iTel P40 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 16 Mar 2023 12:06:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ తో లాంచైన iTel P40 https://www.91mobiles.com/telugu/itel-p40-launched-india-price-specs-availability/ Thu, 16 Mar 2023 12:06:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5539 నేడు భారతీయ మార్కెట్ లో టెక్ బ్రాండ్ ఐటెల్ చవకైన ఫోన్ iTel P40 ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫోన్ 6,000 ఎంఏహెచ్ పవర్ఫుల్ బ్యాటరీతో వచ్చింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 57 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. సరే, ఓసారి iTel P40 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. iTel P40 ధర iTel P40 డివైజ్ […]

The post 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ తో లాంచైన iTel P40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత మార్కెట్ లో లాంచైన iTel P40 స్మార్ట్ ఫోన్
  • సింగిల్ చార్జ్ పై 57 రోజుల స్టాండ్ బై బ్యాటరీ లైఫ్ ని ఇవ్వనున్న ఫోన్
  • ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పై పని చేయనున్న iTel P40 డివైజ్

నేడు భారతీయ మార్కెట్ లో టెక్ బ్రాండ్ ఐటెల్ చవకైన ఫోన్ iTel P40 ని లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫోన్ 6,000 ఎంఏహెచ్ పవర్ఫుల్ బ్యాటరీతో వచ్చింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 57 రోజుల స్టాండ్ బై టైమ్ ని అందిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. సరే, ఓసారి iTel P40 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

iTel P40 ధర

iTel P40 డివైజ్ సింగిల్ వేరియంట్ లో లాంచైంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.7699 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చింది. దీంతో ర్యామ్ ని 3జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే యూజర్ కి మొత్తం 7జిబి ర్యామ్ సొంతం అవుతుంది. iTel P40 డివైజ్ ఫోర్స్ బ్లాక్, డ్రీమీ బ్లూ మరియు లగ్జరియస్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iTel P40 స్పెసిఫికేషన్స్

iTel P40 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో ఈ ఫోన్ వచ్చింది. మూడు వైపుల సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉంది.

iTel P40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో యూనిసాక్ ఎస్‌సీ9863ఏ ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో రావడం వల్లన, గూగుల్ గో యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తక్కువ మెమొరీని తీసుకుని, స్మూత్ గా పని చేస్తాయి.

iTel P40 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, క్యూవీజీఏ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

iTel P40 స్మార్ట్ ఫోన్ 4జీ ఎల్టీఈ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం iTel P40 లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ తో లాంచైన iTel P40 first appeared on 91Mobiles Telugu.

]]>