Kawasaki - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 10 Nov 2022 11:19:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki https://www.91mobiles.com/telugu/kawasaki-introduces-z-bev-ninja-bev-e-bikes/ Thu, 10 Nov 2022 11:19:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=3365 హైలైట్స్ 2022 EICMA ఈవెంట్ లో తన ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki Kawasaki ఇంట్రడ్యూస్ చేసిన మోడల్స్: Z BEV మరియు Ninja BEV 2023 లో మార్కెట్ లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ బైక్స్ 2022 EICMA ఈవెంట్ లో ఎన్నో ఆటోమొబైల్ కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేశాయి. అదే ఈవెంట్ లో కవాసాకి తన రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బండ్లను […]

The post రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 2022 EICMA ఈవెంట్ లో తన ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki
  • Kawasaki ఇంట్రడ్యూస్ చేసిన మోడల్స్: Z BEV మరియు Ninja BEV
  • 2023 లో మార్కెట్ లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ బైక్స్

2022 EICMA ఈవెంట్ లో ఎన్నో ఆటోమొబైల్ కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేశాయి. అదే ఈవెంట్ లో కవాసాకి తన రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బండ్లను నింజా ఎలక్ట్రిక్ బైక్, జీ ఎలక్ట్రిక్ అని పిలుస్తున్నారు. ఈ రెండు ఈ-బైక్స్ 2023 లో సేల్ కి రానున్నాయి. అయితే భారత మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతున్నాయో ఇంకా తెలియదు. కంపెనీ కూడా ఇండియాలో లాంచ్ విషయమై ఏ ప్రకటన చేయలేదు. అలాగే ఈ బండ్లు అధికారికంగా Z BEV, Ninja BEV పేర్లతో అమ్మబడతాయని సమాచారం. ఈ రెండు ఈ-బైక్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఎలక్ట్రిక్ Kawasaki Ninja లాంచ్

ప్రస్తుతం ఎలక్ట్రిక్ Ninja, Z మోడల్స్ ఇంకా ప్రోటోటైప్ ఫామ్ లోనే ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుకి రెండు మోడల్స్ అందుబాటులోకి వస్తాయని కవాసాకి మోటార్స్ ప్రెసిడెంట్ హిరోషి ఇటో తెలిపారు. జెడ్400, నింజా 400 బైక్స్ స్పూర్తితో Z BEV, Ninja BEV లను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఈ బండ్లు ఏ1 నార్మ్స్ కి లోబడి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ బైక్స్.

మరోవైపు ఎలక్ట్రిక్ కవాసాకి బండ్లు 11 కిలోవాట్ మోటర్ ని కలిగి ఉన్నాయి. ఇంకా వీటిలో 3.0 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. చార్జింగ్ టైమ్ మరియు టోటల్ రైడింగ్ రేంజ్ వంటి వివరాలు ప్రస్తుతం రివీల్ కాలేదు. అయితే ఈ బైక్స్ పెర్ఫామెన్స్ బాగానే ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. Z BEV ఈ-బైక్ ని వచ్చే ఏడాది యూరప్ లో లాంచ్ చేయాలని కవాసాకి భావిస్తోంది. Ninja BEV ఒక ప్రోటోటైప్ మాత్రమే. కానీ, దీనికి కూడా Z BEV తో కలిసి సేల్ కి వెళ్ళే సత్తా ఉంది. అయితే ఈ బండ్లు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

మూడేళ్ళ క్రితం ఇదే ఈవెంట్ లో, కవాసాకి తీసుకొచ్చిన ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ నింజా 10 కిలోవాట్ మోటర్ ని కలిగి ఉంది. ఇది 20 కిలో వాట్ పీక్ రేటింగ్ కలిగి ఉంది. అలాగే ఈ బండి సింగిల్ చార్జ్ పై 100 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందని కంపెనీ ప్రకటించింది. మరి ఈసారి కవాసాకి పరిచయం చేసిన బండ్లైనా భారత మార్కెట్ లో అడుగుపెడతాయా లేదా అనేది తెలియదు. భారత్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఈ తరుణంలో కవాసాకి కూడా ఈ రెండింట్లో ఓ దాన్ని ఇండియాలో లాంచ్ చేస్తుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని పరిచయం చేసిన Kawasaki first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ ఏడాది లాంచ్ కానున్న Kawasaki Ninja E2, E2-R ఎలక్ట్రిక్ బైక్స్ https://www.91mobiles.com/telugu/kawasaki-to-launch-ninja-e2-e2-r-electric-bikes/ Tue, 30 Aug 2022 13:03:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=2016 హైలైట్స్: ఏ1 క్లాస్ ఎలక్ట్రిక్ బైక్స్ ని లాంచ్ చేయనున్న కవాసాకి 14.8 బీహెచ్‌పీ పవర్, 30బీహెచ్‌పీ పీక్ పవర్ ప్రొడ్యూస్ చేయనున్న కొత్త 125సీసీ క్లాస్ మోటర్ సైకిల్ టూ-మోడల్ లైనప్ లో ఒకటి నేక్డ్ కాగా రెండోది ఫెయిర్డ్ మెషీన్ జపనీస్ మోటర్ సైక్లింగ్ లెజెండ్, కవాసాకి త్వరలో రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని లాంచ్ చేయబోతోంది. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేయబోతున్న తొలి జపనీస్ బైక్ మేకర్స్ గా కవాసాకి నిలవబోతోంది. […]

The post ఈ ఏడాది లాంచ్ కానున్న Kawasaki Ninja E2, E2-R ఎలక్ట్రిక్ బైక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఏ1 క్లాస్ ఎలక్ట్రిక్ బైక్స్ ని లాంచ్ చేయనున్న కవాసాకి
  • 14.8 బీహెచ్‌పీ పవర్, 30బీహెచ్‌పీ పీక్ పవర్ ప్రొడ్యూస్ చేయనున్న కొత్త 125సీసీ క్లాస్ మోటర్ సైకిల్
  • టూ-మోడల్ లైనప్ లో ఒకటి నేక్డ్ కాగా రెండోది ఫెయిర్డ్ మెషీన్

జపనీస్ మోటర్ సైక్లింగ్ లెజెండ్, కవాసాకి త్వరలో రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ని లాంచ్ చేయబోతోంది. దీంతో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేయబోతున్న తొలి జపనీస్ బైక్ మేకర్స్ గా కవాసాకి నిలవబోతోంది. 125సీసీ క్లాస్ మాదిరి ఏ1 క్లాస్ లో కూడా కంపెనీ రెండు మోడల్స్ ని లాంచ్ చేయనుంది. ఈ బండ్లు కవాసాకి దగ్గర ఉన్న పేటెంటెడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీలను వాడుకోనున్నాయి. దాంతో పాటు కవాసాకి యొక్క కోర్ డీఎన్ఏ చాలా వరకు ఈ బండ్లలో కనిపించనుంది. కవాసాకి నింజా ఈ2, నింజా ఈ2-ఆర్ అనే పేర్లతో వీటిని పిలవనున్నారని సమాచారం.

ఈ రెండు ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్ ని గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ చేసేందుకు కవాసాకి ప్లాన్ చేసే అవకాశముంది. మరి వీటిని భారత మార్కెట్ కి తీసుకు వస్తారా లేదా అన్నది ఇంకా తెలియదు. ధర గురించి కూడా ఇప్పుడే ఏం చెప్పలేం. కొన్ని రోజులు ఆగితే గాని ఇతర వివరాలు తెలిసేలా లేవు.

రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్ ని లాంచ్ చేయనున్న Kawasaki

వరుసబెట్టి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్ ని లాంచ్ చేయబోతున్న మొదటి జపనీస్ మోటర్ సైక్లింగ్ బ్రాండ్ గా కవాసాకి నిలవనుంది. ఏ1 లేదా 125సీసీ క్లాస్ కేటగిరీలో రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్స్ ని లాంచ్ చేయాలని కవాసాకి భావిస్తోంది. బ్రిటీష్ మోటర్ సైకిల్ ఫెడరేషన్ కథనాన్ని బట్టి, కవాసాకి ట్విన్స్ పేర్లు నింజా ఈ2, నింజా ఈ2-ఆర్ అని ఉండే అవకాశముంది. ఈ రెండు మోడల్స్ లో ఒకటి నేక్డ్ కాగా మరొకటి ఫెయిర్డ్ మోడల్.

కవాసాకి నింజా ఈ2 ట్విన్స్ 14.8 బీహెచ్‌పీ పవర్ జనరేట్ చేయనున్నాయి. అయితే, నింజా మోడల్స్ ఇతర బండ్ల కంటే మరింత చురుగ్గా ఉండనున్నాయి. హయ్యర్ కెపాసిటీ 300 సీసీ మోటర్ సైకిల్స్ లో 30బీహెచ్‌పీ పవర్ ఉండేలా కవాసాకి ప్లాన్ చేసే అవకాశముంది. ఎలక్ట్రిక్ మోటర్స్ కంటిన్యూస్ అండ్ పీక్ పవర్ అవుట్‌పుట్ ఆధారంగా రేట్ చేయబడటం శుభపరిణామం.

మోటర్ సైక్లింగ్ ఇండస్ట్రీలో కవాసాకి కంపెనీకి ఉన్న నైపుణ్యానికి ఉదాహరణగా కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ నిలవనున్నాయి. కవాసాకి తన యొక్క పేటెంటెడ్ టెక్నాలజీని ఈ బైక్స్ కోసం వాడనుంది. దీంతో ఈ బైక్స్ పెర్ఫమెన్స్ పై అంచనాలు పెరిగే అవకాశముంది. మరి ఆ అంచనాలను ఈ బైక్స్ ఏమేరకు అందుకుంటాయో చూడాలి. మూడేళ్ళ క్రితం కవాసాకి తన రాబోవు ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రోటోటైప్ ని ప్రదర్శించింది. అలాగే, నింజా ఈ2 ట్విన్స్ ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ ని కలిగి ఉంటాయని సమాచారం. ఇది రైడర్స్ కి త్వరగా ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రెయిన్ కి అలవాటు పడేందుకు ఉపయోగపడుతుంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఓటీటీ సమాచారం కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post ఈ ఏడాది లాంచ్ కానున్న Kawasaki Ninja E2, E2-R ఎలక్ట్రిక్ బైక్స్ first appeared on 91Mobiles Telugu.

]]>