Jio-BP - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 Aug 2022 14:22:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ కష్టాలను తీర్చనున్న Jio https://www.91mobiles.com/telugu/reliance-industries-limited-bp-ev-charging-stations-india/ Sat, 27 Aug 2022 04:30:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=1945 హైలైట్స్: దేశంలో భారీగా అమ్ముడవుతోన్న ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, రేంజ్ కి సంబంధించి వినియోగదారుల్లో నెలకొన్న భయం ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ సమస్యను తీర్చేందుకు రంగంలోకి దిగిన రిలయన్స్ జియో జియో-బీపీ అనే ఒక జాయింట్ వెంచర్ కి బీజాలు పడ్డాయి. దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యునైటెడ్ కింగ్‌డమ్ కి చెందిన బడా కంపెనీ బీపీ కలిసి దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల కొరకు ఒక చార్జింగ్ ఇన్ఫాస్ట్రక్చర్ మరియు ఫెసిలిటీస్ […]

The post ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ కష్టాలను తీర్చనున్న Jio first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దేశంలో భారీగా అమ్ముడవుతోన్న ఎలక్ట్రిక్ వాహనాలు
  • చార్జింగ్ స్టేషన్లు, రేంజ్ కి సంబంధించి వినియోగదారుల్లో నెలకొన్న భయం
  • ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ సమస్యను తీర్చేందుకు రంగంలోకి దిగిన రిలయన్స్ జియో

జియో-బీపీ అనే ఒక జాయింట్ వెంచర్ కి బీజాలు పడ్డాయి. దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యునైటెడ్ కింగ్‌డమ్ కి చెందిన బడా కంపెనీ బీపీ కలిసి దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల కొరకు ఒక చార్జింగ్ ఇన్ఫాస్ట్రక్చర్ మరియు ఫెసిలిటీస్ ని అభివృద్ధి చేశాయి. అలాగే బ్యాటరీ స్వాపింగ్ ని ప్రమోట్ చేసేందుకై హీరో ఎలక్ట్రిక్ తో చేతులు కలిపాయి. దీంతో, హీరో ఎలక్ట్రిక్ కస్టమర్లు జియో-బీపీ నిరంతర చార్జింగ్ మరియు స్వాపింగ్ నెట్వర్క్ ని వినియోగించుకునే అవకాశాన్ని పొందనున్నారు. అలాగే ఇతర వాహనాలకు కూడా ఈ సౌకర్యం ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్, జియో-బీపీ యాప్స్ ద్వారా కస్టమర్లు తమకు దగ్గర్లోని చార్జింగ్ స్టేషన్ వివరాలను తేలిగ్గా తెలుసుకోవచ్చు.

App ద్వారా చార్జింగ్ స్టేషన్ ను వెతకడం తేలికే

జియో-బీపీ సంస్థ జియో-బీపీ పల్స్ అనే బ్రాండ్ పేరుతో ఈవీ చార్జింగ్, స్వాపింగ్ స్టేషన్స్ ను నిర్వహించనున్నాయి. తమకు ఏ చార్జింగ్ స్టేషన్ దగ్గర్లో ఉందో తెలుసుకునేందుకు కస్టమర్లు జియో-బీపీ పల్స్ యాప్ ను వినియోగించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద ఈవీ నెట్వర్క్ గా నిలవాలనే లక్ష్యంతో జియో-బీపీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎకో సిస్టమ్ ని సృష్టించి, ఈవీ వాల్యూ చైన్ లోని అందరికీ సేవలు అందించేందుకు నడుం బిగించింది.

కస్టమర్లకు ఆర్బీఎంఎల్ ఈవీ చార్జింగ్ పాయింట్ తో పాటు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ఆప్షన్ ను సమకూరుస్తోంది. మరోవైపు, హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 750 కి పైగా సేల్స్ అండ్ సర్వీస్ ఔట్ లెట్స్ ని కలిగి ఉంది. అలాగే ఎక్స్‌టెన్సివ్ చార్జింగ్ నెట్వర్క్ తో పాటు, శిక్షణ పొందిన రోడ్‌సైడ్ మెకానిక్స్ ని కలిగి ఉండటం హీరో ఎలక్ట్రిక్ ప్రధాన బలం. దేశంలో మొత్తం 4.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లతో హీరో ఎలక్ట్రిక్ గత 14 ఏళ్ళుగా తన సేవలను అందిస్తోంది.

కలిసి పని చేస్తున్న Jio-BP

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు యూకే కి చెందిన ఎనర్జీ కంపెనీ బీపీ కలిసి జియో-బీపీ అనే ఒక జాయింట్ వెంచర్ ని నెలకొల్పాయి. ఈ జాయింట్ వెంచర్ భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రైడ్-హెయిలింగ్ కంపెనీ. హెయిలింగ్ ప్లాట్ఫామ్ బ్లూస్మార్ట్ తో చేతులు కలిపిన జియో-బీపీ ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ కష్టాలను తీర్చనుంది. దీంతో జనాలు ఎటువంటి ఆందోళన, భయం లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనగలుగుతారు. జియో-బీపీ పార్ట్నర్షిప్ తర్వాత, దేశ వ్యాప్తంగా కమర్షియల్ ఈవీ చార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

రెండు కంపెనీలు బ్లూస్మార్ట్ ఆపరేట్ చేసే ఆయా నగరాల్లో ఈవీ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్ వంటి విషయాల్లో కలిసి పని చేయనున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ లో బ్లూస్మార్ట్ కంపెనీ తన ఎలక్ట్రిక్ ఫ్లీట్ తో మొబిలిటీ సెక్టర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

The post ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ కష్టాలను తీర్చనున్న Jio first appeared on 91Mobiles Telugu.

]]>