Jio Phone Next - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 16 Nov 2022 14:04:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 పనికిరాని పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.2,000 వస్తాయి, ఎలాగో తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/rs-2000-exchange-offer-with-jio-phone-next/ Wed, 16 Nov 2022 13:21:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=3478 హైలైట్స్ పనిచేయని ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.2,000 జియోఫోన్ నెక్ట్స్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ తో పాత ఫోన్ పై చేకూరనున్న ప్రయోజనం పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మీ సొంతం కానున్న జియో నెక్ట్స్ ఫోన్ పాత ఫోన్ తో ఏం చేస్తావ్ అని అడిగితే ఏం చెబుతారు? ఏముంది ఎక్స్‌చేంజ్ చేసుకుని కొత్త ఫోన్ తీసుకుంటా అంటారు. లేదంటే ఇంట్లో వాళ్ళకో, స్నేహితులకో ఇస్తారు. అదే కదా మీ సమాధానం. వర్కింగ్ కండిషన్ […]

The post పనికిరాని పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.2,000 వస్తాయి, ఎలాగో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • పనిచేయని ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.2,000
  • జియోఫోన్ నెక్ట్స్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ తో పాత ఫోన్ పై చేకూరనున్న ప్రయోజనం
  • పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మీ సొంతం కానున్న జియో నెక్ట్స్ ఫోన్

పాత ఫోన్ తో ఏం చేస్తావ్ అని అడిగితే ఏం చెబుతారు? ఏముంది ఎక్స్‌చేంజ్ చేసుకుని కొత్త ఫోన్ తీసుకుంటా అంటారు. లేదంటే ఇంట్లో వాళ్ళకో, స్నేహితులకో ఇస్తారు. అదే కదా మీ సమాధానం. వర్కింగ్ కండిషన్ లో ఉంటే అలా చేయవచ్చు. లేదంటే ఇంట్లో ఏదో మూలకు పడి ఉంటుంది ఆ ఫోన్. కానీ, అసలు పనికిరాని, ఇంట్లో మూలకు పడి ఉన్న ఫోన్ కి కూడా రూ.2,000 లభిస్తాయంటే మీ రియాక్షన్ ఏంటి?

పూర్తిగా చెడిపోయిన మీ పాత ఫోన్ తో కూడా మీరు రూ.2,000 లాభం పొందవచ్చు. మీరు ఎప్పుడైనా కొత్త ఫోన్ కొంటే, పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేస్తారు. అయితే ఆ పాత ఫోన్ పని చేస్తుంటే పర్లేదు. లేదంటే ఎక్స్‌చేంజ్ రిజెక్ట్ అవుతుంది. అయితే ముకేశ్ అంబాని మరియు రిలయన్స్ జియ్ కలిసి ఓ అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చాయి. ఆ పథకం క్రింద, మీ చెడిపోయిన ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేసుకుని రూ.2,000 పొందవచ్చు. పూర్తి ఆఫర్ వివరాలు ఇక్కడ అందజేస్తున్నాం చూడండి.

పాతదైన, పనికిరాని ఫోన్ తో రూ.2,000 లాభం

రిలయన్స్ జియో తీసుకొచ్చిన పథకం Jio Phone Next కి అందుబాటులో ఉంది. మీరు ఏ కంపెనీకి చెందిన పనికిరాని పాత ఫోన్ ని అయినా మార్పిడి చేసుకుని రూ.2,000 బెనిఫిట్ ని పొందవచ్చు. అంటే Jio Phone Next ఫోన్ ధరలో రూ.2000 మీకు డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్ మిగతా ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో పోల్చితే భిన్నమైనది. ఎందుకంటే, ఇక్కడ మూలకుపడి ఉన్న పాత ఫోన్ కి కూడా బెనిఫిట్ ఇస్తున్నారు.

Jio Phone Next

Jio తీసుకువచ్చిన ఈ చవకైన 4జీ ఫోన్ కోసం భారతీయులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే నెలల సమయం వేచి ఉన్నాక వచ్చిన జియో ఫోన్ యూజర్లకు నిరాశే మిగిల్చింది. ఎందుకంటే, జియో సంస్థ తన 4జీ బడ్జెట్ ఫోన్ ని రూ.6,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ధర సామాన్యుడికి రుచించలేదు. ధర ఎక్కువైందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ని ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో రూ.2,000 డిస్కౌంట్ పై రూ.4,449 కే సొంతం చేసుకోవచ్చు. జియో అధికార వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ ఆఫర్ ని పొందవచ్చు.

Jio Phone Next ఫీచర్స్

Jio Phone Next ఒక 4జీ స్మార్ట్ ఫోన్. ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో ఈ ఫోన్ రూ.4,449 కే లభిస్తుంది. ఇదొక డ్యూయల్ సిమ్ ఫోన్. సిమ్ 1 లో మాత్రమే 4జీ ఎల్టీఈ పని చేస్తుంది. సిమ్ 2 లో 2జీ+4జీ పని చేస్తుంది. ఇక రెండు సిమ్ స్లాట్స్ లో ఒకదానిలో జియో సిమ్ పని చేస్తుంది. జియో సిమ్ స్లాట్ లో ఇతర కంపెనీలకు చెందిన సిమ్ కార్డ్స్ పని చేయవు. అలాగే ఫోన్ లో రెండు సిమ్స్ రన్ అవుతున్నప్పుడు కేవలం జియో సిమ్ లో మాత్రమే మొబైల్ డేటా కనెక్టివిటీ ఉంటుంది.

Jio Phone Next స్పెసిఫికేషన్స్

Jio Phone Next 5.45-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ని కలిగి ఉంది. ఇది 720*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో ప్రొటెక్ట్ చేయబడింది. Jio Phone Next కోసం గూగుల్ కంపెనీ ప్రత్యేకంగా ప్రగతి ఓఎస్ ని రూపొందించింది. Jio Phone Next భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా పని చేస్తుంది. జియో టీవీ, జియో సినిమా, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ లెన్స్, గూగుల్ అసిస్టెంట్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఇందులో పని చేస్తాయి.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ క్యూఎమ్215 చిప్సెట్ Jio Phone Next లో వాడారు. 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు పెంచుకోవచ్చు. Jio Phone Next లో 13 మెగా పిక్సెల్ మెయిన్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా ప్రొవైడ్ చేశారు. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. 3.5ఎంఎం ఆడియో జాక్, ఓటీజీ సపోర్ట్, బ్లూటూత్, వై-ఫై వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post పనికిరాని పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.2,000 వస్తాయి, ఎలాగో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>