itel Super Guru 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 19 Apr 2024 16:11:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 itel Super Guru 4G: యూట్యూబ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఐటెల్ సూపర్ గురు 4జీ https://www.91mobiles.com/telugu/itel-super-guru-4g-launched-in-india-with-youtube-support/ Fri, 19 Apr 2024 16:11:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=11185 చైనాకు చెందిన Itel సంస్థ నేడు భారత్ లో Super Guru 4G అనే కీప్యాడ్ ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. యూట్యూబ్ ప్లేబ్యాక్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి itel Super Guru 4G ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి. itel Super Guru 4G ధర, లభ్యత itel Super Guru […]

The post itel Super Guru 4G: యూట్యూబ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఐటెల్ సూపర్ గురు 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో itel Super Guru 4G లాంచ్
  • 6 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఫోన్
  • యూపీఐ పేమెంట్, 4జీ కనెక్టివిటీ

చైనాకు చెందిన Itel సంస్థ నేడు భారత్ లో Super Guru 4G అనే కీప్యాడ్ ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో ఎన్నో చక్కటి ఫీచర్లు ఉన్నాయి. యూట్యూబ్ ప్లేబ్యాక్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. సరే, ఓసారి itel Super Guru 4G ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

itel Super Guru 4G ధర, లభ్యత

itel Super Guru 4G కీప్యాడ్ ఫోన్ ధర భారత్ లో రూ.1,799 గా ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ మరియు ఐటెల్ అధికార వెబ్‌సైట్ ద్వారా itel Super Guru 4G ని కొనుగోలు చేయవచ్చు.

itel Super Guru 4G ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

itel Super Guru 4G ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కీప్యాడ్ ఫోన్. ఇది కొన్ని ముఖ్యమైన ఆధునిక ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ ప్లేబ్యాక్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంది. దీంతో యూజర్లు యూట్యూబ్ షార్ట్స్ ని చూడవచ్చు. అలాగే బీబీసీ వార్తలను ఇంగ్లీష్, హిందీ, పంజాబి మరియు ఉర్దూ భాషల్లో చూడవచ్చు.

itel Super Guru 4G ఫోన్ లో 2-ఇంచ్ స్క్రీన్, స్టాండర్డ్ కీప్యాడ్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై వీజీఏ కెమెరా ఉంది. ఈ ఫోన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ లెట్స్‌చాట్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

itel Super Guru 4G డివైజ్ లో టెట్రిస్, సొకొబన్, 2048 అనే గేమ్స్ కూడా ఉన్నాయి.

itel Super Guru 4G ఫోన్ లో డ్యూయల్ 4జీ కనెక్టివిటీ, వొల్టీ ఉన్నాయి. జియో యొక్క 4జీ-ఓన్లీ నెట్వర్క్ తో పాటు ఇతర అన్ని టెలీకామ్ ఆపరేటర్ల మాత్రమే పని చేస్తుంది.

ఈ ఫోన్ 2జీ, 3జీ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో మారుమూల గ్రామాల్లో కూడా సిగ్నల్ సమస్య ఉండదు. ఇంకా ఈ ఫోన్ లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందుకై ఒక బ్రౌజర్ కూడా ఉంది. 13 భారత భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి కావాల్సిన భాషను ఎంచుకోవచ్చు.

itel Super Guru 4G ఫోన్‌లో 1000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 6 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఐటెల్ సూపర్ గురు 4జీ ఫీచర్ ఫోన్ డార్క్ బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post itel Super Guru 4G: యూట్యూబ్ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఐటెల్ సూపర్ గురు 4జీ first appeared on 91Mobiles Telugu.

]]>