Itel it5330 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 19 Dec 2023 17:23:44 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 1900mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Itel it5330 ఫీచర్ ఫోన్ https://www.91mobiles.com/telugu/itel-it5330-feature-phone-launched-india-price-specs-availability/ Tue, 19 Dec 2023 17:23:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=9371 తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లను లాంచ్ చేస్తూ భారతీయ మార్కెట్ లో Itel సంస్థ తనకంటూ ఓ పేరుని సంపాదించుకుంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో Itel it5330 అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1500 లోపే ఉండటం విశేషం. అంతేకాదు, ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్ బాడీ డిజైన్, 2.8-ఇంచ్ డిస్ప్లే, 1900ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Itel it5330 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర […]

The post 1900mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Itel it5330 ఫీచర్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Itel it5330
  • గ్లాస్ ఫినిష్ డిజైన్‌తో వచ్చిన డివైజ్
  • Itel it5330 ధర రూ.1,499

తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లను లాంచ్ చేస్తూ భారతీయ మార్కెట్ లో Itel సంస్థ తనకంటూ ఓ పేరుని సంపాదించుకుంది. తాజాగా ఈ సంస్థ భారత్ లో Itel it5330 అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. దీని ధర రూ.1500 లోపే ఉండటం విశేషం. అంతేకాదు, ఈ ఫోన్ గ్లాస్ ఫినిష్ బాడీ డిజైన్, 2.8-ఇంచ్ డిస్ప్లే, 1900ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. సరే, ఓసారి Itel it5330 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Itel it5330 ధర, లభ్యత

  • Itel it5330 ఫీచర్ ఫోన్ రూ.1,499 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.
  • Itel it5330 డివైజ్ బ్లూ, లైట్ గ్రీన్, లైట్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Itel it5330 ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్ తో పాటు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Itel it5330 స్పెసిఫికేషన్స్

  • Itel it5330 లో గ్లాస్ ఫినిష్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫోన్ 11.11మి.మీ అల్ట్రా స్లిమ్ బాడీతో వచ్చింది.
  • Itel it5330 ఫీచర్ ఫోన్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే ఉంది.
  • Itel it5330 లో పవర్ బ్యాకప్ కోసం 1900 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 12 రోజుల బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
  • Itel it5330 డివైజ్ ఎన్నో భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, తమిళం, పంజాబి, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషలు ఉన్నాయి.
  • Itel it5330 లో వినోదం కోసం వైర్లెస్ ఎఫ్ఎమ్ ఫెసిలిటీ అందించారు.
  • Itel it5330 డివైజ్ లో ఆటో కాల్ రికార్డింగ్, కింగ్ వాయిస్ ఫీచర్ అందించారు.
  • Itel it5330 లో డ్యూయల్ సిమ్ స్లాట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
  • Itel it5330 లో మెమొరీని 32జిబి వరకు పెంచుకోవచ్చు.
  • Itel it5330 డివైజ్ 2జీ సపోర్ట్ ని మాత్రమే కలిగి ఉంది. అంటే మీరు ఈ ఫోన్ లో జియో 4జీ సిమ్ లేదా తదితర 4జీ సిమ్స్ ఉపయోగించలేరు.

The post 1900mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Itel it5330 ఫీచర్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>