క అధికార వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ పై చూడవచ్చు.

iQOO Z9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9s Pro లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.

మెమొరీ: iQOO Z9s Pro డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుందని సమాచారం.

కెమెరా: iQOO Z9s Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ600 ఓఐఎస్ మెయిన్ కెమెరాతో పాటు రెండు ఇతర సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: iQOO Z9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉంటాయి.

The post iQOO Z9s, Z9s Pro 5G లాంచ్ తేదీ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-z9s-pro-5g-india-launch-date-confirmed/feed/ 0
iQOO Z9s Series: ఆగస్టు 4న రివీల్ అవుతోన్న ఐకూ జెడ్9ఎస్ సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-to-unveil-on-august-4-india/ https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-to-unveil-on-august-4-india/#respond Fri, 26 Jul 2024 11:43:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=12700 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో జీ9ఎస్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s Pro మరియు iQOO Z9s అనే రెండు మొబైల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఐకూ సంస్థ iQOO Z9s సిరీస్ కు సంబంధించి అధికార ప్రకటన చేసింది. ఆగస్టు 4వ తేదీన భారత్ లో iQOO Z9s సిరీస్ ను ప్రదర్శిస్తామని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. iQOO Z9s సిరీస్ […]

The post iQOO Z9s Series: ఆగస్టు 4న రివీల్ అవుతోన్న ఐకూ జెడ్9ఎస్ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9s సిరీస్ లాంచ్
  • బెంగళూరు, కోయంబత్తూరుల్లో స్నీక్ పీక్ సెషన్
  • రిజిస్టర్ చేసుకోమంటూ తెలిపిన ఐకూ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో భారతీయ మార్కెట్ లో జీ9ఎస్ సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Z9s Pro మరియు iQOO Z9s అనే రెండు మొబైల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఐకూ సంస్థ iQOO Z9s సిరీస్ కు సంబంధించి అధికార ప్రకటన చేసింది. ఆగస్టు 4వ తేదీన భారత్ లో iQOO Z9s సిరీస్ ను ప్రదర్శిస్తామని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Z9s సిరీస్ స్నీక్ పీక్ సెషన్

iQOO Z9s సిరీస్‌ను ఆగస్టు 4వ తేదీన ఐకూ సంస్థ ప్రదర్శించనుంది. ఈ సందర్భంగా బెంగళూరు మరియు కోయంబత్తూరు నగరాల్లో ‘స్నీక్ పీక్’ సెషన్ నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదే రోజున ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ వెల్లడవ్వనున్నాయి. తర్వాత ధర వివరాలు తెలుస్తాయి. ఐకూ కమ్యూనిటీతో అసోసియేట్ అయిన వారంతా ఈవెంట్ లో పాల్గొనవచ్చు. ఈ సిరీస్ లో భాగంగా iQOO Z9s 5G, iQOO Z9s Pro 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి.

iQOO Z9s సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9s Pro లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, పంచ్-హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9s Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ సిరీస్ చిప్ ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.

సాఫ్ట్‌వేర్: iQOO Z9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: iQOO Z9s Pro మోడల్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అవుతుంది.

కెమెరా: iQOO Z9s Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు వైడ్ యాంగిల్ లెన్స్ మరియు మ్యాక్రో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ: iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్ లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post iQOO Z9s Series: ఆగస్టు 4న రివీల్ అవుతోన్న ఐకూ జెడ్9ఎస్ సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9s-5g-series-to-unveil-on-august-4-india/feed/ 0