iQOO Z9x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 16 Apr 2024 14:27:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-z9x-z9-turbo-full-specs-leaked/ Tue, 16 Apr 2024 14:27:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11124 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. iQOO Z9 […]

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో ఐకూ జెడ్9 సిరీస్ లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ చిప్సెట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9x లో 6.72-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి. iQOO Z9, Z9 Turbo ఫోన్లలో 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.

కెమెరా: iQOO Z9, Z9x ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. Z9 Turbo లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. Z9 మరియు Z9 Turbo డివైజెస్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Z9x లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్: iQOO Z9x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, Z9 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. Z9 Turbo లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x, Z9 ఫోన్లలో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి. Z9 Turbo లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: iQOO Z9 సిరీస్ లోని మూడు ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. iQOO Z9, Z9 Turbo 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి. మరోవైపు, iQOO Z9x 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: ఐకూ జీ9 సిరీస్ లోని మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ https://www.91mobiles.com/telugu/vivo-t3x-iqoo-z9x-listed-on-bis-bluetooth-sig/ Sat, 06 Apr 2024 06:05:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=10960 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి రానున్న కొన్ని వారాల్లో T3x అనే ఫోన్ లాంచ్ కానుంది. ఈలోపు వివో టీ3ఎక్స్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తో పాటు బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు iQOO నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. iQOO Z9x పేరుతో వస్తోన్న ఈ డివైజ్ కూడా బీఐఎస్, బ్లూటూత్ […]

The post Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo T3x మోడల్ నంబర్ V2338
  • iQOO Z9x 5G మోడల్ నంబర్ I2219
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి రానున్న కొన్ని వారాల్లో T3x అనే ఫోన్ లాంచ్ కానుంది. ఈలోపు వివో టీ3ఎక్స్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తో పాటు బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు iQOO నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. iQOO Z9x పేరుతో వస్తోన్న ఈ డివైజ్ కూడా బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఐకూ జీ9ఎక్స్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ రెండు ఫోన్ల సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo T3x, iQOO Z9x బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్

వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై V2338 అనే నంబర్ తో లిస్ట్ కాగా, ఐకూ జెడ్9ఎక్స్ 5జీ ఫోన్ I2219 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై బ్లూటూత్ 5.1 సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

డివైజెస్ పేర్లు, మోడల్ నంబర్లు తప్పా మరే ఇతర వివరాలు లిస్టింగ్ ద్వారా వెల్లడికాలేదు. అయితే త్వరలో భారత్ లో ఈ ఫోన్లు లాంచ్ అవుతాయని అర్థమవుతోంది.

iQOO Z9x గీక్‌బెంచ్ వివరాలు

iQOO Z9x స్మార్ట్‌ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై I2219 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఐకూ జెడ్9ఎక్స్ డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3271 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 10259 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా లిస్టింగ్ పై iQOO Z9x డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, అడ్రెనో 710 జీపీయూతో కనిపించింది.

iQOO Z9x ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo T3x లాంచ్ తేదీ, ధర శ్రేణి (లీక్)

రిపోర్ట్ ప్రకారం, వివో టీ3ఎక్స్ డివైజ్ భారత్ లో ఏప్రిల్ 3వ వారంలో లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే ఇంకా కచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. ఏప్రిల్ 19న లేదా 22న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

వివో టీ3ఎక్స్ స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.12,000 నుంచి రూ.15,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టీజర్స్ కూడా విడుదలవ్వవచ్చు.

The post Vivo T3x, iQOO Z9x త్వరలో లాంచ్ అయ్యే అవకాశం, బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్‌పై లిస్టైన డివైజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>