Jio True 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 07 Oct 2022 15:32:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio 5G లాంచ్: రేపటి నుంచి 1Gbps స్పీడ్ తో అందుబాటులోకి వస్తోన్న జియో 5జీ https://www.91mobiles.com/telugu/jio-true-5g-available-from-tomorrow-as-a-welcome-offer-for-selected-customers/ Tue, 04 Oct 2022 15:31:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=2753 హైలైట్స్: దసరా పండుగ సందర్భంగా రేపు 5జీ సేవలను లాంచ్ చేస్తున్న జియో తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు Jio True 5G వెల్కమ్ ఆఫర్ ప్రకటించిన జియో జియో కస్టమర్లు వేచి చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు దసరా పండుగ సందర్భంగా, రిలయన్ జియో తన 5జీ సేవలను ప్రారంభిస్తోంది. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లో జియో 5జీ సేవలు మొదలు కానున్నాయి. […]

The post Jio 5G లాంచ్: రేపటి నుంచి 1Gbps స్పీడ్ తో అందుబాటులోకి వస్తోన్న జియో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • దసరా పండుగ సందర్భంగా రేపు 5జీ సేవలను లాంచ్ చేస్తున్న జియో
  • తొలుత ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు
  • Jio True 5G వెల్కమ్ ఆఫర్ ప్రకటించిన జియో

జియో కస్టమర్లు వేచి చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు దసరా పండుగ సందర్భంగా, రిలయన్ జియో తన 5జీ సేవలను ప్రారంభిస్తోంది. తొలి దశలో ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లో జియో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అయితే ఇది ఇన్విటేషన్ ప్రాతిపదికన ప్రారంభమవుతోంది. ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కొందరు జియో యూజర్లకు 5జీ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానం వెళ్తుంది. ఈ ఆఫర్ క్రింత యూజర్లు 1జీబీపీఎస్ స్పీడ్ తో 5జిబి అపరిమిత డేటా పొందుతారు. యూజర్ల యొక్క అనుభవం ఆధారంగా జియో తన 5జీ సేవలను విస్తరించనుంది. జియో ట్రూ 5జీ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

తొలిదశలో Jio 5G సేవలు పొందే నగరాలివే

ప్రయోగాత్మకంగా తొలిదశలో జియో 5జీ సేవలు డిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లో ప్రారంభమవుతున్నాయి. ఆహ్వానంపై మాత్రమే ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అంటే, ఎంపిక కాబడిన కొందరు కస్టమర్లు మాత్రమే జియో ట్రూ 5జీ పేరుతో ఉన్న ఈ వెల్కమ్ ఆఫర్ ని వినియోగించుకోగల్గుతారు.

Jio True 5G వెల్కమ్ ఆఫర్

  • ఢిల్లీ, ముంబై, కోల్‌కాతా, వారణాసి నగరాల్లోని జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా లాంచ్ అయిన జియో ట్రూ 5జీ వెల్కమ్ ఆఫర్
  • 1జీబీపీఎస్+ స్పీడ్ తో కూడిన 5జిబి అపరిమిత డేటాను పొందనున్న కస్టమర్లు
  • ఇతర నగరాలు సిద్ధమైన వెంటనే మొదలు కానున్న బీటా టెస్టింగ్ సర్వీస్
  • నెట్వర్క్ కవరేజీ బలపడేంత వరకు వినియోగంలో ఉండనున్న బీటా టెస్ట్ సేవలు
  • జియో వెల్కమ్ ఆఫర్ యూజర్లు సిమ్ మార్చనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న సిమ్ ద్వారా 5జీ సేవలను ఉపయోగించవచ్చు.
  • అన్ని హ్యాండ్సెట్ బ్రాండ్స్ తో కలిసి పని చేస్తున్న జియో

4జీ సిమ్ పై అందుబాటులోకి రానున్న 5జీ సేవలు

జియో ట్రూ 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు తాజాగా జియో ప్రకటించింది. అయితే 5జీ సేవల కోసం ప్రత్యేకంగా సిమ్ మార్చనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న 4జీ సిమ్ తోనే 5జీ సేవలు పొందవచ్చు. జియ్ వెల్కమ్ ఆఫర్ యూజర్లు సిమ్ చేంజ్ చేయనక్కర్లేదని జియో తెలిపింది. అయితే ఫోన్ మాత్రం 5జీ కనెక్టివిటీని కలిగి ఉండాలని చెప్పింది. జియో ట్రూ 5జీ సర్వీస్ ఆటోమేటిక్ గా అప్‌గ్రేడ్ అవుతుంది.

Jio True 5G యొక్క 3 ప్రత్యేక ఫీచర్లు

1. స్టాండ్-అలోన్ 5జీ: దీనర్థమేంటంటే, 4జీ నెట్వర్క్ తో పని లేకుండా సొంతంగా 5జీ నెట్వర్క్ నిర్వహణ జరుగుతుంది. ఇతర టెలీకామ్ సంస్థలు ప్రస్తుతం ఉన్న 4జీ నెట్వర్క్ పైనే 5జీ సేవలను అందించబోతున్నాయి. కానీ, జియో మాత్రం ప్రత్యేకమైన 5జీ స్టాండలోన్ ఇన్ఫాస్ట్రక్చర్ ని కలిగి ఉంది. దీనిలో లో-లేటెన్సీ, మ్యాసివ్ మెషీన్-టు-మెషీన్ కమ్యూనికేషన్, 5జీ వాయిస్, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్వర్క్ స్లైసింగ్ అనబడే ఫీచర్లు ఉన్నాయి.

2. భారీ, ఉత్తమమైన స్పెక్ట్రమ్: 700 మెగాహెర్ట్జ్, 3500 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ వంటి భారీ మరియు సరియైన 5జీ స్పెక్ట్రమ్ బ్యాండ్స్ ఉన్నాయి. దీంతో జియో ట్రూ 5జీ ఇతర ఆపరేటర్లపై పైచేయి సాధించనుంది. ఇక 700 మెగాహెర్ట్జ్ లో-బ్యాండ్ స్పెక్ట్రమ్ కలిగి ఏకైక సంస్థ జియోనే కావడం విశేషం. ఇది మెరుగైన ఇండోర్ కవరేజీని అందిస్తుంది. యూరప్, యూఎస్, యూకే ల్లో ఈ బ్యాండ్ ని ప్రీమియమ్ 5జీ బ్యాండ్ గా పరిగణిస్తారు.

3. కెరియర్ అగ్రిగేషన్: కెరియర్ అగ్రిగేషన్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బలమైన 5జీ ఫ్రీక్వెన్సీ డేటా హైవే లను క్రియేట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Jio 5G లాంచ్: రేపటి నుంచి 1Gbps స్పీడ్ తో అందుబాటులోకి వస్తోన్న జియో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>