Launch timeline - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 05 Oct 2024 15:05:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/#respond Sat, 05 Oct 2024 15:04:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=13930 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం. iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు […]

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2025 లో iPhone SE 4 విడుదల
  • హోమ్ బటన్ లేకుండా వస్తోన్న ఫోన్
  • ఐఫోన్ 14 లుక్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple త్వరలో ఎస్ఈ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iPhone SE 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్‌లైన్ 9to5Mac వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయ్యాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ మరియు రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

iPhone SE 4 గురించి ఇప్పటివరకు తెలిసిన వివరాలు

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ V59 అనే కోడ్ నేమ్ కలిగి ఉంది. ఇది ఆపిల్ నుంచి వస్తోన్న ఎంట్రీ లెవెల్ ఐఫోన్.

ఈసారి వస్తోన్న iPhone SE 4 లో చాలా కాలంగా అందరికీ సుపరిచితమైన హోమ్ బటన్ డిజైన్‌ను ఆపిల్ తీసివేయనుంది. iPhone SE 4 లో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ ఉంటుంది.

ఇక ఎప్పటిలాగే, iPhone SE 4 లో 40ఎంపి 2ఎక్స్ ఇన్-సెన్సర్ జూమ్ కెమెరా, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటాయి.

ఆపిల్ యొక్క సొంత 5జీ మోడెమ్‌తో వస్తోన్న మొట్టమొదటి ఐఫోన్, iPhone SE 4 కావడం విశేషం. ఈ వైర్లెస్ మోడెమ్ కోడ్ నేమ్‌ను సెంటారి అని పెట్టారు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కు సపోర్ట్ ఉంటుంది. ఆపిల్ మోడెమ్ వల్లన ఐఫోన్లు తక్కువ బ్యాటరీ పవర్ వాడుకుంటాయి. హార్డ్‌వేర్‌తో బెటర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. iPhone SE 4 డివైజ్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుండటం మరొక బిగ్ ప్లస్ పాయింట్.

iPhone SE 4 స్పెసిఫికేషన్స్

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1170*2532 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఏ18 చిప్సెట్, 8జిబి ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, 5-కోర్ జీపీయూ వంటి ఫీచర్లతో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇదే 5-కోర్ జీపీయూని ఐఫోన్ 16 సిరీస్ లో కూడా వాడారు.

iPhone SE 4 ధర

iPhone SE 4 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర వివరాలు ఇంకా రివీల్ కాలేదు. అయితే గత ఎస్ఈ మోడల్ కంటే ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం అంతా కూడా లీక్స్ ద్వారా తెలిసినవే. త్వరలోనే అఫీషియల్ గా ఏదైనా ప్రకటన రావొచ్చు. లేదంటే మరిన్ని లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post iPhone SE 4: రివీలైన ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-se-4-key-specs-and-launch-timeline-leaked/feed/ 0
Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/#respond Wed, 14 Aug 2024 13:15:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=13000 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలె ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Samsung Galaxy S24 FE లాంచ్ టైమ్‌లైన్ (లీక్) Samsung Galaxy […]

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ టైమ్‌లైన్
  • అక్టోబర్‌లో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎస్24 సిరీస్ లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలె ఈ డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy S24 FE యొక్క లాంచ్ టైమ్‌లైన్ వివరాలను ETNews తన కథనంలో పేర్కొంది. 2024 అక్టోబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ లాంచ్ టైమ్ సరైనదని అనిపిస్తోంది. ఎందుకంటే, Galaxy S23 FE కూడా ఇదే టైమ్ లో లాంచ్ అయ్యింది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ భారీ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటాయని లీక్ ద్వారా తెలిసింది.

చిప్సెట్: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సొంత చిప్ ఎగ్జినోస్ 2400 తో రానుందని సమాచారం. ఇదే చిప్‌ని గెలాక్సీ ఎస్24 మరియు ఎస్24+ లో కూడా వాడారు.

కెమెరా: Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Samsung Galaxy S24 FE లో పవర్ బ్యాకప్ కోసం 4565 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ, 29 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు 78 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుందని సమాచారం.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24 FE డివైజ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పొట్రెయిట్ స్టూడియో, సర్కిల్ టు సెర్చ్, జనరేటివ్ ఎడిట్, స్కెచ్ టు ఇమేజ్ మరియు లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Samsung Galaxy S24 FE: లీకైన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-fe-launch-timeline-leaked/feed/ 0