Jeeto Dhan Dhana Dhan Contest - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Apr 2023 06:01:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 JioCinema యొక్క Jeeto Dhan Dhana Dhan కాంటెస్ట్ లో పాల్గొనడం ఎలా? https://www.91mobiles.com/telugu/tata-ipl-2023-how-to-participate-in-jio-cinema-jeeto-dhan-dhana-dhan-contest/ Wed, 19 Apr 2023 13:45:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=5953 2023 ఐపీఎల్ ప్రారంభమైంది. ఈసారి ఐపీఎల్ జనాలకు మరింత సంతోషాన్ని తెచ్చింది. ఎందుకుంటే టాటా ఐపీఎల్ 2023 టోర్నీని జియో సినిమా ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు. ఓ పక్క జియో యూజర్లు ఐపీఎల్ ని ఫ్రీ గా ఎంజాయ్ చేస్తుంటే, మరోపక్క జియో సంస్థ జీతో ధన్ ధనా ధన్ అనే కాంటెస్ట్ తో వచ్చేసి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ కాంటెస్ట్ లో భాగంగా యూజర్లు కారుతో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ […]

The post JioCinema యొక్క Jeeto Dhan Dhana Dhan కాంటెస్ట్ లో పాల్గొనడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఐపీఎల్ తో పాటు వచ్చిన జీతో ధన్ ధనా ధన్ కాంటెస్ట్
  • ఇప్పటి వరకు కార్లు గెలిచిన 14 మంది విజేతలు
  • ప్రతి మ్యాచ్ లో కారు గెలుచుకునే అవకాశం

2023 ఐపీఎల్ ప్రారంభమైంది. ఈసారి ఐపీఎల్ జనాలకు మరింత సంతోషాన్ని తెచ్చింది. ఎందుకుంటే టాటా ఐపీఎల్ 2023 టోర్నీని జియో సినిమా ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు. ఓ పక్క జియో యూజర్లు ఐపీఎల్ ని ఫ్రీ గా ఎంజాయ్ చేస్తుంటే, మరోపక్క జియో సంస్థ జీతో ధన్ ధనా ధన్ అనే కాంటెస్ట్ తో వచ్చేసి వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ కాంటెస్ట్ లో భాగంగా యూజర్లు కారుతో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకోవచ్చు.

ఈ కాంటెస్ట్ ఏప్రిల్ 8 న ప్రారంభమైంది. ఇప్పటివరకు 14 మంది కార్లను గెలుచుకున్నారు. సరే, మరి ఈ కాంటెస్ట్ లో పాల్గొనడం ఎలాగో తెలుసుకుందాం పదండి.

ఎప్పటి వరకు జీతో ధన్ ధనా ధన్ కాంటెస్ట్ అందుబాటులో ఉంటుంది

రిలయన్స్ జియో తీసుకొచ్చిన జీతో ధన్ ధనా ధన్ కాంటెస్ట్ జియో సినిమా అప్లికేషన్ పై ఏప్రిల్ 8 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది మే 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో కారుతో పాటు స్మార్ట్ వాచీ, బ్లూటూత్ స్పీకర్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ నెక్‌బ్యాండ్ గెలిచే అవకాశం ఉంది.

కాంటెస్ట్ లో పాల్గొనడం ఎలా?

మీరు గనుక జీతో ధన్ ధనా ధన్ కాంటెస్ట్ లో పాల్గొనదలిచితే, ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ తప్పకుండా చూడాలి. ప్రతీ ఓవర్ తర్వాత ఒక ప్రశ్న అడుగబడుతుంది. 4 ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పిన యూజర్ విజేతగా నిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ డౌన్‌లోడ్ చేయడం మరియు కాంటెస్ట్ లో పాల్గొనడం గురించిన సమాచారం పాయింట్స్ రూపంలో ఇస్తున్నాం. చదివి తెలుసుకోండి.

  • తొలుత మీరు ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి జియో సినిమా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
  • రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టాటా ఐపీఎల్ మ్యాచ్ చూస్తోన్న సమయంలో ప్రతీ ఓవర్ తర్వాత వచ్చే ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి
  • ప్రతీ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో సరైన దాన్ని ఎంచుకోవాలి
  • విజేతను ప్రతీ మ్యాచ్ ముగిసాక ప్రకటిస్తారు
  • మీరు గనుక అదృష్టవంతులైతే మీకు కారు గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

Jeeto Dhan Dhana Dhan కాంటెస్ట్ స్పెషల్ ఫీచర్స్

  • జియో సినిమా పై అందుబాటులో ఉన్న కాంటెస్ట్ ఒక ఆన్‌లైన్ కాంటెస్ట్
  • కాంటెస్ట్ లో యూజర్లు ఉచితంగానే పాల్గొనవచ్చు
  • మ్యాచ్ లో ప్రతీ ఓవర్ తర్వాత ఒక ప్రశ్న అడుగుతారు. అంటే మొత్తం 40 ఓవర్లకు గాను 40 ప్రశ్నలు ఉంటాయి.
  • ఐపీఎల్ లో ఇంకా మిగిలి ఉన్న అన్ని మ్యాచ్ లకు కారు బహుమతి ఉంటుంది.
  • జియో సినిమా పై ప్రసారమయ్యే ప్రతీ మ్యాచ్ దేశంలోని 12 భాషల్లో ప్రసారమవుతుంది. వీటిలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠి భాషలు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post JioCinema యొక్క Jeeto Dhan Dhana Dhan కాంటెస్ట్ లో పాల్గొనడం ఎలా? first appeared on 91Mobiles Telugu.

]]>