itel P65C - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Oct 2024 12:09:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/ https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/#respond Fri, 04 Oct 2024 12:09:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=13922 యూజర్ల కోసం తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉంటుంది ITEL సంస్థ. తాజాగా ఈ కంపెనీ పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. itel P65C పేరుతో ఈ డివైజ్ జాంబియా దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. itel […]

The post itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జాంబియాలో లాంచైన itel P65C
  • 13ఎంపి ప్రైమరీ కెమెరా
  • యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్

యూజర్ల కోసం తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చే కంపెనీల్లో ముందు వరుసలో ఉంటుంది ITEL సంస్థ. తాజాగా ఈ కంపెనీ పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. itel P65C పేరుతో ఈ డివైజ్ జాంబియా దేశంలో విడుదలైంది. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

itel P65C డిజైన్

itel P65C స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకునే లుక్ తో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. డివైజ్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఫ్లాట్ ప్యానెల్ ఉంది. జాంబియాలో ఈ ఫోన్ మూన్‌లిట్ బ్లాక్, అరోరా బ్లూ మరియు బ్రిలియంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel P65C స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel P65C లో 6.6-ఇంచ్ పంచ్ హోల్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: itel P65C లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: itel P65C డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: itel P65C డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: itel P65C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: itel P65C లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

itel P65C ధర, లభ్యత

itel P65C స్మార్ట్‌ఫోన్ ధర జాంబియాలో K2200 గా ఉంది. భారత కరెన్సీలో దీన్ని రూ.7,000 గా చెప్పవచ్చు.

The post itel P65C: 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఐటెల్ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/itel-p65c-globally-launched-8gb-ram-5000mah-battery/feed/ 0