JioBharat B1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 12 Oct 2023 13:56:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2.4-ఇంచ్ డిస్ప్లే, 2,000mAh బ్యాటరీతో లాంచైన JioBharat B1; ధర చాలా తక్కువ! https://www.91mobiles.com/telugu/jio-bharat-b1-4g-feature-phone-launched-india-price-specs/ Thu, 12 Oct 2023 13:56:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=8370 భారతదేశంలో అగ్రశ్రేణి టెలీకామ్ సంస్థ జియో నేడు JioBharat B1 ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న JioBharat V2, K1 Karbonn మోడల్స్ తో జతచేరనుంది. JioBharat B1 సిరీస్ పేరుతో జియో సంస్థ తన అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. అంటే ఈ లైనప్ లో భవిష్యత్తులో మరిన్ని ఫోన్లు వస్తాయని అనుకోవచ్చు. JioBharat సిరీస్ తక్కువ ధరలో 4జీ ఫోన్లను ఆఫర్ చేస్తుంది. […]

The post 2.4-ఇంచ్ డిస్ప్లే, 2,000mAh బ్యాటరీతో లాంచైన JioBharat B1; ధర చాలా తక్కువ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన JioBharat B1
  • 2000mAh బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • JioBharat B1 ధర రూ.1,299

భారతదేశంలో అగ్రశ్రేణి టెలీకామ్ సంస్థ జియో నేడు JioBharat B1 ఫీచర్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న JioBharat V2, K1 Karbonn మోడల్స్ తో జతచేరనుంది. JioBharat B1 సిరీస్ పేరుతో జియో సంస్థ తన అధికార వెబ్‌సైట్ లో లిస్ట్ చేసింది. అంటే ఈ లైనప్ లో భవిష్యత్తులో మరిన్ని ఫోన్లు వస్తాయని అనుకోవచ్చు.

JioBharat సిరీస్ తక్కువ ధరలో 4జీ ఫోన్లను ఆఫర్ చేస్తుంది. ఇకపోతే, JioBharat B1 ఫోన్ భారీ డిస్ప్లే, యూపీఐ పేమెంట్స్ కోసం జియోపే యాప్ తో వచ్చింది. సరే, ఓసారి JioBharat B1 డివైజ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్‌లో JioBharat B1 ధర, లభ్యత

జియో తాజాగా తీసుకొచ్చిన JioBharat B1 ఫీచర్ ఫోన్ భారతదేశంలో బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. అమెజాన్ మరియు అఫీషియల్ జియో స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ధరను రూ.1,299 గా నిర్ణయించారు. JioBharat B1 ఫీచర్ ఫోన్ ని జియో పాత సిమ్ లేదా కొత్త సిమ్ తో వాడుకోవచ్చు. అయితే, JioBharat B1 ఫీచర్ ఫోన్ యొక్క ప్రయోజనాలను పొందాలంటే, యూజర్లు కచ్చితంగా జియో రూ.123 ప్లాన్ మరియు అంతకన్నా పై శ్రేణి ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

JioBharat B1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ప్లాస్టిక్-క్లాడ్ యూనిట్ గల టూ-టోన్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ తో JioBharat B1 వచ్చింది. బ్యాక్ ప్యానెల్ మ్యాట్ ఫినిష్ కలిగి ఉంది. మధ్య భాగంలో జియో లోగో ఉంది. కెమెరా మాడ్యూల్ గ్లాసీ ఫినిష్ తో ఉంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, JioBharat B1 డివైజ్ లో క్యూవీజీఏ కెమెరా ఉంది. అలాగే లౌడ్ స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

  • డిస్ప్లే: JioBharat B1 లో 2.4-ఇంచ్ డిస్ప్లే అందించారు. సినిమాలు, ఇతర వీడియోలు చూసేందుకు వీలుగా డిస్ప్లే ఉంటుంది.
  • బ్యాటరీ: JioBharat B1 లో పవర్ బ్యాకప్ కోసం 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే, ఈ ఫీచర్ ఫోన్ చాలా సమయం పాటు నడుస్తుంది.
  • కనెక్టివిటీ: JioBharat B1 డివైజ్ 4జీ కనెక్టివిటీతో వచ్చింది. అలాగే ఈ ఫోన్ లో బిల్ట్-ఇన్ ఎఫ్ఎమ్ కూడా ఉంది.
  • ఇతర ఫీచర్లు: JioBharat B1 డివైజ్ వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. మొత్తం 23 భాషల్లో యూజర్లు తమ ఫోన్ ని వాడుకోవచ్చు. అంతేకాదు, జియోపే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు. ఇంకా JioBharat B1 డివైజ్ జియో సినిమా, జియో సావన్ యాప్స్ తో వచ్చింది. దీంతో స్పోర్ట్స్, వీడియోస్, సినిమాలను వివిధ భాషల్లో ఎంజాయ్ చేయవచ్చు. జియో సావన్ యాప్ ద్వారా యూజర్లకు విభిన్న భాషల్లోని 8 కోట్లకు పైగా పాటలకు యాక్సెస్ లభిస్తుంది.

The post 2.4-ఇంచ్ డిస్ప్లే, 2,000mAh బ్యాటరీతో లాంచైన JioBharat B1; ధర చాలా తక్కువ! first appeared on 91Mobiles Telugu.

]]>