Jio Bharat - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Jul 2023 06:34:31 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 జియో భారత్ డేటా ప్లాన్స్ తో భారత్‌లో లాంచైన Jio Bharat 4G ఫీచర్ ఫోన్! https://www.91mobiles.com/telugu/jio-bharat-4g-feature-phone-launched-india-price-availability/ Tue, 04 Jul 2023 06:34:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7051 రిలయన్స్ జియో సంస్థ తాజాగా జియో భారత్ ఫోన్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ క్రింద 4జీ ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి దేశ వ్యాప్తంగా ఉన్న 2.50 కోట్ల మంది కీప్యాడ్ ఫోన్ యూజర్లకు ఉపయోగపడనున్నాయి. జియో భారత్ ఫోన్ ఒక అత్యవసరమైన స్మార్ట్ ఫీచర్ ఫోన్. ఇది ఇంటర్నెట్ తో పాటు యూపీఐ పేమెంట్స్ ఇంకా జియో ఎంటర్టెయిన్మెంట్ యాప్స్ కి యాక్సెస్ ని అందిస్తుంది. ఈ 4జీ ఫోన్ […]

The post జియో భారత్ డేటా ప్లాన్స్ తో భారత్‌లో లాంచైన Jio Bharat 4G ఫీచర్ ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2.50 కోట్ల కీప్యాడ్ ఫోన్ యూజర్లకు శుభవార్త
  • 4జీ, యూపీఐ పేమెంట్ ఆప్షన్ తో వచ్చిన ఫోన్
  • రూ.123 కనీస ధరతో లాంచైన జియో భారత్ ప్లాన్స్

రిలయన్స్ జియో సంస్థ తాజాగా జియో భారత్ ఫోన్ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ క్రింద 4జీ ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి దేశ వ్యాప్తంగా ఉన్న 2.50 కోట్ల మంది కీప్యాడ్ ఫోన్ యూజర్లకు ఉపయోగపడనున్నాయి. జియో భారత్ ఫోన్ ఒక అత్యవసరమైన స్మార్ట్ ఫీచర్ ఫోన్. ఇది ఇంటర్నెట్ తో పాటు యూపీఐ పేమెంట్స్ ఇంకా జియో ఎంటర్టెయిన్మెంట్ యాప్స్ కి యాక్సెస్ ని అందిస్తుంది. ఈ 4జీ ఫోన్ జియో భారత్ ప్లాన్స్ తో వస్తోంది. ఈ ప్లాన్స్ ద్వారా యూజర్ కి అపరిమిత కాల్స్, డెయిలీ మొబైల్ డేటా చవకైన ధరలో లభిస్తాయి.

భారత్ లో Jio Bharat Phone ధర

  • భారత్ లో Jio Bharat Phone ధరను రూ.999 గా నిర్ణయించారు. ఈ 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్ రెడ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • 2023 జులై 7 న 1 మిలియన్ Jio Bharat ఫోన్ల బీటా ట్రయల్ మొదలవుతుంది.

Jio Bharat రీచార్జ్ ప్లాన్స్

రూ.123 కనీస ధరతో జియో సంస్థ తన Jio Bharat ప్లాన్స్ ని లాంచ్ చేసింది. రూ.123 ప్లాన్ ద్వారా యూజర్ కి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, ఒక రోజుకి 0.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా Jio Bharat ఏడాది ప్లాన్ ధరను రూ.1,234 గా నిర్ణయించారు. ఈ ప్లాన్ కూడా అపరిమిత కాల్స్ తో పాటు ప్రతిరోజూ 500ఎంబి డేటా అందిస్తుంది.

Jio Bharat Phone ఫీచర్స్

జియో సంస్థ తన లేటెస్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. అయితే, డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ ని జియో వెల్లడించింది. చూసేందుకు, Jio Bharat Phone చిన్న డిస్ప్లే కలిగి సాధారణ ఫీచర్ ఫోన్ మాదిరే ఉంటుంది. ఇంకా ఇందులో ఒక ఫిజికల్ కీప్యాడ్ ఉంటుంది. కానీ, ఫోన్ లో ఎన్నో స్మార్ట్ ఫీచర్స్ ఉండటం విశేషం.

  • ఈ ఫోన్ లో జియోపే యాప్ ద్వారా యూజర్ యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు.
  • ఇంకా జియో సినిమా యాప్ ద్వారా సినిమాలు, టీవీ షోలను కూడా చూడవచ్చు.
  • Jio Bharat Phone జియోసావన్ యాప్ తో వస్తోంది. దీని ద్వారా యూజర్ 8 కోట్లకు పైగా పాటలను వినవచ్చు.
  • ఎఫ్ఎమ్ రేడియో, టార్చ్ లైట్ వంటి బేసిక్ ఫీచర్లను Jio Bharat Phone పై పొందవచ్చు.
  • ఈ ఫోన్ ఏ ఓఎస్ పై పని చేస్తుందన్న విషయాన్ని జియో సంస్థ వెల్లడించలేదు. వాట్సాప్ వంటి యాప్స్ ఈ ఫోన్ లో పని చేస్తాయో లేదో ఇంకా తెలియదు.

ఇతర బ్రాండ్ లకు కూడా Jio Bharat Platform విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. తొలుత దీన్ని Karbonn సంస్థ ఇంప్లిమెంట్ చేయబోతోంది.

The post జియో భారత్ డేటా ప్లాన్స్ తో భారత్‌లో లాంచైన Jio Bharat 4G ఫీచర్ ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>